వ‌చ్చేసింది.. షియోమీ ఎంఐ 10ఐ స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలివే..!

Join Our Community
follow manalokam on social media

మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ ఎంఐ 10ఐ ని భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఆ కంపెనీకి చెందిన లేటెస్ట్ మిడ్ రేంజ్ 5జి ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 750జి ప్రాసెస‌ర్ ఉంది. అందువ‌ల్ల ఇందులో 5జి ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తుంది.

Xiaomi Mi 10i smart phone launched in india

షియోమీ ఎంఐ 10ఐ స్మార్ట్ ఫోన్‌లో వెనుక భాగంలో 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ క‌లిగిన కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది దీనికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఆ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ సూప‌ర్ మాక్రో సెన్సార్‌, ఇంకో 2 మెగాపిక్స‌ల్ సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ ముందు, వెనుక భాగాల్లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను క‌లిగి ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఇచ్చారు. అలాగే వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. ఇందులో 4820 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ 10ఐ ఫీచ‌ర్లు…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్, ఆక్టాకోర్ 750జి ప్రాసెస‌ర్
* 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* 108, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
* 4820 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

షియోమీ ఎంఐ 10ఐ స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, అట్లాంటిక్ బ్లూ, ప‌సిఫిక్ స‌న్‌రైజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.20,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.21,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.23,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో జ‌న‌వ‌రి 7వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. త‌రువాత రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్ర‌యిస్తారు. ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల‌తో రూ.2వేల వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. జియో క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.10వేల వ‌ర‌కు విలువైన ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...