ఇక జియో ఫైబర్‌తో వెబ్‌క్యామ్‌ లేకుండానే టీవీలో వీడియో కాల్స్‌ చేయవచ్చు!

-

జియో ఫైబర్‌ ( Jio Fiber ) బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు ఈ వార్త గుడ్‌ న్యూస్‌. వెబ్‌ కెమెరా అవసరం లేకుండానే టీవీ నుంచి వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. సా«ధారణంగా వీడియో కాల్స్‌ చేయాలంటే సెల్ఫీ కెమెరా ఆన్‌ లో ఉండాలి. లేకపోతే వీడియో కాల్స్‌ చేయలేరు. ల్యాప్‌టాప్‌లో వీడియో కాల్స్‌ చేయాలన్నా ల్యాప్‌టాప్‌కు కెమెరా ఉండాలి. ఇక డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో వీడియో కాల్స్‌ చేయడానికి వెబ్‌క్యామ్‌ ఉండాల్సిందే! టీవీలో కూడా వీడియో కాల్స్‌ చేయొచ్చు.

jio Fiber | జియో ఫైబర్‌
jio Fiber | జియో ఫైబర్‌

 

దీనికి కూడా వెబ్‌క్యామ్‌ కావాలి. అయితే, వెబ్‌క్యామ్‌ లేకుండా కూడా టీవీ నుంచి వీడియో కాల్స్‌ చేయొచ్చు. జియో ఫైబర్‌ యూజర్లకు రిలయెన్‌ జియో అందిస్తున్న అద్భుతమైన ఫీచర్‌ ఇది. దీన్ని ’కెమెరా ఆన్‌ మొబైల్‌’ పేరుతో అందిస్తోంది. దీనికి జియో జాయిన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో దీనిపేరు జియోకాల్‌గా ఉండేది. ఈ యాప్‌ ద్వారా జియోౖ ఫెబర్‌ వాయిస్‌ వీడియో కాల్స్‌ చేయొచ్చు. టీవీలో వీడియో కనిపిస్తుంది. ’కెమెరా ఆన్‌ మొబైల్‌’ ఫీచర్‌ను చాలాకాలంగా పరీక్షిస్తోంది జియో ఫైబర్‌. ఈ ఫీచర్‌ సక్సెస్‌ కావడంతో తమ వినియోగదారులకు విడుదల చేసింది.

మీరు స్మార్‌ఫోన్‌ లోని కెమెరా ఆధారంగా టీవీ ద్వారా వీడియో కాల్స్‌ చేయడానికి ముందుగా 10 అంకెల జియో ఫైబర్‌ నంబర్‌ను జియోజాయిన్‌ యాప్‌లో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జియోజాయిన్‌ యాప్‌ సెట్టింగ్స్‌లో ‘కెమెరా ఆన్‌ మొబైల్‌’ ఫీచర్‌ ఎనేబుల్‌ చేయాలి. ఆ తర్వాత మీ టీవీ నుంచి వీడియో కాల్స్‌ చేయొచ్చు. వీడియో కాల్స్‌ క్లారిటీ బాగా ఉండటానికి మోడెమ్‌లో 5 జీహెచ్‌జెడ్‌ వైఫై బ్యాండ్‌ ఆన్‌ చేయాలి. ఇక మీరు ఈ ఫీచర్‌ను ఎంజాయ్‌ చేసేయోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news