కొందరు అందరికన్నా ముందుండాలి అనుకుంటారు.. ఏ వస్తువు కొత్తగా లాంఛ్ అయినా.. అది మొదట ఉండాల్సింది నా వద్దే అనుకునేవారు కొందరు.. నేనే నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకునేందుకు మొదటిదాన్ని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు.. పోరాడుతారు.. చివరికి సాధించుకుంటారు… వీరిని మనమంతా ఏమనుకుంటాం.. మొండిఘటం అనుకుంటాం.. అయితే ఇక్కడ ఓ రాజకీయ పార్టీ టిక్‌టాక్ అనే సోషల్ మీడియాలో ఖాతా తెరిచి… మేమే నెంబర్ వన్ లోకానికి చాటింది.. ఇంతకు ఆ పార్టీ ఎక్కడిది.. ఏ దేశానికి చెందింది.. అసలు టిక్‌టాక్ కామెడీలు పంచేందుకు ఏర్పడిన సోషల్‌మీడియా కదా… అనుకుంటున్నారా.. అది జోక్‌ల కోసం ఏర్పాటు చేస్తేంది.. ఏమైతేంది.. ఆ పార్టీ మాత్రం ప్రజలకు చేరువయ్యేందుకు ఏ సోషల్ మీడియా వేదికనైనా ఉపయోగించుకుంటుందట.
అందుకే టిక్‌టాక్‌లో మొదటి ఖాతా తెరిచిన రాజకీయ పార్టీగా అవతరించింది.. ఇది టిక్‌టాక్ చరిత్రలో. ఇంతకు రాజకీయ పార్టీపేరు, అది ఎక్కడిదో చెప్పలేదు.. కదూ.. టిక్‌టాక్‌లో మొదటి ఖాతా తెరిచిన రాజకీయ పార్టీ ఎక్కడిదో కాదు.. పాతబస్తీలో పాగా వేసిన రాజకీయ పార్టీ ఎంఐఎం.. ఓ మన పాతబస్తీ పార్టీనేనా… టిక్‌టాక్ కేవలం సరదా, వినోదాలు, సాహస కృత్యాలు పంచుకునే వేధికగా నిలిచింది.. అందుకోసమే ఎక్కువగా ఈ టిక్‌టాక్‌ను అనేకమంది ఉపయోగిస్తున్నారు. ఈ టిక్‌టాక్‌తో అనేక నష్టాలు, లాభాలు ఉన్నాయి.. ఇది కొందరికి రియాల్టి వేధికగా మారగా, కొందరికి హాస్యం పంచే వేధికగా నిలిచింది. అయితే ప్రజలకు చేరువయ్యేందుకు ఏ వేధికైంతేది.. అది సరదా, వినోదాలు పంచే టిక్‌టాక్ అయితేంది.. అందులో మొదటి ఖాతా తెరిచింది ఎంఐఎం..
అయితే ఎంఐఎంకు ఇప్పుడు సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు చేరువకావాలనే తాపత్రయంలో ఉంది. అందుకే ట్విట్టర్‌ను వేధికగా చేసుకుని ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ నిర్ణయాలను, సందేశాలను, నేత ప్రసంగాలను పోస్టు చేస్తుంది. అందుకే ఎక్కువగా సరదా, వినోదాల కోసం ఉపయోగిస్తున్న టిక్‌టాక్‌లో పార్టీ సందేశాలు పంపితే సాధారణ జనంకు, అన్నివర్గాల ప్రజలకు తన పార్టీ సందేశాలను చేరవేయవచ్చని ఆలోచించిందట..అందుకే ఈ సరదా, వినోదాల టిక్‌టాక్‌లో మొదటి రిజిష్టర్ చేసుకున్న పార్టీగా ఎంఐఎం అవతరించింది. ముస్లీం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలక్రమేణా రాజకీయ పార్టీగా అవతరించి ప్రజాసేవలో తరిస్తుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పార్టీని మార్చుకుంటూ హైదరాబాద్ కేంద్రంను అడ్డాగా చేసుకుని దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న దశకు చేరుకుంది. పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ నూతన ఉత్తేజాన్ని కార్యకర్తల్లో నింపుతూ పార్టీని క్రమక్రమంగా నలుదిశలా వ్యాప్తించేలా కృషి చేస్తున్నారు పార్టీ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ. సామాజిక మాద్యమాలను ఉపయోగించుకుంటూ పార్టీ సందేశాలను చేరవేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పుటు టిక్‌టాక్ అనే వినోదాల వేదికను ఉపయోగించుకోవాలను కోవడం, అందులో చేరడం చూస్తుంటే.. ఇక వినోదాల వేదిక కాస్త మరో రాజకీయ వేదికగా మారబోతుందన్నమాట..