ఈ 9 యాప్స్‌తో మీ ఫోన్ కెమెరా అద్భుతమైన ప‌నులు చేయ‌గ‌ల‌దు..!

-

స్మార్ట్‌ఫోన్లు అనేవి నిత్యం మ‌న దైనందిన జీవితంలో భాగం అయ్యాయి. అవి లేక‌పోతే ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్ల‌లో ప్ర‌స్తుతం అనేక మంది అనేక ర‌కాల ప‌నులు చేసుకుంటున్నారు. ఇక వాటిలో ముఖ్యంగా కెమెరా విష‌యానికి వ‌స్తే… కొంద‌రు అదే ప‌నిగా ఫొటోలు, వీడియోలు తీయ‌డం.. వాటిని సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం.. ప‌రిపాటిగా మారింది. కానీ నిజానికి స్మార్ట్‌ఫోన్ కెమెరాతో కేవ‌లం ఫొటోలు తీయ‌డం మాత్ర‌మే కాదు.. ఈ యాప్స్ ఉంటే ఇంకా అనేక ప‌నులు చేసుకోవ‌చ్చు. ఆ యాప్స్ ఏమిటంటే..

you can do  wonderful things with your smart phone camera using these 9 apps

1. My Scans (మై స్కాన్స్‌)

ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తోంది. దీంతో ముఖ్య‌మైన డాక్యుమెంట్ల‌ను స్కాన్ చేసి వాటిని క్రాప్ చేసుకుని నేరుగా ఫోన్ నుంచే ప్రింట్ తీసుకోవ‌చ్చు.

2. Warden Cam (వార్డెన్ క్యామ్‌)

ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది. దీని స‌హాయంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల‌ను సీసీ కెమెరాలుగా మార్చుకోవ‌చ్చు. 24/7 నిఘా పెట్ట‌వ‌చ్చు.

3. Night Sky (నైట్ స్కై)

ఈ యాప్ కేవ‌లం ఐఫోన్ల‌లోనే ప‌నిచేస్తుంది. అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ఈ యాప్ ప‌నిచేస్తుంది. దీని స‌హాయంతో న‌క్ష‌త్రాలు, గ్ర‌హాలు, ఉప‌గ్ర‌హాల గురించి తెలుసుకోవ‌చ్చు.

4. Google Lens (గూగుల్ లెన్స్‌)

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఈ యాప్ ల‌భిస్తోంది. దీంతో టెక్ట్స్‌ను స్కాన్ చేసి ట్రాన్స్‌లేట్ చేసుకోవ‌చ్చు. మొక్క‌ల‌ను గుర్తించ‌వ‌చ్చు. కోడ్ల‌ను స్కాన్ చేయ‌వ‌చ్చు. ఇంకా ఎన్నో ప‌నులను ఈ యాప్ ద్వారా చేయ‌వ‌చ్చు.

5. Spectre (స్పెక్ట‌ర్‌)

కేవ‌లం ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై మాత్ర‌మే ల‌భిస్తున్న ఈ యాప్ స‌హాయంతో ఫొటోల‌ను చ‌క్క‌గా ఎడిట్ చేసుకోవ‌చ్చు.

6. PlantSnap (ప్లాంట్ స్నాప్‌)

ఫోన్ కెమెరా స‌హాయంతో మొక్క‌లు, వృక్షాలు, ఆకులు, పువ్వుల‌ను ఫొటో తీసి వాటి గురించిన స‌మాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది.

7. Google Translate and Microsoft Translator (గూగుల్ ట్రాన్స్‌లేట్‌, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేట‌ర్‌)

ఈ యాప్‌లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. ఈ యాప్‌ల స‌హాయంతో ఫోన్ కెమెరాతో ఫొటోలు తీసి.. ఆ ఫొటోలో ఉన్న టెక్ట్స్ ఏ భాష‌కు చెందినదో ఇట్టే గుర్తించవ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే ఆ భాష‌ను యూజ‌ర్ సొంత భాష‌లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవ‌చ్చు.

8. AR Ruler (ఏఆర్ రూల‌ర్)

స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఏదైనా ఒక వ‌స్తువు లేదా ప్ర‌దేశంపై నిర్ణీత దూరాన్ని కొలిచేందుకు ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంది.

9. Mathway (మ్యాథ్‌వే)

గ‌ణితంలో ఉండే అతి క‌ష్ట‌త‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేయాల‌నుకుంటే ఈ యాప్ పనికొస్తుంది. జ‌స్ట్ ఆ ప్రాబ్లంను రాసి, ఫొటో తీసి ఈ యాప్‌లోకి అప్‌లోడ్ చేస్తే చాలు.. దాంతో ఆ ప్రాబ్లంను యాప్ సాల్వ్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news