చాణక్య నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన లైఫ్ ఎంతో బాగుంటుంది. ఆచార్య చాణక్య భార్య చేసే కొన్ని తప్పుల్ని భర్త క్షమించాలని అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. హిందూ ధర్మంలో భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవించాలి అన్నట్లు వివరించారు. సుఖమైన వైవాహిక జీవితం కోసం భార్య చేసే కొన్ని పొరపాట్లను భర్త క్షమించాలట. అవేంటంటే భార్య భర్త జేబులో నుంచి అడగకుండా డబ్బులు తీసుకోవచ్చు. డబ్బు తీసినట్లు భర్తకు తెలిస్తే ఆమెతో గొడవ పడకూడదు. ఆ డబ్బు ఆమె ఇంటి అవసరాలకే వాడుతుందని భర్త ఆమెను క్షమించాలి.
అంతేకానీ భర్త ఆమెపై కోప్పడడం, గొడవలాడడం మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు భార్య పిల్లలు అల్లరితో విసిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లపై కోపం తెచ్చుకుని కొట్టడం లాంటివి చేస్తుంది. ఆ సమయంలో భార్యతో భర్త గొడవ పడకూడదు. అర్థం చేసుకోవాలి. పిల్లలపై కోప్పడడం వలన పిల్లలు మంచి బాట పడతారని తప్పులు తెలుసుకుంటారని భర్త అర్థం చేసుకోవాలి.
అలాగే భార్య తప్పులు చేస్తే భర్త గొడవ పడకూడదు. తప్పులు జరగడం సహజమని లైట్ తీసుకోవాలి. ఎప్పుడైనా భార్య ఏమైనా పనులని ఆలస్యంగా చేస్తే భర్త అర్థం చేసుకొని ఆ తర్వాత మాత్రమే మాట్లాడాలి. అంతే కానీ ఆలస్యమైందని ఆమెతో గొడవ పడడం ఆమెపై కేకలు వేయడం వంటివి చేయకూడదు. భార్య కారణంగా డబ్బు నష్టం ఏమైనా జరిగితే భర్త గొడవ పడడం మంచిది కాదు. తప్పు ఎవరివైనా ఎవరి వల్ల అయినా జరగొచ్చు అని లైట్ తీసుకోవాలి. ఇలా ఈ విషయాల్లో భార్యపై భర్త కోప్పడకూడదు. గొడవ పడకూడదు.