వాట్సప్‌ కాల్స్‌ను ఇలా రికార్డ్‌ చేయండి!

-

వాట్సప్‌ కాల్స్‌ను రికార్డు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్‌ ట్రిక్‌తో వాట్సప్‌ కాల్స్‌ను రికార్డు చేయండి. అది ఎలాగో ఇపుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్య వాట్సప్‌ ప్రైవసీ వివాధంలో చిక్కుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన వాట్సప్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎనిక్రిప్టెడ్‌ ఉన్నందుకే వినియోగదారుల సందేశాలను, ఫోటోస్, వీడియోలను ఇతరులు చదవలేరు, చూడలేరని వివరణ ఇచ్చింది. పైగా ఈ ఎండ్‌ టూ ఎండ్‌ ఎనిక్రిప్టెడ్‌ వల్లే వాట్సప్‌ ద్వారా ముఖ్యమైన విషయాలు మాట్లడుకుంటారని తెలిపింది. కానీ, వాట్సప్‌ కాల్స్‌ రికార్డు చేయడం సాధ్యం కాదని తెలిపింది. కానీ, కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే వాట్సప్‌ కాల్స్‌ను కూడా రికార్డు చేయవచ్చు. అయితే దీనికోసం థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. మరి వాట్సప్‌ కాల్‌ ఎలా రికార్డు చేయాలో తెలుసుకుందాం.

  • ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ప్లేస్టోర్‌ నుంచి కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • అందులో వాట్సప్‌ కాల్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఇక వాట్సప్‌ కాల్‌ ఈజీగా రికార్డ్‌ అయిపోతుంది.
  • వాట్సప్‌ కాల్‌ రికార్డింగ్‌ కోసం డౌన్‌లోడ్‌ చేసే «థర్డ్‌ యాప్‌లను జాగ్రత్తగా చేసుకోవాలి. మన డేటాను చోరీ చేసే యాప్‌లు కూడా ఉంటాయి.
  • ఐఓఎస్‌ మొబైల్‌ వినియోగదారులయితే వాట్సప్‌ కాల్‌ రికార్డింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్‌ బుక్‌కి కనెక్ట్‌ చేసి, క్విక్‌ టైం పైన క్లిక్‌ చేస్తే ఆడియో రికార్డు అయిపోతుంది.
    ఈ విధంగా వాట్సప్‌ కాల్‌ రికార్డింగ్‌ చేసే ఆప్షన్‌లు ఉన్నాయి. వాట్సప్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌ లేదన్న కారణంగా అమ్మాయిలను వేధించే వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు ఈ వాట్సప్‌ కాల్‌ రికార్డింగ్‌ ద్వారా వారికి చెక్‌ పెట్టవచ్చు. దీనివల్ల  రిఛార్జీ అయిపోయిన నెట్‌ వాట్సప్‌ కాల్‌ ద్వారా కాల్‌ రికార్డింగ్‌ చేయవచ్చు . మీకు వాట్సప్‌ కాల్‌ రికార్డు చేయాలనుకుంటే వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి. అయితే సెక్యూర్డ్‌ యాప్‌లను కేవలం ప్లేస్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తెలియని లింక్‌ ల ద్వారా ఏ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. దీనివల్ల హ్యాకర్సుకు మనమే మన డేటా వారి చేతిలో పెట్టినట్టవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news