యూట్యూబ్‌కు కొత్త లుక్‌… కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చేశాయ్‌

-

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్ త‌న యూట్యూబ్ లుక్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొబైల్ ఫోన్ల‌తో పాటు డెస్క్ టాప్‌ల‌లో వాడుతున్న యూజ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేలా యూట్యూబ్‌ను గూగుల్ మ‌రింత కొత్త‌గా తీర్చిదిద్దింది. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్‌లో కొత్త ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. యూట్యూబ్‌లో ఇకపై వీడియోలకు చెందిన థంబ్ నెయిల్స్ పెద్దవిగా కనిపిస్తాయి.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ వీడియో క్రియేట‌ర్లు టైటిల్స్ పెద్ద‌గా పెట్టుకునేందుకు వీలులేదు. ఇక నుంచి క్రియేటర్లు తమ వీడియోలకు పొడవైన టైటిల్స్ పెట్టుకోవచ్చు. ఇక వీడియోలను ప్రివ్యూలో హై రిజల్యూషన్‌లో చూడవచ్చు. ఇక కొత్త ఆప్ష‌న్ ప్ర‌కారం హోం పేజీలో ఉండే వీడియోలను ప్లే లిస్ట్ రూపంలో సేవ్ చూసుకుని తరువాత చూసుకోవ‌చ్చు.

ఇక వీడియోల కింది భాగంలో ఆ వీడియోలను క్రియేట్ చేసిన వారి ఛానల్ ఐకాన్లు కూడా కనిపిస్తాయి. దీంతో వీడియో క్రియేటర్ ఎవరనేది యూజర్లకు సులభంగా తెలుస్తుంది. అలాగే మొబైల్ ప్లాట్‌ఫాంపై యూట్యూబ్ వీడియోలలో ఇకపై సజెస్టెడ్ వీడియోలు కనిపించవు. అయితే స‌జెస్టెడ్ వీడియోల ఆప్ష‌న్‌ను డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం అలాగే ఉంచారు.

ఇక యూజర్లు తాము చూసే వీడియోలకు చెందిన రిలేటెడ్ వీడియోలు తమ యూట్యూబ్ హోం పేజీలో కనిపించేలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచ‌ర్ మాత్రం త్వ‌ర‌లో వ‌చ్చే అప్‌డేటెడ్ వెర్ష‌న్‌లో అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్న‌లు జ‌రుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news