రాజు అవ్వాలంటే సంపద ఉంటే సరిపోదని చెప్పే అద్భుతమైన కథ..

-

ఒక ఊరిని పరిపాలిస్తున్న రాజు, తన తర్వాత ఈ ఊరిని పరిపాలించేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు. చాలా రోజులుగా చూస్తున్నా ఎవ్వరూ కనిపించకపోయేసరికి మంత్రిని పిలిచి దండోరా వేయించాడు. రాజుగా అవ్వడానికి ప్రకటన వచ్చిందంటూ చాలా మంది యువకులు ఉత్సాహం చూపి, రాజు పెట్టే పరీక్షకి సిద్ధమవసాగారు. అందులో ఒక నిరుపేద యువకుడు కూడా ఉన్నాడు. మూడు పూటలా తినడానికి కష్టపడే ఆ యువకుడు రాజు అవ్వడానికి పరీక్షకి సిద్ధం అవుతున్నాడు.

The science of kindness.

ముందుగా రాజ భవనంలోకి వెళ్ళడానికి తనని తాను మలుచుకున్నాడు. తన దగ్గరున్న కొంత డబ్బుతో మంచి బట్టలు కొనుక్కుని, సూట్ వేసుకుని ఊరికి బయల్దేరాడు. మార్గమధ్యంలో అతనికి ఒక బిచ్చగాడు కనిపించాడు. చేతులు చాపి తిండికోసం ప్రాధేయపడుతున్న బిచ్చగాడి ఒంటిమీద చొక్కా లేక చలికి వణుకుతున్నాడు. అప్పుడు ఆ యువకుడ తన సూట్ తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చేసాడు. ఆ బిచ్చగాడిని చూసిన తర్వాత తన మనసంతా అదోలా అయిపోయింది.

రాజ భవనం చేరుకుని రాజు ముందు నిల్చున్నాడు యువకుడు. రాజుగారు అక్కడకి వచ్చారు. ఎందుకో రాజుగారిలో ఆ బిచ్చగాడి పోలికలు కనిపించాయి. అదే విషయాన్ని రాజుతో చెప్పాడు. దానికి రాజు అవును ఆ బిచ్చగాడిని నేనే అన్నాడు. అలా ఎందుకు చేసారని అడగ్గా, రాజుగా పాలించడానికి తెలివి కంటే దయాగుణం చాలా అవసరం. అది నా వద్దకు వచ్చేవాళ్ళలో ఎంతుందో తెలుసుకుందామనే అలా చేసానని, అందులో నువ్వు నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యావని అందుకే ఇక నుండి ఈ ఊరికి నువ్వే రాజువని ప్రకటించేసాడు. రాజవ్వాలంటే ధనం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదుటివాళ్ళతో ఎంత దయగా ఉంటున్నావనేదే ముఖ్యం అని చెప్పాడు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news