ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

-

మొబైల్ ఫోన్ లో కెమెరాకే వస్తువులు పెద్దగా కనిపిస్తున్నాయి.. లెన్స్ కెమెరా గురించి అయితే చెప్పనక్కర్లేదు.. ఫుల్ క్లారిటీ తో బొమ్మ అదుర్స్ అనేలా ఫోటోలు రావడం మనం చూస్తూనే ఉన్నాము..అలాంటిది ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాతో ఫోటోలు ఎంత పెద్దగా వస్తాయో..ఎలా వస్తాయో అసలు సైజు ఎంత ఉంటుంది.. కెమెరా అంతే ఉంటాయా ఇలా చాలా రకాల ప్రశ్నలు మీకు ఎదురవ్వడం పక్కా కదూ..ఆ అతి పెద్ద కెమెరా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి..

ఐదున్నర అడుగుల లెన్స్‌.. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్‌ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్‌ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు..ఈ డిజిటల్‌ కెమెరా 3,200 మెగాపిక్సెల్‌ సామర్థ్యం కలిగి ఉంది. రాత్రి వేళల్లో ఖగోళ చిత్రాలను కచ్చితత్వంతో చిత్రీకరించడం కోసం దీన్ని తయారు చేస్తున్నారు. దాదాపుగా పూర్తైన ఈ కెమెరా ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.

ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చొబెడతారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పా రు. ఆకాశంలో రాత్రి వేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మామూలుగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో.. ఈ కెమెరా ఫొటోలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయని అంటున్నారు.ఆ కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుంది. అంటే టెన్నిస్‌ సింగిల్స్‌ కోర్టు సైజులో ఉంటుంది. 189 సెన్సర్లు కలిగి ఉంటుంది. 2800 కిలోల బరువు ఉంటుంది..ఇంత బరువు ఉంది కాబట్టే వరల్డ్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది కాబోలు..

Read more RELATED
Recommended to you

Latest news