విజయ్ సేతుపతి మరో అద్భుత ప్రయోగం.. మాటలు లేకుండానే..

-

తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే, విలన్ గా మెప్పిస్తూ, ఏ పాత్ర చేసినా తన ప్రత్యేకతని చాటే విజయ్ సేతుపతి, తన తర్వాతి చిత్రంతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. మాటలు లేకుండా మూకీ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. భారతీయ వెండితెరపై మూకీ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ వాటిల్లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండు, మూడింటికీ లేవు. టాకీ వచ్చిన తర్వత మూకీ సినిమా చేసి రిస్క్ చేయాలని ఎవరూ అనుకోరు.

ప్రస్తుతం విజయ్ ఆ రిస్క్ తీసుకుంటున్నాడు. కిషోర్ పాండురంగ్ బేలెకర్ దర్శకత్వంలో ఈ మూకీ సినిమా రూపొందుతుంది. గాంధీ టాక్స్ అనే టైటిల్ తో సినిమా నిర్మితమవుతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నోట్లకట్టలు కనిపించాయి. కాబట్టి ఈ సినిమా డబ్బు ప్రధాన అంశంగా రూపొందుతుంది. డబ్బు మీద సినిమా, మాటలు లేని సినిమా, మరి విజయ్ సేతుపతి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news