అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన వివో వై51ఎ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే ?

Join Our COmmunity

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లో కొత్త‌గా వై51ఎ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. వై సిరీస్‌లో వివో నుంచి వ‌చ్చిన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగా పిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాలు ఇందులో ఉన్నాయి.

Vivo Y51A smart phone launched in india

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క భాగంలో ఉంది. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది.

వివై వై51ఎ ఫీచ‌ర్లు…

* 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
* 2408 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్‌
* 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
* డ్యుయ‌ల్ సిమ్, 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వై51ఎ స్మార్ట్ ఫోన్ టైటానియం స‌ఫైర్‌, క్రిస్ట‌ల్ సింఫ‌నీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడులైంది. ఈ ఫోన్ రూ.17,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర ల‌భిస్తుంది.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news