జియో రీఛార్జ్‌ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌!

దిగ్గజ రిలయెన్‌ ్స జియో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పేటీఎం, ఫోన్‌ పే, ఇతర పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా జియో రీఛార్జ్‌ ( Jio Recharge ) చేస్తే క్యాష్‌బ్యాక్‌  ఆఫర్‌ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
2021 ఆగస్ట్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది జియో. ఈ ఆఫర్‌ ప్రస్తుత జియో వినియోగదారులకు మాత్రమే కాదు, కొత్త యూజర్లు కూడా పొందొచ్చు. ఆఫర్ల భాగంగా క్యాష్‌బ్యాక్‌తో పాటు మరెన్నో ఆఫర్స్‌ ఉన్నాయి.

jio Recharge | జియో రీఛార్జ్‌
jio Recharge | జియో రీఛార్జ్‌

 

  • కొత్త జియో వినియోగదారులు పేటీఎం ద్వారా రీఛార్జ్‌ చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. రూ.250 కంటే ఎక్కువ క్రెడిట్‌ లభిస్తుంది. ఇక ప్రస్తుత జియో యూజర్లు పేటీఎం ద్వారా రీఛార్జ్‌ చేస్తే 1500 పేటీఎం ఫస్ట్‌ పాయింట్స్‌ వస్తాయి. కానీ, ఈ ఆఫర్‌ కేవలం మొదటి నుంచి ఆరో రీఛార్జ్‌ వరకే ఇది వర్తిస్తుంది.
  • ఫోన్‌ పే ద్వారా కొత్త జియో రీఛార్జ్‌ చేస్తే రూ.600 వరకు రివార్డ్స్‌ లభిస్తాయి. పస్తుత జియో యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.400 రివార్డ్స్‌ లభిస్తాయి.
  • అమెజాన్‌ ద్వారా కొత్త జియో యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.50 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. పాత యూజర్లు ఈ ఆఫర్‌తో రీఛార్జీ చేస్తే.. రూ.125 వరకు రివార్డ్స్‌ పొందవచ్చు.
  • మొబీక్విక్‌ ద్వారా జియో కొత్త యూజర్‌ రీఛార్జ్‌ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇక ప్రస్తుత జియో యూజర్‌ రీఛార్జ్‌ చేస్తే రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. కొత్త యూజర్‌ రూ.399 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • ఫ్రీఛార్జ్‌ ద్వారా పాత యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.1000 వరకు రివార్డ్స్‌ పొందొచ్చు. ప్రతీ రీఛార్జ్‌పై ఈ ఆఫర్‌ ఉంది. కొత్త యూజర్‌ రూ.199 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే రూ.40 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.