వాట్సాప్‌లో రానున్న మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. డేటా ట్రాన్స్‌ఫ‌ర్ ఇక సుల‌భం..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్ప‌టికే ప్రపంచంలో నంబ‌ర్ వ‌న్ మెసేజింగ్ యాప్‌గా కొన‌సాగుతోంది. ఎన్నో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త వివాదాలు వాట్సాప్‌ను చుట్టు ముడుతున్నాయి. ఇందులో భాగంగానే వాట్సాప్ ఆ వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఉన్న యూజ‌ర్లు ఇత‌ర ప్లాట్‌ఫాంల వైపు మ‌ళ్ల‌కుండా ఉండేందుకు గాను ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూనే వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను వాట్సాప్ అందివ్వ‌నుంద‌ని తెలిసింది.

whatsapp soon to introduce chat transfer feature

వాట్సాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై వాడితే ఇంకో ప్లాట్‌ఫాంకు మారితే పాత ప్లాట్‌ఫాంలోని చాట్ డేటాను కొత్త దాంట్లోకి పొంద‌లేరు. అందుకు నేరుగా వాట్సాప్ ఎలాంటి స‌దుపాయాన్ని అందివ్వ‌డం లేదు. థ‌ర్డ్ పార్టీ యాప్‌లు ఏదా సాఫ్ట్‌వేర్ల‌పై ఆధార ప‌డాల్సి వ‌స్తోంది. ఇది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అప్ప‌టి వ‌ర‌కు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలో వాట్సాప్‌ను వాడేవారు ఐఓఎస్‌కు మారితే వాట్సాప్ డేటాను ఆయా డివైస్‌ల మ‌ధ్య ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నిగా మారింది. అలాగే ఐఓఎస్‌లో వాట్సాప్ వాడేవారు ఆండ్రాయిడ్‌కు మారినా డేటాను బ‌దిలీ చేయ‌డం క‌ష్టంగా ఉంటుంది.

కానీ ఇక‌పై వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను తానే అందివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యూజ‌ర్లు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఏ ప్లాట్‌ఫాం వాడినా స‌రే.. ఒక డివైస్ నుంచి మ‌రొక డివైస్‌కు వాట్సాప్ డేటాను సుల‌భంగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసేలా వాట్సాప్ కొత్త ఫీచ‌ర్‌ను తానే అందివ్వనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. అందువ‌ల్ల త్వరలోనే ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంద‌ని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news