అనారోగ్య పరిస్థితి లో అనారోగ్య రాజకీయం .. !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఒకపక్క ప్రపంచమంతా కరోనా వైరస్ పై పోరాడుతుంటే ఏపీలో రాజకీయ నాయకులు మాత్రం ఒకరిని ఒకరు విమర్శించుకోవడం పట్ల అసహనం చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ రోజు రోజుకి బలపడుతున్న తరుణంలో ప్రజలను కాపాడకుండా ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో కట్టడి చేయడంలో విఫలమైందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఇటువంటి సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు..కరోనా వైరస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.Vijay Sai Reddy Lambasts Chandrababu On Job Creationతాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో మండిపడ్డారు. “తుప్పు నాయుడిది ముగిసిన చరిత్ర. విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తాడు. ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు”.“దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. యువ ముఖ్యమంత్రి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అంతా ప్రశంసిస్తుంటే పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదు. జగన్ గారిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల పైన దొంగదాడికి తెగబడుతున్నారు. తూ… సిగ్గులేని జన్మలు!” “కరోనా ముట్టడితో ప్రపంచమంతా తల్లడిల్లుతోంది.

 

మన లాంటి దేశానికి ఇదో పెద్ద విపత్తు. కష్టకాలంలో అందరూ వ్యాధిని ఎదుర్కొనే పోరాటంలో భాగస్వాములు కావాలి. ఇలాంటి టైంలో కొందరు ఎల్లో వైరస్ దద్దమ్మలు నీచపు కామెంట్లకు తెగబడుతున్నారు. వీళ్లెవరూ చట్టం నుండి తప్పించుకోలేరు”… అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వరుసగా 3 ట్వీట్లు చేశారు. దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్న ఏపీ ప్రజలు టిడిపి- వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఒక పార్లమెంటు సీనియర్ సభ్యుడు అయి ఉండి ఈ విధంగా మాట్లాడటం సమంజసమేన అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై ప్రజల సీరియస్ అవుతున్నారు. 

 

ఒకపక్క పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఇలాంటి సమయంలో సలహాలు సూచనలు తీసుకోవలసిన అధికార, ప్రతిపక్షాలు ఈ విధంగా వ్యవహరించడం మేము చేసుకున్న దౌర్భాగ్యం అని బాధపడుతున్నారు. రాష్ట్రంలో అనారోగ్య రాజకీయ నేతలు ఉండటం వల్లే రాష్ట్రం అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోతుందని మరికొంతమంది మండిపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news