26 వేలకే 43 ఇంచ్ MI 4K UHD స్మార్ట్ టీవీ.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మొదలైన వివరాలివే..!

మీరు ఏదైనా స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మంచి టీవీ కోసం చూస్తున్నారా..? అయితే Mi బడ్జెట్ ధరలో ఇండియాలో ప్రకటించిన Mi TV 4X 43 స్మార్ట్ టీవీ గురించి చూడాల్సిందే. ఈ స్మార్ట్ టీవీ అదిరే ఫీచర్స్ తో వచ్చింది. పైగా ఈ టీవీ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. మరి ఇక ఈ టీవీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ Mi టీవీ 4X 43 ఇంచ్ UHD (4K) స్మార్ట్ టీవీ ని కొనుగోలు చెయ్యాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ మరియు mi.com నుండి డిస్కౌంట్ అఫర్ తో కేవలం 26,999 రూపాయల ధరతో కొనచ్చు. ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి వచ్చిన తరువాత 3,000 రూపాయల డిస్కౌంట్ తో వస్తోంది. ఇక ఈ టీవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి చూస్తే.. ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి వివిడ్ పిక్చర్ ఇంజన్ ను HDR 10 సపోర్ట్ తో కలిగివుంది.

అలానే ఈ టీవీ గొప్ప సౌండ్ ని ఇవ్వడానికి డాల్బీ మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ స్మార్ట్ టీవీ మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది ఈ టీవీ. Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ కూడా ఈ స్మార్ట్ టీవీ లో వున్నాయి. Patchwall UI మరియు Android Tv 9.0 OS తో పని చేస్తుంది ఇది.

ఇక ఈ టీవీ ఆఫర్స్ గురించి చూస్తే.. ఈ స్మార్ట్ టీవీ కి అమెజాన్ నుండి SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1250 రూపాయలు తగ్గుతాయి. HDFC డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది.