గుప్పెడంతమనసు ఎపిసోడ్ 280 : వసూ దూరం అ‌వుతుందన్న బాధను తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషీ..బోల్తాకొట్టిన మహేంద్ర ప్లాన్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ జగతితో స్టూడెంట్స్ కి లైఫ్ మీద మంచి మాటలు చెప్పమని చెడమడాతిట్టేసి వెళ్లిపోతాడు. జగతి ఏమైంది వసూ రిషీ ఎందుకు అలా కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది. ఇలా ఇద్దరూ రిషీ ఎందుకు అరిచాడా అని ఆలోచిస్తారు. ఇంకోసీన్ లో మహేంద్ర ఎంగేజ్ మెంట్ కి ఏంఏం కావాలో లిస్ట్ రాసుకుంటాడు. ఇంతలో రిషీ వచ్చి మేఐకమిన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు అంటాడు. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని భలే గుర్తుచేశావ్ రిషీ అంటాడు మహేంద్ర. తమరు మరి పెళ్లిపెద్దగా మారిపోయారు కదా అంటాడు రిషీ. మహేంద్ర మనసులో బాగా కాల్తున్నట్లు ఉంది అనుకుంటాడు. ఎక్కడివరకూ వచ్చాయ్ పెళ్లిపనులు, ఎంగేజమ్ మెంట్ చేస్తున్నారంట కదా అంటాడు రిషీ. నీకు ఇప్పుడే తెలిసిందా ఎ‌వరు చెప్పారు వసూనా అంటాడు మహేంద్ర. శిరీష్ ఇన్వైట్ చేశాడు అంటాడు రిషీ. మర్యాదతెలినవాడు కదా పిలిచి ఉంటాడు అంటాడు మహేంద్ర. మరి మీరు ఎందుకు చెప్పలేదు అంటాడు రిషీ. సప్రైజ్ చేద్దాం అనుకున్నాను అంటాడు మహేంద్ర. రిషీ అయినా ఇవన్నీ మనకు అవసరమా అంటాడు . అలా మహేంద్ర మనం చేసేది మాట సాయమే కదా అని లిస్ట్ రాసుకున్న ఐటమ్స్ చదువుతాడు. రిషీ కోపంతో స్టాప్ ఇట్ డాడ్ అంటాడు. ఏది ఆపమంటావ్ రిషీ, నా మాటలా, ఎంగేజ్ మెంట్ హా అంటాడు మహేంద్ర. రిషీ కోపం ఎక్కువైపోతుంది. మహేంద్ర మనసులో రిషీకి కోపం పెరిగిపోతున్నట్లు ఉంది అనుకుంటాడు. రిషీ మనసులో మీరైనా చెప్పాలిగా డాడ్..వసూ చదువు, ఆశయాలు ఏమైతాయ్ అనుకుంటాడు. మహేంద్ర ఏంటి రిషీ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావ్ అంటాడు. ఈ తతంగానికి మీరేనా సూత్రధారి అంటాడు రిషీ. నాదేంలేదు రిషీ..నిన్ను రమ్మన్నాడు రావొచ్చుకదా అంటాడు మహేంద్ర. సలహాలు ఇవ్వాల్సినచోట ఇవ్వరుకానీ నాకు ఇస్తున్నారా డాడ్ అంటాడు. ఇంతలో జగతి చూసుకోకుండా డైరెక్ట్ క్యాబిన్ లోకి వచ్చేస్తుంది. సలహాలు చెప్పేవాళ్లు చెప్తే వినేవాళ్లు వింటారు అని చెప్పేసి వెళ్లిపోతాడు రిషీ.

జగతి ఏమైది మహేంద్ర, రిషీ ఏదో అంటున్నాడు అంటుంది. శిరీష్ ఎంగేజ్ మెంట్ విషయంలో మన సలహాలు,సూచనలు ఇవ్వటం తనకు ఇష్టం లేదు అంటాడు మహేంద్ర. శిరీష్ పెళ్లిచేసుకుంటే తనకేంటి ప్రాబ్లమ్ అంటుంది జగతి. అలా మహేంద్ర జగతి రిషీ గురించి మాట్లాడుకుంటారు. క్లాస్ లో రిషీ స్లిప్ టెస్ట్ పెడతాడు. వసూ రాస్తూనే ఉదయం రిషీ అన్న మాటలను గుర్తుచేసుకుంటుంది. రిషీ ఎంగేజ్ మెంట్ గురించి తలుకుచుని వసూ చుట్టూనే తిరుగుతాడు. అక్కడేం లేకపోయినా ఇది ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి, శ్రద్ధ స్లిప్ టెస్ట్ మీద పెట్టు వసుధార అంటాడు. అప్పుడే వసూ పెన్ ఇంక్ అయిపోతుంది. రిషీ వచ్చి పెన్ ఇస్తాడు. కాసేపటికి బెల్ మోగుతుంది. క్లాస్ అయిపోతుంది.

రిషీ కారు దగ్గరకు వెళ్తుంటే వసూ పరుగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి ఎందుకు పరుగెట్టుకుంటూ వస్తున్నావ్ అంటే మీ పెన్ను సార్ అని వసూ పెన్ను ఇస్తుంది. రిషీ నీకు బుద్ధి ఉందా ఈ పెన్ను ఇవ్వటానికి ఇలా పరుగెట్టుకుంటూ రావాలా అంటాడు. మీ జ్ఞాపకాలు, మీ ఇష్టాలు మీ దగ్గరే ఉండటం ఇష్టం కదా సార్ మీకు అంటుందివసూ. అంటే నా జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేస్తున్నావా అంటాడు రిషీ. తిరిగి ఇవ్వటం కంటే భద్రంగా ఇస్తున్నాను అనటం కరెక్టు సార్ అంటుంది. నా ఇష్టాలు బానే గుర్తుపెట్టుకున్నావ్, కానీ నీ ఇష్టాలనే మర్చిపోయావ్ అంటాడు రిషీ. దానికో కొటేషన్ చెప్తుంది వసూ. నీతో మాటల్లో నేను గెలవగలనా అంటాడు రిషీ. మనమొకసారి తీరిగ్గా మాట్లాడుకోవాలి టైం దొరుకుతుందా అంటాడు రిషీ. ఏంటి సార్ మీరు నన్ను టైం అడుగుతున్నారు అంటుంది వసూ. టైం బాగాలేనప్పుడు టైం అడగాలి కదా అంటాడు రిషీ. విచిత్రంగా మాట్లాడతారేంటి సార్, మీరు మీరేనా, మీ టైం బాలేదా, మీకేం తక్కువ సార్ అంటుంది వసూ. ఈ ప్రశ్న నేను రోజులో చాలా సార్లు వేసుకుంటాను, బయటకువెళ్దామా అంటాడు రిషీ. వెళ్దాం సార్ అంటుంది వసూ..శిరీష్ ఏమనుకోడుగా అని రిషీ అంటే..శిరీష్ ఏమనుకుంటాడు సార్..నేను మీకే బయపడతాను శిరీష్ కి కాదు అంటుంది వసూ . ఇద్దరు కారులో కుర్చుంటారు. వసూ సీట్ బెల్టుపెట్టుకుంటుంటే..గతంలో ఓసారి వసూకి రిషీ సీట్ బెల్టు సీన్ గుర్తుచేసుకుంటాడు. ఒక దగ్గరకు వెళ్తారు.

రిషీ మనసులో ఆ ఎంగేజ్ మెంట్ గురించే ఆలోచిస్తాడు. ఇంతజరిగాక కూడా తన ఎంగేజ్ మెంట్ గురించి చెప్పటం లేదు అనుకుని వసూతో శిరీష్ నన్ను ఎంగేజ్ మెంట్ కి రమ్మన్నాడు అంటాడు రిషీ. వసూ శిరీష్ చెప్పేశాడా, నన్ను చెప్పొద్దని తనే ముందు చెప్పేశాడా అంటుంది. పాపం రిషీ దీనంగా నీకైనా చెప్పాలనిపించలేదా వసుధార అంటాడు. సార్ ఇదంత పెద్ద విషయం అని అనుకోలేదు, అయినా ఇందులో ఏముంది సార్ చెప్పడానికి, అయినా అలా జరిగిపోయింది అంతే అంటుంది వసూ. రిషీ మనసులో ఏముంది అంటుంది ఏంటి, నేను ఇంత టెన్షన్ పడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను,తనకేం బాధలేదా, నన్ను ఇంత లైట్ గా తీసుకుందా అని మనసులో అనుకుంటాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ హే కదా, శిరీష్ ఇదంతా ఎలా అంటాడు. వసూ ఫ్రెండిష్ అయినా కాకపోయినా, ప్రేమపుట్టడానికి ఎంతసేపు సార్ క్షణం చాలు అంటూ వసూ ఏదేదో చెప్తుంది. రిషీ బాధనుదిగమింది..అవునా , ప్రతివిషయం నాతో చెప్పేదానివి కదా మరి శిరీష్ విషయం అంటాడు. శిరీష్ వద్దనిచెప్పాక నేను ఎలా చెప్తాను సార్ అర్థంచేసుకోండి సార్ అంటుంది వసూ. అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే అంటాడు. వసూ ఇంతలో దూరంగా ఒక అతను కుర్చుంటే వసూ వెళ్లి డబ్బులు ఇస్తుంది. రిషీ తనేం అడగలేదు కదా అంటే..అడిగితే చేసేది దానం అడగకుండా చేసేదే సాయం అంటుంది వసూ. సరే వెళ్దామా అని రిషీ అంటాడు. వెళ్దాం సార్, శిరీష్ ని కలవాలి అంటుంది వసూ. రిషీ మనసులో చాలా బాధపడతాడు. కారులో కుర్చోడానకి వెళ్తూ వసూఇచ్చిన పెన్ను కిందపడుతుంది. వసూ పిలిచి సార్ మీరు పెన్ను పడేసుకున్నారు అంటుంది. నేను చాలా పోగొట్టుకుంటున్నాను ఈ మధ్య అంటాడు. వసూ అవునా, ఏంటి సార్ అది అంటుంది. రిషీ పోగొట్టుకున్నవన్నీ నువ్వు తిరిగి ఇవ్వలేం కదా అని పెన్ను తీసుకుని కారు ఎక్కుతాడు. పాపం రిషీ కష్టం మాములుగా లేదు. రిషీ ఎక్కడికి అంటే..ఇంకెక్కడికి సార్ ఇంటికే ఎంగేజమ్ మెంట్ కదా బోలెడుపనులు ఉన్నాయ్ అంటుంది. రిషీకి మళ్లీ గుండెల్లో గుచ్చినట్లు ఉంటుంది.

కట్ చేస్త వసూ జగతి మాట్లాడుకుంటారు. జగతి బీరువాలో నగలు సర్దుతుంది. ఏంటి మేడమ్ ఈరోజు ఈ పని పెట్టుకున్నారు అంటుంది. జగతి ఏదో ఒకటి చెప్తుంది. బెడ్ పైన ఉన్న రింగ్ చూసి వసూ చాలాబాగుంది మేడమ్..నేను ఇలాంటిది ఒకటి చేయించుకుంటాను మేడమ్ అంటుంది. ఇలాంటిది ఎందుకు ఇదే పెట్టుకో అని వసూకి ఆ రింగ్ పెడుతుంది జగతి. రిషీ రేపు ఇదే ఎంగేజ్ మెంట్ రింగ్ అనుకుంటాడేమో. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో రిషీ ఏంటి వసుధార నీకు ఎంగేజ్ మెంట్ అవుతుంటే నేను బాధపడుతున్నాను అనుకుని బ్యాగ్ సర్ధుకుంటాడు. మహేంద్ర వచ్చి ఎక్కడికి రిషీ అంటే..ఎక్కడికో ఓ చోటుకి దూరంగా అంటాడు రిషీ. ఆ ఎంగేజ్ మెంట్ నచ్చక వెళ్తున్నావా అని మహేంద్ర అంటే..నాకేం సంబంధం అంటాడు రిషీ. నచ్చకపోతే ఆపోచ్చుకదా రిషీ అని మహేంద్ర అంటాడు. అయినా రిషీ కోపంగా లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోతాడు. చూడాలి రేపు ఏం జరుగుతుందో.