మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌

వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ‘వ్యూ వన్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రస్తుతం కేవలం వాట్సాప్‌ whatsapp బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా… త్వరలోనే అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

వ్యూ వన్స్‌ ఫీచర్‌ విషయానికి వస్తే… వాట్సాప్‌లో ఇతరులు పంపిన ఫొటో,వీడియో,గిఫ్‌ ఫైల్ లను కేవలం ఒక్కసారే చూసేలా చేయటమే ఈ వ్యూ వన్స్‌ ఫీచర్‌. ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే … అవతలి వారు ఒకసారి చూడగానే అవి ఆటోమాటిక్ గా ఛాట్ స్క్రీన్‌ నుంచి డిస్‌అపియర్‌ అయిపోతాయి. సెండర్‌తో పాటు రిసీవర్‌ ఛాట్‌ స్క్రీన్‌ నుంచి కూడా పంపిన ఫైల్ పూర్తిగా డిలీట్‌ అయిపోతుంది. అయితే ఫొటోలు,వీడియోలు పంపిన ప్రతిసారి ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్‌ గ్రూప్‌లలోనూ ఈ ఆప్షన్‌ పనిచేస్తుంది. అయితే గ్రూపు సభ్యులు అందరూ చూసిన తర్వాతే ఫొటో కానీ వీడియో కానీ డిస్‌అపియర్‌ అవుతుంది. గ్రూప్‌ సభ్యుల్లో మీరు బ్లాక్‌ చేసిన వ్యక్తులు కూడా వ్యూ వన్స్‌ ఫీచర్ ద్వారా పంపిన ఫొటో,వీడియోలను చూసే వీలుంది. అయితే ఫొటో,వీడియోలను గ్రూపులో ఎవరెవరు చూశారనేది మెసేజ్‌ ఇన్ఫో సెక్షన్‌లో తెలుస్తుంది.