ఇక నుంచి వాట్సాప్ లోన్స్…!

-

వాట్సాప్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కేవలం అది కేవలం మెసేజ్ లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే యాప్ అని. కాని ఇప్పుడు అది తమ యూజర్ల ఆర్ధిక కష్టాలు తెలుసుకుని అండగా నిలవాలి అని భావిస్తుంది. వాట్సాప్ యూజర్లకు లోన్స్ ఇవ్వాలని చూస్తుంది. పేమెంట్స్ సర్వీసుని ప్రారంభించడానికి వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుమతులు ఇంకా రాలేదు.

ఈ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అయిన తర్వాత లోన్ మార్కెట్‌లో కూడా అడుగుపెట్టాలని భావిస్తుంది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తమ బిజినెస్ వివరాలను తెలియజేసింది సంస్థ. వాట్సప్ పేమెంట్స్‌ మాత్రమే కాకుండా… క్రెడిట్ సేవల్ని కూడా అందిస్తామని అందులో వివరించింది. వాట్సప్ బిజినెస్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడితే ఇక వినియోగదారులు వాట్సప్ నుంచే పర్సనల్ లోన్లు తీసుకునే సదుపాయం ఉంటుంది.

ఇప్పటికే తమ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ లోకల్ డేటా ప్రొటెక్షన్ అండ్ స్టోరేజ్ రెగ్యులేషన్స్‌కు తగ్గట్టుగానే పనిచేస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రకటనలో వివరించింది. మే నాటికి ఈ వ్యవస్థను రూపొందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI వాట్సప్ పేమెంట్స్‌కు ఫిబ్రవరిలోనే ఆమోద ముద్ర వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news