డబ్బు గురించి గొప్ప సత్యాన్ని నేర్పించే రాజు – బిచ్చగాడి కథ..!

-

king and beggar story spiritual motivation 261

అది ఓ రాజ్యం. రాజు, మంత్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈసందర్భంగా మంత్రి రాజుతో ఓ మాటంటాడు. రాజా.. మీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. చివరకు అడుక్కునేవాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు మీ రాజ్యంలో అన్నాడు మంత్రి. దీంతో రాజు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. చాలా తెలివి ఉన్న రాజు.. అవునా.. నా రాజ్యంలో బిచ్చగాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడా? సరే.. పదా మంత్రి ఓసారి రాజ్యం చూసొద్దాం అని రాజు, మంత్రి ఇద్దరూ మారు వేషంలో రాజ్యంలో అడుగుపెట్టారు.

ఓ చెట్టు కింద అడుక్కునే వ్యక్తి హాయిగా నిద్రపోతున్నాడు. ఉదయం అడుక్కొని తిని నిద్రపోతున్నాడు. మళ్లీ సాయంత్రానికి అడుక్కోవడానికి వెళ్తాడు. మళ్లీ రాత్రి అక్కడే నిద్రపోతాడు. అదే అడుక్కునే వాడి జీవితం. ఎటువంటి బాదరబందీ లేకుండా హాయిగా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. మారువేషంలో ఉన్న రాజు, మంత్రి ఇద్దరూ ఆ చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి రాజు.. మంత్రిని 90 రూపాయలు ఇవ్వాలంటూ అడిగాడు. దీంతో అదేంటి.. రాజు అటూ ఇటూ కాకుండా 90 రూపాయలు అడిగాడు అంటూ కాస్త అనుమానంతోనే ఇచ్చాడు.

వెంటనే రాజు 90 రూపాయలను ఆ బిచ్చగాడి దగ్గర పడేశాడు రాజు. నిద్రలేచిన తర్వాత ఆ బిచ్చగాడు 90 రూపాయలను చూసి అబ్బ.. 90 రూపాయలు.. వీటికి ఓ 10 రూపాయలు చేరిస్తే… 100 రూపాయలు అవుతాయి.. అని అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు. అక్కడా ఇక్కడా అడుక్కున్నాడు. అటూ ఇటూ చేసి 100 రూపాయలు చేశాడు వాటిని. వాటిని దాచుకొని అదే చెట్టు కింద పడుకున్నాడు. తెల్లారి లేచి 100 రూపాయలను చూశాక ఆ రాజుకు మరో ఆలోచన వచ్చింది. వీటిని ఖర్చు పెడితే వెంటనే ఖర్చయిపోతాయి. వీటికి 900 కలిపితే.. 1000 రూపాయలు అవుతాయి కదా అనిపించింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కష్టపడ్డాడు. వాళ్లను వీళ్లను అడుక్కున్నాడు… వెయ్యి రూపాయలు చేశాడు. తర్వాత మరో ఆలోచన వచ్చింది. 99000 వీటికి చేర్చితే.. లక్ష రూపాయలు అవుతాయి కదా… అనిపించింది. అలాగే ఈసారి తీవ్రంగా శ్రమించాడు. లక్ష అయింది. ఇంకా కష్టపడి 99 లక్షలు చేర్చితే కోటి అవుతుంది కదా అనిపించింది. ఇంకా తీవ్రంగా శ్రమించాడు. కోటి చేశాడు చివరకు. కోటీశ్వరుడయ్యాడు. బిక్షాధికారిగా ఉన్న ఆ వ్యక్తి లక్షాధికారి.. అట్నుంచి కోటీశ్వరుడయ్యాడు.

డబ్బు వచ్చాక మనిషి ఎలా అవుతాడో తెలుసు కదా. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు.. మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అంతా బాగుంది. కానీ.. మనోడిలో ఏదో ఒక అసంతృప్తి. డబ్బు, పెళ్లాం, పిల్లలు.. ఇలా అందరూ ఉన్నా.. మనోడికి ప్రశాంతత లేదు.. సంతృప్తి లేదు. దీంతో తాను బిచ్చగాడిగా ఉన్నప్పుడు ఉన్న అదే చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు. రాజు, మంత్రి అదే చెట్టు మీద మారువేషంలో పైనున్నారు. వాళ్లు కిందికి దిగి.. చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూసి.. అయ్యో.. మీరు కోటీశ్వరులు కదా ఇక్కడ కూర్చున్నారేంటంటూ రాజు అతడిని ప్రశ్నించాడు.

దీంతో ఆ వ్యక్తి అన్నాడు. ఇదే చెట్టు కింద ఏమీ లేకుండా అప్పుడు కూర్చున్నా. నా దరిద్రం… ఏంటంటే.. 90 రూపాయలు ఇక్కడే దొరికాయి నాకు. ఆ 90 రూపాయలే నా కొంప ముంచాయి. 90 రూపాయలకు 10 రూపాయలు కలిపి 100 చేశా. ఆ వందకు 900 కలిపి వెయ్యి చేశా. వెయ్యికి 99 వేలు కలిపి లక్ష చేయాలనిపించింది. అలా కోటి రూపాయలు సంపాదించా. డబ్బు అయితే సంపాదించా కానీ.. మనసు ప్రశాంతంగా లేదు. ఏదో లోటుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కట్టలు ఉన్నాయి తప్పితే.. సంతోషం, ఆనందం లేవు. అవి మిస్సయ్యాయి.. అంటూ రాజుతో చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు బేఫికర్ గా ఉండే వాడిని. నా దగ్గర ఏదీ లేదు.. ఇదే చెట్టు కింద హాయిగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ.. హాయిగా నిద్రపోలేకపోతున్నాను.. అంటూ చెప్పాడంతో అప్పుడు మంత్రికి రాజు ఎందుకు అప్పుడు 90 రూపాయలు కింద పారేశాడో అర్థమయిందట. ఇది భగవద్గీతలోని 261 వ అధ్యాయంలో ఉన్న డబ్బు, మనశ్శాంతికి సంబంధించిన ప్రవచనం.

Read more RELATED
Recommended to you

Latest news