గుప్పెడంతమనసు 323 ఎపిసోడ్: వసుధార నంబర్ కోసం గౌతమ్ తంటాలు..ఇంతలో వసుధారే కాల్ చేయటంతో షాకైన ఇగోమాష్టర్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ధరణి రిషీ కోపంగా ఉన్నాడంటే అనుకుని వసుధారకు కాల్ చేస్తుంది. అత్తయ్యగారి విషయంలో రిషీకి నీకు ఏమైనా గొడవైందా అని ధరణి అడుగుతుంది. సార్ చాలా కోపంగా ఉన్నారా అంటే..అవును వసుధార అంటుంది ధరణి. వాళ్లు అలా మాట్లాడుకుంటుండగా..ధరణి పాలు పొంగుతున్నాయని..ఫోన్ పక్కన పెడుతుంది. ఇంతలో రిషీ వస్తాడు. ధరణి ఫోనులో వసుధార లైన్ లో ఉండటం చూసి..ఓహో వదిన వసుధారతో ఫోన్ మాట్లాడుతున్నారా అనుకుని..పాలు పోసి ఇవ్వరా తాగుతాను అంటాడు. వసుధార ఏంటి ఫోన్ కట్ చేయటం లేదు..నేనే కట్ చేయాలా..వద్దులే మధ్యలో కట్ చేస్తే బాగుండదు అనుకుని వసూ అలానే లైన్ లో ఉంటుంది. రిషీ కావాలని..పెద్దమమ్మకు ఆ గాయం ఎలా తగిలిందో మీకు తెలుసుకదా..ఆ వసుధార చూశారా వదినా..పెద్దమ్మ విషయంలో అంత చేసి ఒక్కసారి కూడా చెప్పలేదు..ఒక్కమాట సారీ అంటే..తన కిరీటం పడిపోతుందా ఏంటి అంటాడు. వసూ అవును నా కిరీటం పడిపోతుంది నేను చేయను తప్పుకు సారీ చెప్పను గాక చెప్పను. రిషీ కావాలనే ధరణి ఫోన్ తీసుకుని..అరే మన వళ్ల ఎవరైనా గాయపడితే..ఫీల్ అవుతామా లేదా వదినా చెప్పండి అంటాడు. ఆ అవుతాం రిషీ అంటుంది ధరణి..కానీ ఆ వసుధార ఏంటి వదినా..గర్వమా అంటాడు. ఇక్కడ వసూ ఆత్మగౌరవం అనుకుంటుంది వసూ. ఇది కరెక్ట్ కాదు వదినా అని కాల్ కట్ చేసి ఫోన్ అక్కడ పెట్టేస్తాడు. రేపు నా ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడు..మీరు వంటపనులు ఏం చేయకండి..పనిమనిషిని రప్పించండి అని వసుధార వినే ఉంటుంది..వినాలనేకదా అనింది అనుకుని వెళ్తాడు.
ఇక్కడ వసుధార..రిషీ సార్ ఇలా కూడా మాట్లాడతారా మీరు నా గురించి..నా తప్పులేదు..నేను సారీ చెప్పేదే లేదు అనుకుని చిరాకుగా వెళ్తుంది. జగతి చూసి ఒకసారి ఇలా రా అని రిషీ చెప్పిన కాన్సెప్ట్ లో నాకు నీ హెల్ప్ కావాలి అంటుంది. నేను ఇప్పుడు వర్క్ చేయలేను మేడమ్ అంటుంది వసూ. ఏమైంది అంటే..నా మూడ్ బాలేదు మేడమ్ అంటుంది వసూ. నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది..ఏమైంది అని జగతి అడుగుతుంది. వసూ జరిగింది చెప్తుంది. మన వైపు నుంచి తప్పు జరగలేదు..ఆ విషయం మన ఇద్దరికి తెలుసు..ఇక ఫీల్ అవటం ఎందుకంట అని జగతి అంటే..మనం కరెక్టుగానే ఉన్నాం..మీ అబ్బాయే కరెక్టుగా ఆలోచించటం లేదు అంటుంది వసూ. జగతి వసూ మాటిమాటికి మా అబ్బాయి అంటున్నావ్..మా అబ్బాయికి రిషీ సార్ కి చాలా తేడా ఉంది. నీకు నచ్చిని పని చేస్తే మా అబ్బాయి..నచ్చే పని చేస్తే..మా రిషీ సార్, జంటిల్ మెన్ అంటావ్..ఇదేంటి వసూ..హారన్ సౌండ్ వినిపించి పరుగెత్తినప్పుడు రిషీ సార్ అవుతాడు..నిన్ను తిడితే మా అబ్బాయి అవుతాడు అంతేగా అంటుంది. అసలు ఇన్నన్నీ మాటలు అన్నందుకు సారే నాకు సారీ చెప్పాలి. ఏమంటారు మేడమ్ అంటే..నేను ఈ వర్క్ చేసుకుంటాను..నిన్ను వెళ్లమంటాను అంటుంది జగతి.
తెల్లారి..రిషీ మహేంద్ర, గౌతమ్ ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. ఈ మార్నింగ్ ప్లజెంట్ గా ఉంది కదా అని గౌతమ్ అంటే..నీ మనసు ప్లజెంట్ గా ఉండి ఉంటుంది అందుకే అలా అంటున్నావ్ అంటాడు మహేంద్ర. మీరు జీనియస్ అంకుల్ అంటూ బిస్కెట్స్ వేస్తాడు గౌతమ్. పొద్దున్నే పొగుడుతున్నావ్ అంటే..నాతో ఏదో పని ఉంటుంది అంటాడు మహేంద్ర. మెల్లిగా గౌతమ్..వసుధార టాపిక్ తీస్తాడు. రిషీ ఆపాలని ట్రై చేస్తాడు. పొద్దున్నే ప్లజెంట్ టాపిక్ మాట్లాడితే..తప్పేంఉంది ఏమంటారు అంకుల్ అంటాడు. రిషీ అయితే..పొద్దున్న తర్వాత అందరూ కామ్ గా కుర్చోవాలా అని రిషీ అంటే..అరే నువ్వేం మారలేదురా జడపదార్థంలా ఉండిపోయావ్ అంటాడు. ఏమంటారు అంకుల్ అంటాడు గౌతమ్. ఏంట్రా మా డాడ్ ని ఏమంటారు అంటాడు. ఇంత ఎంగ్ ఎనర్జటిక్ డాడ్ ఉన్నప్పుడు వాడుకోవాలిరా..అని మహేంద్రను ములగచెట్టు ఎక్కిస్తాడు. ఫైనల్ గా వసుధార నంబర్ ఇవ్వరా అని అడుగుతాడు. రిషీ చూశారా డాడ్ ఇది వాడి ఎత్తుగడ అంటాడు. ఊరుకోరా..మరీ నంబర్ కోసం అలా ఎందుకు చేస్తునురా..ఇంటి అడ్రస్ కోసం అయితే చేయొచ్చుకాని అంటాడు. పాపం గౌతమ్ ఎన్నివిధాలుగా ట్రై చేసినా నంబర్ మాత్రం ఇవ్వరూ..గౌతమ్ రిషీ ఫోన్ తీసుకుని వసుధార నంబర్ కోసం వెతుకుతాడు. రిషీ ఫోన్ ఇవ్వరా అని లాక్కోబోతాడు. పొగరు ఎవర్రా ఇదే నంబర్ కి చాలా సార్లు ఫోన్ చేశావు అంటాడు. రిషీ ఫోన్ లాగేసుకుంటాడు. అరే అలా తీసుకుంటావేంటి..పర్సనల్స్ ఉంటాయ్ రా అంటాడు రిషీ..నేను నీ చడ్డీ దోస్త్ ని మనకు మనకు పర్సనల్స్ ఏం ఉండవు రా అంటాడు గౌతమ్.. ఈసారి మహేంద్రను అడుగుతాడు. నా ఫోన్ రూంలో ఉన్నట్లు ఉంది అంటాడు. వసుధార నంబర్ సంపాదించటం ఎలా దేవుడా నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించూ అంటూ గౌతమ్ అరుస్తాడు.
ఇక్కడ వసుధార బ్యాగ్ సర్థుకుంటూ ఉండగా..గౌతమ్ ఆరోజు పర్స్ ఇచ్చినప్పుడు ఏటీఎం కార్డు బ్యాగ్ లోనే ఉండిపోయినట్లు ఉంది..వసూ కాల్ చేస్తుంది. కరెక్టుగా గౌతమ్ ఏదో ఒక దారి చూపించు అన్నప్పుడే వసుధార కాల్ రావడం సూపర్ ఉంటుంది. గౌతమ్ స్పీకర్ ఆన్ చేయటంతో మహేంద్ర, రిషీ వసుధార గొంతు విని షాక్ అవుతారు. ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో గౌతమ్ వసూధారతో మాట్లాడతాడు. మీ కార్డ్ నా దగ్గరే ఉండిపోయాయి అంటే..వావ్ డెస్టినీ..అలా చేసింది అంటాడు గౌతమ్. కార్డ్స్ ఎప్పుడు తీసుకుంటారు అంటే..ఈవినింగ్ మీ రెస్టారెంట్ కి వస్తాను..ఒక కప్పు కాఫీ షేర్ చేసుకుందాం అంటాడు గౌతమ్..ఫోన్ కట్ చేశాక..రిషీ వసుధార నీ కెందుకు కాల్ చేసింది అంటే..పర్సనల్ మ్యాటర్స్ అడగొద్దు మిత్రమా అంటాడు గౌతమ్. దీన్నిబట్టి గౌతమ్ ను వాడుకుని మహేంద్ర మళ్లీ ప్లాన్ అమలు చేశాలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news