గుప్పెడంతమనసు సెప్టెంబర్ 27 ఎపిసోడ్-253: రిషీతో సహా జగతి ఇంటికి వెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ..వసూ కోసం రూంలోకి వెళ్లిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర దేవయానితో మాట్లాడాటానికి వెళ్తాడు. మీ అన్నయ్య బయటకు వెళ్లాడు కదా నువ్వు వెళ్లలేదేంటో అని అడుగుతుంది దేవయాని. మీతో మాట్లాడాలని అని ఆగాను అంటాడు మహేంద్ర. నాతో ఏం మాట్లాడతావ్.మన కుటుంబంలో విషయాలు నువ్వు బయటేగా చర్చిస్తావ్ అంటుంది దేవయాని. 20ఏళ్లు గడిచినా మీ మాటలఈటల పదును తగ్గలేదు వదినా అంటాడు మహేంద్ర. నేనేదో గుచ్చినట్లు మాట్లాడినట్లు కనిపిస్తుందా మహేంద్ర అని దేవయాని అడుగుతుంది. వదినా మన కుటుంబంలో ఎన్నైనా జరిగి ఉండొచ్చు..పాపం ఆ వసుధారను తిట్టారట.. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటాడు. ఆహా నీకు చెప్పుకుందా తను, ఎంతైనా ఆ జగతి చెక్కిన శిల్పమే కదా అంటుంది. ఒక ఆడపిల్ల చదువుకోసం కష్టపడుతుంది..మీరు అలా అనొచ్చా తనని మహేంద్ర అడుగుతాడు. నేను అన్న మాటలు తప్పుగా కనిపిస్తున్నాయా నీకు..కానీ తనేం మాట్లాడిందో తెలుసా అంటుంది. ఓ వైపు రిషీ కూడా పైకి వస్తుంటాడు. వదినా ఇంటికొచ్చిన ఆడపిల్లను ఆలా తిట్టొచ్చా అని అడుగుతాడు. తను అలా అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా ముదురు, ఇప్పటికే జగతిని నెత్తిన పెట్టుకుంటున్నావ్ అంటుంది.

తను చేసిన తప్పేంటి వదినా ఒక్కటి చెప్పగలరా అని మహేంద్ర అడుగుతాడు. వంద చెప్తాను అని..వసుధార రిషీ విషయంలో దూకుడుగా ప్రవర్తిస్తోంది..వసుధారను వద్దంటే కాలేజీలో చేర్చింది నువ్వేకదా..వసుధారకు ఆ మాత్రం హెచ్చరికలు అవసరం మహేంద్ర అంటుంది. అప్పుడే రిషీ వస్తాడు. దేవయాని చూస్తుంది. ఆ తరువాత మహేంద్ర చూస్తాడు. రిషీ వదిన మాటలు మొత్తం విన్నాడా అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. రిషీ వచ్చి..ఏంటి పెద్దమ్మా వసుధారను మీరు హెచ్చరించటమేంటి అని అడుగుతాడు. దేవయాని ఏం చెప్పదు..డాడ్ మీరు ఇద్దరు వసుధార గురించి మాట్లాడుకోవడమేంటి..ఆశ్చర్యంగా ఉంది అని మహేంద్రను అడుగుతాడు. మహేంద్ర టాపిక్ డైవెట్ చేస్తాడు. డీజీపీ గారి ఇంట్లో వసు సాంబార్ పోసిన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటాడు. అలా కవర్ చేస్తారు. సరే ఎప్పుడో అయిపోయిన టాపిక్ గురించి ఇప్పుడు ఎందుకు అని కాలేజికి మినిస్టర్ గారి తరుపున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తున్నారంట వెళ్దాం డాడ్ అంటారు. అలా ఆ సీన్ అయిపోతుంది.

కాలేజ్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. జగతి ఉండదు. రిషీ మనసులో మేడమ్ మీరు ఈ మీటింగ్ కి రారని నేను ముందే ఊహించాను అనుకుంటాడు. మీటింగ్ ఉద్దేశం చెప్పి మేడమ్ గారు రాలేదా అంటాడు రిషీ..వసూ వెంటనే మేడమ్ కు ఒంట్లో బాలేదని లీవ్ తీసుకున్నారు సార్ అంటుంది. నేను నిన్ను అడిగానా అని రిషీ అంటాడు. మీటింగ్ కాన్సప్ట్ ఇప్పుడు ఎవరు చెప్తారు ..మాట్లాడవేంటి అని రిషీ అంటాడు..అంటే నువ్వు చెప్పలేదుకదా రిషీ మాట్లాడమని మహేంద్ర అంటాడు. అయితే మీరు చెప్పండి అని రిషీ అంటాడు. నేనా నెనేలా చెప్తాను అని మహేంద్ర అంటే…మరి మీరెందుకు మధ్యలో వస్తున్నారు..అని రీషీ అడుగుతాడు.

ఇంతలో ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తారు. ఫణింద్ర అందరిని పరిచయం చేస్తాడు. సెక్రటరీ మీటింగ్ స్టాటింగ్ చేయండి అంటాడు. రిషీ స్టాట్ చేస్తాడు..ఇంతలోనే మహేంద్ర ఈ ప్రాజెక్టు రూపకర్త జగతి మేడమ్ గారు ఈరోజు రాలేకపోయారు అంటాడు. రిషీకి కాల్తది..వసుధార ఈ ప్రాజెక్టు గురించి నీకు తెలుసు కదా చెప్పు అంటాడు. వసు మొదట కొంచెం టెన్షన్ పడినా లేచి క్లుప్తంగా చెప్తుంది. ఎడ్యూకల్చర్ ముఖ్య ఉద్దేశం చెప్తుంది. రిషీ మనసులో వసుధార గొప్పగా మాట్లాడుతుంది అనుకుంటాడు. అలా మొత్తం చెప్పి ఇది జగతి మేడమ్ గారి ఆలోచన నుండి పుట్టింది సార్ అంటుంది. రిషీ ముఖం మాడుతుంది. ఆ ప్రిన్సిపల్ సెక్రటరి బాగా చెప్పావ్ అమ్మా..నువ్వే ఇంత బాగా చెప్పావంటే..ఆవిడే చెప్తే ఇంకా ఎంత బాగా చెప్తుందో అంటాడు. ఆవిడ ఈరోజు లీవ్ లో ఉన్నారు హెల్త్ బాలేదన్నారు అని ఫణీంద్ర అంటాడు. ఆవిడను ఒకసారి చూడాలనిపిస్తుంది అని సెక్రటరి అంటాడు. పిలపించమంటారా అని ఫణీంద్ర అడుగుతాడు. వద్దు మనమే వెళ్దాం అంటాడు. ఆ మాటకు రిషీ వెళ్లాలా అని అంటాడు. ఆ తప్పేంటి..అలాంటి ఒక గొప్ప వ్యక్తి మీ కాలేజీలో ఉన్నందుకు మీరంతా గర్వపడాలి అంటాడు. ఇక్కడ సీన్ భలే కామెడీగా ఉంటుంది. సెక్రటరీ అందరం వెళ్దాం అంటాడు. రిషీ..అందరు వెళ్లండి నాకు కొంచెం పనుంది అంటాడు. ఇళ్లు బాగా దూరమా అని సెక్రటరీ అడిగితే..వెంటనే వసూ లేదు సార్ దగ్గరే అంటుంది. రీషీ మళ్లీ వాలంటీర్ తో సాయంత్రం మీటింగ్ ఉంది.. ఆ మీటింగ్ ఏర్పాట్లు చేయాలి అంటాడు. దానికి కూడా వసూ లేదు సార్ నేను ఆ ఏర్పాట్లు చేశాను అంటుంది. ఇక చేసేదేం లేక రిషీ వస్తాను సార్ అంటాడు.

వసూ బయటకు వచ్చే సరికి మహేంద్ర వాళ్ల కారు వెళ్లిపోతుంది. అయ్యో అలా వెళ్లిపోయారేంటి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషీ వచ్చి వెళ్దామా అంటాడు. మీరు వెళ్లలేదా అంటుంది వసూ..వసూ చేతిలో లాప్ టాప్, ఫైల్స్, బ్యాగ్ అన్నీ ఉంటాయ్..వాటిని మోయలేక వసూ ఇబ్బందిపడుతూ ఉంటుంది. ఏంటి కొత్తరకం ఎక్సర్ సైజ్ హా అంటాడు..బరువుగా ఉన్నాయ్ సార్ అంటుంది వసూ. కారు అక్కడ ఉంది నడుచుకుంటూ వెళ్దాం అంటాడు రిషీ. అయ్యే సార్ అంటుంది వసూ. ఊరికే అన్నాలే అని కారు తీసుకొస్తాడు వసూ ఎక్కి కుర్చుంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో జగతి ఇంట్లో అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రిషీ..వసూకోసం వెతుకుతాడు. ఏంటి సార్ ఏమైనా కావాలా అని జగతి అడుగుతుంది..రిషీ..వసూ..వసూ లాప్ టాప్ తో పనిఉంది అంటాడు. రూంలో ఉన్న వసూ దగ్గరకు వెళ్తాడు. వసూ వర్క్ చేసుకుంటూ చూసుకోకండా..ఏంటి మేడమ్ మీ అబ్బాయి వచ్చారుగా..పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు అంటుంది. రిషీ సౌండ్ చేస్తాడు.వసూ లేచి నిలబడి అయ్యోసార్ మీరా అంటుంది. ఏంటి నేను వస్తే మీ మేడమ్ దగ్గర పార్టీలు కూడా తీసుకుంటావా అని రిషీ అడుగుతాడు. ఇంకానయం తిట్టలేదు అంటాడు. సార్ మిమ్మల్ని ఎందుకు తిడతాను సార్ అని వసూ అంటుంది. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news