బాబుకు ఫైర్ బ్రాండ్ల ప్రశ్నలు.. ఆన్సర్లు ఇచ్చే ధైర్యం చేస్తారా?

-

విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఆచితూచి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. సంక్షోభ సమయంలో రాజకీయాల్ని మానేసి.. ఎక్కువ తక్కువల్ని చూసిచూడనట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతుంటారు. ఈ చిన్న విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మర్చిపోతున్నారు. ఏపీలోని పరిస్థితులపై ఆయన మాట్లాడుతున్నతీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిర్దారిత పరీక్షలు పెద్ద ఎత్తున చేపడుతున్న వేళలో.. కేసుల నమోదు సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయి. జాతీయ సగటు కంటే ఏపీలో తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నా.. విపక్ష నేత మాత్రం అందుకు భిన్నంగా  వ్యవహరిస్తున్నారు. కరోనాపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని నిర్మాణాత్మకంగా తప్పు పట్టటాన్ని ఎవరూ కాదలేరు. అందుకు భిన్నంగా రాజకీయం కోసం.. పొలిటికల్ మైలేజీ కోసం చేసే ప్రయత్నాలు ఏ మాత్రం సరికాదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యాన్ని.. నమ్మకాన్ని మరింతపెంచేలా చేయాలే తప్పించి మాటలతో భయపెట్టకూడదు. బ్యాడ్ లక్ ఏమంటే.. టీడీపీ అధినేత ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు. కరోనా నివారణ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నది బాబు యోచనగా చెబుతున్నారు. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ వెళ్లిన ఆయన.. అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సందేశాల్ని ఇస్తున్నారు. బాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ అధికారపక్షానికి చెందిన ఫైర్ బ్రాండ్ నేతలు. తాజాగా మంత్రి అనిల్ కుమార్.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బాబు చేసిన విమర్శల్ని తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని ప్రశ్నల్ని సంధించారు. బాబు వాటికి సమాధానాలు చెబుతారా? అంటూ సవాలు విసిరారు. ఇంతకూ వారు సంధించిన ప్రశ్నాస్త్రాలు ఏమంటే..

ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ కుటుంబంలోని వారికి కరోనా వచ్చిందని అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ ఫ్యామిలీలు నలుగురు వైద్యులు ఉన్నారు. వారంతా కరోనాతో పోరాడే క్రమంలో పాజిటివ్ అయితే.. వారిని అవహేళన చేస్తూ మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్లో కనీసం పది శాతం మందైనా బయటకు వచ్చి పేదల్ని ఆదుకున్నారా? బాబు మంచి చేయకున్నా ఫర్లేదు.. కానీ తన మాటలతో ప్రజల్ని భయపెట్టొద్దు. ఆయన రాజకీయాలకు ఏపీ కావాలి.. ఉండేందుకు మాత్రం హైదరాబాద్ కావాలా? కరోనా నివారణలో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని ప్రధాని.. కేంద్రమంత్రులు.. జాతీయ మీడియా చెబుతున్న మాటలు బాబుకు వినిపించవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం బాబు చేస్తారా?

Read more RELATED
Recommended to you

Latest news