గుప్పెడంతమనసు 267: కాలేజ్ లో ఊహించని ట్విస్ట్..రూంలో సూసైడ్ చేసుకోబోతున్న స్టూడెంట్..అటు రిషీ, ఇటువసూ..కానీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో పెళ్లి భరాత్ వాళ్లు రిషీని కూడా తీసుకొచ్చి మధ్యలో నిల్చోపెట్టి డ్యాన్స్ వెస్తారు. వసూ డ్యాన్స్, అక్కడ సౌండ్స్ కి మనోడికి కూడా బాగా ఊపువస్తుంది. డ్యాన్స్ ఇరగదీస్తాడు. ఇద్దరూ అలా కొంచెం సేపు డ్యాన్స్ వేసి వెళ్లిపోతారు. చూశారా సార్..కొద్దిసేపటి వరకూ వాళ్లెవరో, మనమెవరో..కానీ ఎలా కలిసిపోయామో కదా..తీన్మార్ డ్యాన్ మీరు బాగా చేశారు అంటుంది. దాన్ని తీన్మార్ అంటారా అంటాడు రిషీ..హా అవును సార్..డ్యాన్ రాని వాళ్లకు సైతం ఆ బీట్ వింటే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అంటది వసు. రిషీ..నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు ఈర్షగా అనిపిస్తుంది వసుధార..కొత్తవాళ్లతో సైతం ఇట్టే కలిపసిపోతావ్, ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకుంటావ్ అంటాడు. వసూ ఆ మాటకు సిగ్గుపడుతూ..మీ జ్ఞాపకాల్లో నేనున్నానా సార్ అంటుంది. మనోడు ఫస్ట్ ఏం మాట్లాడడు. జ్ఞాపకాలు..జ్ఞాపకాల్ లాగే ఉంటేనే అందంగా ఉంటాయ్ వసుధార అంటాడు. చాలా బాగా తప్పించుకున్నారు సార్ అనుకుంటుంది మనసులో. ఇంటికి వచ్చేస్తారు. కారు దిగి వసూ సార్ అంటుంది..అంతలోనే రిషీ ఏంటి, థ్యాంక్స్ లా అంటాడు..వసూ కాదంటుంది..పోనీ సారీలా అంటాడు. వసూ కాదు సార్..ఈరోజు సాయంత్రం అందంగా గడిచిందని చెప్పాలనుకున్నా..గుడ్ నైట్ అని రెండు అడుగులు వేస్తుంది. రిషీ పిలుస్తాడు. వసూ ఏంటి సార్ థ్యాంక్స్ చెప్తారా అంటుంది. రిషీ నో నో అంటాడు. మరీ సారీలు ఏమైనా చెప్తారా అంటుంది. నేనేం పొరపాటు చేశా అని సారీ చెప్పడానికి అంటాడు. ఈ సీన్ భలేగా ఉంటుందిలే. నీ దగ్గర ఉన్నంత సారీలు, థ్యాంక్స్ ల స్టాక్ నా దగ్గర ఉండవులే వసుధార…థ్యాంక్స్ ఫర్ ద కాఫీ, అండ్ థ్యాంక్స ఫర్ ది కంపెనీ అని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతాడు.

ఇంట్లో జగతి ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది. వసూ వచ్చి ఏంటి మోడమ్ ఇంకా పడుకోలేదు అంటుంది. జగతి నీకు ఎందుకు లేటయిందో తెలుసుకోవచ్చా అని చేతిలో శాలువా చూసి ఏంటి శాలువా..రిషీ పారేస్తే తీసుకొచ్చావా అంటుంది. వసూ జరిగింది చెప్తుంది. సరే దాచుకో అంటుంది జగతి. నేను దాచుకుంటానులే ఏదో ఒక రోజు మీ చేత్తో మీరే మీ అబ్బాయికి కప్పాలి అంటుంది వసూ. జగతి ఎప్పటిలాగే ఇవన్నీ జరిగేపనులు కావన్నట్లే మాట్లాడుతుంది..

ఇంకోవైపు రిషీ ఇంటికొచ్చి ఇందాక వేసిన డ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. మహేంద్ర వచ్చి డోర్ దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అంటాడు. ఏంటీ డాడ్ మీరు అడగాలా అంటాడు. మహేంద్ర లోపలికి వచ్చి లేట్ గా వచ్చినట్లు ఉన్నావ్ కదా అంటాడు.. అవును డాడ్ అంటాడు. ఈ మధ్య కొంచెం లేటుగానే వస్తున్నట్లు ఉన్నావ్ గా కదా అంటాడు. డాడ్ అడగాలనుకుంటే సూటిగా అడిగేశయండి అంటాడు. అడగాలని ఉంటుంది కానీ అడగను రిషీ అంటాడు మహేంద్ర. రిషీ నేను వసుధార కలిసి బయటకు వెళ్లాం..అయినా ఆ వసుధార చెప్పినా చెప్పేస్తుంది కదా అంటాడు. మహేంద్ర అయ్యొయ్యే అలాంటివి నేను అసలు అడగను అంటాడు. రిషీ అవును డాడ్..ఈ తీన్మార్ డ్యాన్స్ గురించి మీకు తెలుసా అంటే..నాకు తెలుసా అంటూ ఇరగదీస్తాను అంటూ వేసి చూపిస్తాడు. నీకు ఎలా తెలుసా అంటే వచ్చే దారిలో పెళ్లి భరాత్ లో చూశాను అంటాడు. అంటే మీరేమైనా వేశారా అని అడగబోతాడు..ఇంతలోనే రిషీ గుడ్ నైట్ చెప్పేస్తాడు. మహేంద్ర ఇక డ్యాన్స్ వేసుకుంటూ బయటకొచ్చి..నన్ను ప్రశ్న కూడా పూర్తిగా అడగలేదంటే నాకు అర్థమయిందిలే అనుకుంటాడు. రిషీ ఈ యూత్ ఐకాన్ కి అన్నీ తెలుసు. తన మూలంగా నేను ఈరోజు తీన్మార్ డ్యాన్ చేశాను అనుకుంటాడు.

కట్ చేస్తే మార్నింగ్ ఫణీంద్ర పేపర్ చూస్తుంటాడు. దేవయాని ఏంటండి కాలేజ్ లో విశేషాలు అంటుంది. కాలేజే లో ఏముంటాయ్ విశేషాలు దేవయాని పేపర్ చూడని అంటాడు. ఈ మధ్య మీరు అసలు నన్ను పట్టించుకోవటం లేదని… అటుగా వెళ్తున్నా ధరణిని పిలిచి రిషీకి కాఫీ ఇచ్చావా అంటే..లేదు అత్తయ్యా..రిషీ రాత్రి లేటుగా వచ్చాడు పొద్దున్నే డిస్టబ్ చేయటం ఎందుకు లే అని వెళ్లలేదు అంటుంది. ఫణీంద్ర ఇది పట్టించుకోవటం అంటాడు. దేవయాని మహేంద్ర మీద ఏదో ఒకటి చెప్పి..రిషీ ఈ మధ్య లేటుగా వస్తున్నాడు పట్టించుకోరా అంటుంది. దేవయాని ఎప్పుడు నువ్వు అయితే మహేంద్ర, రిషీ లేదంటే జగతి గురించే మాట్లాడతావా అని రిషీ మనం చెప్పే స్థాయిలో లేడు అంటూ రిషీ గురించి గొప్పగా దేవయానికి గట్టిగా చెప్తాడు. ఇంతలో ఫణీంద్రకు ఒక కాల్ వస్తుంది. దేవయానితో నేను ఇలా అన్నానో లేదో రిషీ గొప్పతనం గురించి ఇంటర్వూ చేయటానికి మీడియావాళ్లు వస్తున్నారంట అని చెప్తాడు.

కాలేజ్ లో అందరూ కంగారుగా పరుగెట్టు వెళ్తారు. అప్పుడే వచ్చిన వసూ-జగతికి ఏం అర్థంకాదు. ఒకర్ని పిలిచి అడుగుతారు. ఎవరో షీలా రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది అంట, ఎంత తీయమన్నా తీయటం లేదంట అని చెప్తుంది. వసూ కూడా చూడ్డానికి వెళ్తుంది. ఇంతలో రిషీ వస్తాడు. జగతి కంగారుగా రిషీకి జరిగింది చెప్పి వెళ్దాంరండి సార్ చెయిపట్టుకుంటుంది. రిషీ ఓ లుక్ ఇస్తాడు. చేయి వదిలేసి వెళ్దాం రండి అంటుంది. ఇటుపక్క స్టాఫ్ అంతా తలుపుతీయమ్మా అంటారు. కానీ లోపల ఉన్న షీలా ఎ‌వడో ప్రశాంత మోసం చేశాడంట.నేను బతకను అనుకుంటూ ఎదురుగా పాయిజన్ బాటిల్ పెట్టుకుని ఏడుస్తుంది. ఇంతలో వసూ వచ్చి తలుపుతీయమని అంటుంది. రిషీ వచ్చి డోర్ ఓపెన్ చేయమని అంటాడు. రిషీ ఈరూంకి ఇంకో డోర్ ఉందా అని సెక్యూరిటీని అడుగుతాడు. ఉంది అని చెప్పేసరికి రిషీ అటువెళ్తాడు. ఇటు వసూ వాళ్లు డోర్ తీయమని చెప్తారు. వసూ స్టూల్ ఎక్కి చూస్తుంది. పాయిజన్ బాటిల్ చూసి షీలా బాటిల్ పడేయ్ అంటుంది. బాటిల్ ఏంటి అని జగతి అంటే..పాయిజన్ బాటిల్ ఉంది మేడమ్ అంటుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసూ చేయి బెణికితే..రిషీ కట్టుకడతాడు. వసూ థ్యాంక్స్ చెప్తే..థ్యాంక్స్ ఎందుకు చెల్లుకి చెల్లు అంటాడు..గతంలో నువ్వు నాకు కట్టు కట్టావు కదా ఇప్పుడు చెల్లుకి చెల్లుకి అంటాడు. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news