వాట్సాప్ సూపర్ ఫీచర్…! అడ్మిన్స్ కి ఇక ఆ అధికారం…!

రోజు రోజుకీ వాట్సాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్స్ ని తీసుకు వస్తుంది. పైగా వాట్సాప్ గ్రూప్స్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది.

చాలా సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు పోస్ట్ చేసే పోస్టుల వల్ల అడ్మిన్స్ కు చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ ఫీచర్ వాలా కాస్త రిలీఫ్ ని అడ్మిన్స్ పొందొచ్చు. ఇక ఈ కొత్త ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. సాధారణంగా గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ను డిలీట్ చేయాలంటే మెసేజ్ పంపిన వ్యక్తి మాత్రమే డిలీట్ చేయడం అవుతుంది.

అయితే ఆ సందర్భాల వలన అడ్మిన్స్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అడ్మిన్ లు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు ఈ కొత్త ఫీచర్ తో. ఈ ఫీచర్ త్వరలోనే రానుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలిపింది.

గ్రూప్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న మెసేజ్లను, అభ్యంతరకంగా ఉన్న మెసేజ్స్ ని గ్రూప్ అడ్మిన్స్ ఇక నుండి ఈజీగా డిలేట్ చెయ్యచ్చు. ఈ ఫీచర్ ద్వారా 16 సెకన్లు, 8 నిమిషాలు, గంటలో మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్ తో పాటు డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.