ప్రస్తుతం భారత్‌లో స్కూటర్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. బైక్‌తో పోలిస్తే స్కూటర్ నడపడం సులవు. అయితే టీవీఎస్ మోటార్ తన పాపులర్ మోడల్ స్కూటీపెప్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తన స్కూటీ బ్రాండ్‌కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్‌తో సరికొత్తగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌ను ఆవిష్కరించింది. ఇక దీని దీని ధర రూ. 44,764 గా నిర్ణయించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ 87.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఎకో థ్రస్ట్ ఇంజిన్, 4.8 బిహెచ్‌పి, 5.8 ఎన్ఎమ్ పీక్ టార్క్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో మొబైల్ ఛార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, బ్రాండ్ పేటెంట్ పొందిన ‘ఈజీ’ స్టాండ్ టెక్నాలజీ లాంటి అధునాతన ఫీచర్లు జోడించింది. టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తోపాటు వెనుక భాగంలో సింగిల్ షాక్‌తో వస్తుంది. సీబీఎస్, డ్రమ్ బ్రేక్‌లను ఇరువైపులా అమర్చింది.