సిడ్నీలో భారత మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ..

-

తెలంగాణ రాజకీయ కురు వృద్ధుడు, భారత మాజీ ప్రధాన మంత్రి దివంగత పీవీ నరసింహారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరం సిడ్నీలో పీవీ విగ్రహాన్ని ప్రవాస భారతీయులు శనివారం ఆవిష్కరించారు. ఈ పరిణామంతో విదేశాల్లో విగ్రహం కలిగిన తొలి భారత ప్రధానిగా పీవీకి అరుదైన గుర్తింపు దక్కింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ తర్వాత విదేశాల్లో వెలసిన తొలి భారత నేత విగ్రహం కూడా పీవీదే కావడం గమనార్హం.

PVNR statue unveiled in Sydney, Telugus laud KCR's efforts

బిలియన్ జనాభాకు ప్రతినిధి పీవీ పేరిట సిడ్నీలో ఈ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఏర్పాటు చేసింది. శనివారం వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణి దేవి పాల్గొన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియాలోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news