R.1 కోవిడ్-19 వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే…?

-

కరోనా మహమ్మారి కారణంగా మనం ఎంతగానో సతమతమవుతూ వచ్చాం. ఇప్పటి వరకు మిలియన్ల మంది జీవితాన్ని కరోనా బలితీసుకుంది. కరోనా సోకకుండా.. ప్రమాదం రాకుండా ఉండాలంటే మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. అయితే మనల్ని మనం రక్షించుకోవడానికి మన దగ్గర ఉండే ఒకే ఒక ఆప్షన్ వ్యాక్సిన్. అయితే ఇప్పటి వరకు కూడా కరోనా లో వివిధ రకాల వేరియంట్స్ ని మనం చూశాం.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డెల్టా వేరియంట్ చాలా దేశాలలో వ్యాపించింది. ఇదిలా ఉంటే
రెసెర్చర్స్ కొత్తగా మరొక స్టడీ చేశారు. దానిలో వాళ్లు కొత్త వేరియంట్ ని గమనించారు. అదే కరోనా R.1. అయితే తక్కువ మందికి మాత్రమే ఈ వేరియంట్ సోకిందని తెలుస్తోంది. కానీ ఇది చాలా ప్రమాదకరమని.. వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు అంటున్నారు.

ఈ కరోనా కొత్త వేరియంట్ R.1 గురించి మరిన్ని వివరాలు చూస్తే.. రిపోర్టుల ప్రకారం ఈ వేరియంట్ కొత్తదేమీ కాదు. గత సంవత్సరం జపాన్ లో ఇది సోకింది. అలాగే ఇతర దేశాలలో కూడా ఈ వేరియంట్ ని గమనించారు. సమాచారం ప్రకారం పది వేల మంది పేషెంట్లకు పైగా ఈ కొత్త వేరియంట్ తో సతమతమవుతున్నారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది చాలా ప్రమాదకరం అని తెలుస్తోంది. రీసెర్చర్లు సాధారణ కరోనా వైరస్ కంటే కూడా దీని లక్షణాలు కాస్త విభిన్నంగా ఉంటాయి అని అన్నారు. ఇంకా పరిశోధన జరపాలని చెప్పారు. గత కొన్ని నెలల నుండి చూసుకుంటే ఈ వేరియంట్ తో చాలామంది సతమతమవుతున్నారు అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకుని సురక్షితంగా ఉండడమే మన చేతుల్లో వుంది అని రీసెర్చర్లు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news