గూగుల్ సెర్చ్ లో టాప్… వర్జిన్ వధువే కావాలి

నేటి స‌మాజంలో కూడా అబ్బాయిలు త‌మ జీవిత భాగ‌స్వామిగా వ‌ర్జిన్ అమ్మాయిల‌ను కోరుకుంటున్నార‌ట‌. ఇది స‌హ‌జ‌మే. అయితే అంత‌టితో ఆగ‌కుండా అమ్మాయి వ‌ర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. మ‌న దేశంలో పెళ్లి కుమారులు వర్జినిటీకే అగ్ర తాంబూలం వేస్తున్నారట. ఈ క్ర‌మంలోనే గూగుల్ సెర్చ్‌లో నమ్మలేని మరెన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు అమ్మాయికి ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందా..? నిజంగా కన్యేనా అని తెలుసుకోవాలని నేటితరం యువకులు తెగ ఊర‌ట ప‌డుతున్నార‌ట‌.

ఢిల్లీ, హరియాణా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్జినిటీ టెస్ట్ గురించే నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారట. నిజంగా అమ్మాయి వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని అత్యుత్సాహం చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. వర్జినిటీ టెస్ట్ ఫర్ విమెన్, వర్జినిటీ టెస్ట్ ఫర్ ఫీమేల్, ఇంట్లోనే వర్జినిటీ టెస్ట్ ఎలా చేయడం? తదితర కీ వర్డ్‌లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడైంది. పెరిగిన సంస్కృతి, సంప్రదాయ పద్ధతుల కారణంగా ఇలాంటివి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఓ అధ్యయనం పేర్కొంది.

వాస్త‌వానికి ఒకప్పుడు వ‌ర్జిన్‌ పరీక్షలు నిర్వహించేవారు. తొలిరాత్రి తర్వాత రక్తపు మరకలు ఉన్నాయా ? లేదా అని కూడా పరీక్షించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఈ విషయంలో మార్పు వచ్చింది. నేటి స‌మాజంలో ఇలాంటివి నిర్వ‌హించ‌డం మానేసి న‌మ్మ‌కంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు అని ఈ ఆధ్యాయ‌నం తేల్చేసింది.

నేటి స‌మాజంలో కూడా వధువు వర్జిన్ అయితే అదృష్టవంతులమని పెళ్లి కుమారులు భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. టెక్నాలజీ మారుతున్నప్పటికీ.. అందరూ విద్యావంతులు అవుతున్నప్పటికీ.. పురుషుల్లో వర్జినిటీ మీద ఉన్న అభిప్రాయం మారడం లేదని ఈ ఆధ్యాయ‌నం తెలిపింది. ఈ క్ర‌మంలోనే దీనికి సంబంధించిన కీ వర్డ్‌లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు.