ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో కొన్ని వేల మంది చికిత్స తీసుకుంటూ చనిపోగా, మరికొంతమంది కరోనా నీ జయించగలిగారు. ఇన్ని విధాలుగా మనిషిని మూప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ పనితనాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ కి సంబంధించి విలక్షణత ఏమిటంటే… మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత అది తన రూపుని శరీర అనుకూలంగా మార్చుకుంటుందట. ఈ విధంగా కరోనా వైరస్ పది రకాలుగా శరీరంలో మారుతుందని ఆ తర్వాత మనిషి ప్రాణం తో ఆడుకుంటుంది అని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. ఈ పది రకాల వైరస్ లే ప్రస్తుతం భూమి బాగా ప్రభావితం చేస్తున్నాయి. వ్యూహన్ లో కనిపించిన వైరస్ ఒకరకమైతే, అమెరికా లో కనిపించిన వైరస్ మరో రకమైన వైరస్ అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మందిని బలి తీసుకోవడానికి కారణం ‘‘ఏ2ఏ’’ వైరస్ అని అంటున్నారు. వూహాన్ లో కనిపించిన వైరస్ అన్ని కరోనా వైరస్ లోకెల్లా అతి పెద్ద డేంజర్ వైరస్ అని ఆ తర్వాత అలాంటి డేంజర్ ఉన్న వైరస్ ‘‘ఏ2ఏ’’ అని చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ‘‘ఏ2ఏ’’ వైరస్ ప్రభావం ఉంటే ఇండియాలో దీని ప్రభావం 45 శాతం ఉందని చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో ఈ వైరస్ విజృంభించి ఉందని అందుకే అన్ని వేల కేసులు నమోదు అవుతున్నాయని సైంటిస్టులు ఇటీవల తేల్చారు. ‘‘ఏ2ఏ’’ వైరస్ ఊపిరితిత్తులలో ప్రవేశించి చాలా సైలెంట్ గా శరీరంలో బలపడి ఒక్కసారిగా ప్రాణాన్ని బలి తీసుకోవడం దీని స్పెషాలిటీ అని తాజా పరిశోధనలో గుర్తించారు.