హుజూరాబాద్ బైపోల్.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్న ఈటెల జమున

హుజూరాబాద్ బైపోల్ బరిలో ఎంత మంది ఉంటారనే విషయం సాయంత్రం వరకు తేలనుంది. హూజూరాబాద్ బైపోల్ కోసం రికార్డు స్థాయిలో 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీతో పాటు పలువురు స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 43 మంది నామినేషన్లను మాత్రమే అధికారులు అంగీకరించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో సాయంత్రం వరకు బై పోల్ బరిలో ఎంతమంది ఉంటారనే దానిపై క్లారీటీ రానుంది.etela jamuna

 తాజాగా ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. హుజూరాబాద్ బైపోల్ కు ఈనెల 1 నుంచి నామినేషన్లకు తెరలేచింది. ఈక్రమంలో ముందుగా ఈటెల సతీమణి నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఉన్న ఆస్తుల వివరాలతో అఫిడవిట్ సమర్పించారు. గతంలో బీజేపీ తరుపున ఈటెల సతీామణి పోటీ చేస్తారనే వాదనలు వచ్చాయి. అయితే బీజేపీ అధినాయకత్వం రాజేందర్ పేరు ప్రకటించడంతో ఉత్కంఠతకు తెరపడింది.