వావ్ వైర్‌లెస్‌ టీవీలు…! ఎలా పని చేస్తాయంటే…?

-

రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతోంది. దీనితో అనేక కొత్త మార్పులు కూడా వస్తున్నాయి. ఇటీవలే స్మార్ట్‌ ఫోన్‌ల చార్జింగ్‌ కోసం అందుబాటు లోకి వచ్చిన వైర్‌లెస్‌ టెక్నాలజీ గురించి తెలిసినదే. అయితే అదే రీతి లో ఇప్పుడు టెలివిజన్‌లకు రావడం విశేషం. మరి ఈ వైర్‌లెస్‌ టెలివిజన్‌ల గురించి పూర్తిగా చూస్తే.. రష్యాకు చెందిన రెజొనెన్స్ అనే స్టార్టప్‌ కంపెనీ దీనిని ప్రారంభం చేయడం జరిగింది.

ఈ టీవీల్లో కేబుల్‌ కి బదులుగా వైఫై పద్ధతి లో విద్యుత్‌ సరఫరా చేయడం ద్వారా ఇది పని చేయనుంది. వావ్ భలే ఉంది కదా…! అలానే సరికొత్త టెక్నాలజీని సీఈఎస్‌ 2021 లో ప్రదర్శించారు. అయితే వైఫై పద్ధతి లో విద్యుత్‌ను సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని స్వీకరించే రిసెప్షన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉంటె ఈ వైర్‌లెస్‌ పద్ధతి లో విద్యుత్‌ను స్వీకరించే రిసీవర్‌ కాయిల్‌ను టీవీ లోపల ఉండే లాగ ఫిట్ చేసారు. ప్రసారం చేసే ట్రాన్స్‌ మీటర్‌ను టీవీ దగ్గర ఉన్నట్టు కూడా రెజొనెన్స్‌ కంపెనీ చెప్పింది.

దీని మూలంగా ఒక మీటర్‌ దూరం వరకు విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్‌ సైజును కనుక మార్చితే ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని అన్నారు. ట్రాన్స్‌ మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్‌ అడుగునగానీ, గోడ లోపల గాని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. రెజొనెన్స్‌ తన టెక్నాలజీ పై అమెరికా తో పాటు భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, దక్షిణ కొరియా లోని పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news