రూ.14,499 నుండే నోకియా టీవీలు… ఫీచర్స్ ఇవే..!

మీరు ఏదైనా మంచి టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? ఏ టీవీని కొనాలి అని తికమక పడుతున్నారా..? అయితే తప్పకుండ ఈ టీవీల గురించి చూడాలి. భారత్‌లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ ఎక్కువవుతోంది. చాలా బ్రాండ్లు స్మార్ట్ టీవీలను తీసుకు వచ్చాయి.

 

ఇప్పుడు నోకియా కూడా 2022 లైనప్‌లో కొత్తగా ఐదు స్మార్ట్ టీవీలను భారత్‌లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. 4K UHD రెజల్యూషన్‌తో మూడు టీవీలు లాంచ్ అయ్యాయి. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీలు పని చేస్తాయి.

క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ ని కూడా ఈ టీవీలు ఇస్తాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండే 24వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను, డ్యుయల్ బ్యాండ్ వైఫైను కలిగి ఉన్నాయి. మరి టీవీల వివరాలని కూడా చూసేద్దాం.

నోకియా 2022 స్మార్ట్ టీవీ లైనప్‌లో మూడు మోడల్స్ 3840 x 2160 పిక్సెల్స్ 4K UHD రెజల్యూషన్‌తో వస్తున్నాయి. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ 4K స్మార్ట్ టీవీలు వచ్చాయి. HDR 10, MEMC సపోర్ట్ ని కలిగి వున్నాయి. నోకియా కొత్త 32 ఇంచుల ఆండ్రాయిడ్‌ టీవీ 1366×768 పిక్సెల్ HD రెజల్యూషన్ డిస్‌ప్లేతో రాగా.. 40 ఇంచుల మోడల్ 1920×1080 రెజల్యూషన్ ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి వుంది.

క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలానే క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ వుంది. స్టోరేజ్ చూస్తే.. ఈ టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వున్నాయి. ధర విషయానికి వస్తే.. నోకియా 32 ఇంచుల HD LED స్మార్ట్ టీవీ ధర రూ.14,499 గా వుంది. 43 ఇంచుల వేరియంట్ ధర రూ.27,999 ఉండగా.. 50 ఇంచుల మోడల్ ధర రూ.33,990 గా వుంది. అలానే 55 ఇంచుల టాప్‌ వేరియంట్ ధర రూ.38,999గా ఉంది.