గుప్పెడంతమనసు ఎపిసోడ్ 284 : వసుధార జీవితాన్ని మీరు ప్లాన్ చేస్తున్నారు అంటూ..జగతిపై మండిపడ్డ రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ క్లాస్ లో కుర్చుని రిషీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సార్ ఏంటో పిలిస్తే పట్టించుకోరు అంటూ మాట్లాడుతుంది. పక్కనే ఉన్న పుష్పా నువ్వేం చెప్తున్నావో నాకూడా అర్థంకావటంలేదు అంటుంది. ఇంతలో క్లాస్ కి రిషీ వస్తాడు. రిషీ వసూని చూసి ఎంగేజ్ మెంట్ సీన్ గుర్తుచేసుకుని ఈ మూడ్ లో క్లాస్ చెప్పలేను..చెప్పినా స్టూడెంట్స్ కి అర్థంకాదు అనుకుని ఈరోజు క్లాస్ లేదు చదువుకోండి అని వెళ్లిపోబోతాడు..వసూ సార్ క్లాస్ ఎందుకు తీసుకోవటంలేదో తెలుసుకోవచ్చా అంటుంది. క్లాస్ ఎందుకు తీసుకోవటం లేదని నీకు సమాధానం చెప్పాలా అని..అయినా నా మూడ్ బాలేదని క్లాస్ తీసుకోకపోవటం కరెక్టుకాదేమో అని మళ్లీ వస్తాడు. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటే వసుధార చెప్పినట్లు అవుతుందేమో..అయినా నా మనసు నా ఇష్టం..మధ్యలో వసుదార పెత్తనం ఏంటి అనుకుని బోర్డుపై నో క్లాస్ అని రాస్తాడు. అందరూ వెళ్లిపోవచ్చు అంటాడు. వసుధారను ఆగమంటాడు.

ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో కరెక్టుగా చెప్పు అంటాడు. వసూ ఏముంది సార్ మీరు క్లాస్ ఎందుకు తీసుకోరు అన్నందుకు ఇప్పుడు నాకు క్లాస్ తీసుకుంటారు అనుకుంటున్నాను అంటుంది. నువ్వు అనుకునేది తప్పు, నాకోసం కొన్ని బుక్స్ తీసిపెట్టమని లైబ్రేరియన్ కి చెప్పాను వెళ్లి ఆ బుక్స్ తీసుకురా అంటాడు. వెళ్లొచ్చా సార్ అంటుంది. బుక్స్ తీసుకురా అన్నానంటే..వెళ్లమనే కదా అర్థం అంటాడు రిషీ. ఇంకేమైనా చెప్తారేమో అని అంటుంది వసూ.. ఇంకేమైనా చెప్పాలంటే.. మెసేజ్ చేస్తా అంటాడు. నేను మెసేజ్ చేస్తే రిప్లైయ్ ఇవ్వరు కానీ మళ్లీ మెసేజ్ చేస్తారంట అనుకుని వసూ లైబ్రరీకి వెళ్తుంది. సార్అడిగిన బుక్స్ లేకపోవటంతో ఆర్డర్ ఇచ్చి తెమ్మని రిషీ సార్ యే చెప్పి వెళ్లారు….మళ్లీ నిన్ను పంపించారా అంటాడు అక్కడ లైబ్రేరియన్. వసూ ఇదేంటి బుక్స్ లేవని తెలిసికూడా నన్ను లైబ్రరీకి పంపించాడంటే సార్ ఉద్దేశం ఏంటి..కావలనే చేశారా అనుుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. రిషీ వసూని చూసి లైబ్రరీకి వెళ్లివచ్చినట్లు ఉంది. అసలు వసూ ఏం ఆలోచిస్తున్నట్లు అనుకుంటాడు.

మహేంద్ర వసూని చూస్తాడు. నైట్ పొగరు అని రిషీకి కాల్ చేసింది ఎవరో..ఇప్పుడు కనిపెడదాం అనుకుంటాడు.. వసూ ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు అంటుంది. ఆలోచిస్తున్నాను వసుధార అంటాడు. ఏం ఆలోచిస్తున్నారు సార్ అంటే పొగరు అంటాడు. ఏంటి ఏం రియాక్ట్ అవటంలేదు అని అనుకుంటాడు. వసూ సార్ నాకేం అర్థంకావటంలేదు అంటే..మన ఎండీగారు నిన్ను ఏమని పిలుస్తారు అని మహేంద్ర అడుగుతాడు. వసూ భలేగా చెప్తుంది. వసుధార అనే పేరునే డిఫ్రెంట్ మాడ్యూలేషన్స్ లో చెప్తుంది. మహేంద్ర నవ్వి..రిషీ కోపాన్ని నువ్వు అర్థంచేసుకున్నావ్ కదా, రిషీని కూడా నువ్వే అర్థంచేసుకోవాలి, సహజంగా తెలివైనోడే..కానీ జగతి విషయం వచ్చేసరికి దేవయాని వదిన చెప్పిన మాటలనే నమ్ముతున్నాడు..నువ్వు రిషీకి భయపడతావా అంటాడు. వసూ భయపడతావా అంటే..అప్పుడప్పుడు భయడినట్లు నటించాల్సి వస్తుంది సార్ అంటుంది వసూ. మహేంద్ర నవ్వుతాడు. అవును నీకు నేను చెప్పిన పనేమైంది( గురుదక్షిణ) వసుధార అంటాడు. వసూ రిషీ సార్ కోపాన్ని, సార్ మూడ్ ని సమతూల్యం చేయాలి అంటే టైంసరిపోవటం లేదని అంటుంది. నా ప్రయత్న లోపం లేదు సార్ అని చెప్తుంది.

ఇంకోవైపు రిషీ- జగతీలు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఫైనల్ గా రిషీ మీ వర్క్ మీ అలోచనలు చాలా బాగుంటాయి..కాలేజ్ లో మాత్రమే, మిషన్ ఎడ్యుకేషన్ వరకూ బాగానే ఉందికానీ, ఇతరులు జీవితాన్ని కూడా మీరే ప్లాన్స్ తో నడిపించటం కరెక్టుకాదు మేడమ్ అంటాడు. నేను నడిపించటం ఏంటి సార్ అంటుంది జగతి.. రిషీ వసూధారను మీరు తప్పుదారి పట్టించలేదా, వసుధార జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేదా అంటాడు. ఇంకోవైపు వసూ కూడా రిషీ క్యాబిన్ కు వస్తూ ఉంటుంది. జగతీకి ఏం అర్థంకాదు. చేసిన తప్పులను మీరు ఎప్పుుడు ఒప్పుకున్నారు అంటాడు. వసూ వస్తుంది. రిషీ చిన్నగా వసుధార ముందు ఇవన్నీ మాట్లాడటం కరెక్టుకాదు..నేను ఈ టాపిక్ గురించి ముందు కూడా మాట్లాడను అంటాడు. జగతి వెళ్లిపోతుంది. వసూ సార్ అని పిలుస్తుంది.

మనోడికి అక్కడ శిరీష్ లేకపోయిన ఉన్నట్లు కనిపిస్తుంది. వసూ ఏంటి సార్ మీరు అనవసరంగా లైబ్రరీకి పంపారు అంటుంది. నేను పంపకున్నా నువ్వే పెళ్లిచేసుకుని వెళ్తున్నావ్ కదా వసుధార అనుకుని వెళ్లండి ఇంకేం అడగొద్దు అంటాడు. వసూ సార్ వెళ్లండి అంటున్నారు.. ఇంకెవరు ఉన్నారు సార్, నేనొక్కదాన్నేకదా అంటుంది. ఒక్కదానివే ఉంటే వెళ్లకు అంటాడు.వసూ సార్ అంటుంది. రిషీ కోపంతో చేతిలో ఉన్న మేకు లాంటిది ఏదో ఉంటే విసిరేస్తాడు. అది కాస్త వసూ కంటికి తగులుతుంది. అంతే రిషీ వచ్చి ఏమైంది వసుధార..సారి అలా తగులుతుంది అనుకోలేదు అని చున్నీతో వేడిచేసి కంటిమీద పెడతాడు.తొందర్లోనే రిలీఫ్ గా ఉంటుంది అంటాడు. అప్పుడే వసూ చేతికి ఉన్న రింగ్ చూసి..అది ఎంగేజ్ మెంట్ రింగ్ అనుకుని మళ్లీ మూడ్ మారిపోతుంది. వెళ్లు వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు. వసూ నేను ఎందుకు వచ్చానో అని చెప్పబోతే..తర్వాత మాట్లాడదాం అని ఫోన్ మాట్లాడతాడు. వసూ సార్ ఏంటి సడన్ గా ఫోన్ మాట్లాడుతున్నారు..అంటే నన్ను వెళ్లిపోమన్నట్లే కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుని బాధతో వెళ్లిపోతుంది. వసూ వెళ్లటం రిషీ కూడా చూస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు నాకు నచ్చలేదు వసుధార, అయినా సడన్గా చదువు మధ్యలో ఆపి ఈ పెళ్లేంటీ అనుకుంటాడు.

ఇంకోవైపు రిషీ అన్న మాటలు జగతి మహేంద్రకు చెప్తుంది. రిషీ అలా అంటాడేంటి..నాకేం అర్థంకావటంలేదు అంటుంది. మహేంద్ర ఓహో వీడు ఇలా ఆలోచిస్తున్నాడా..మనసులో మాట బయటపెట్టమంటే..జగతిమీద కోపం పెంచుకుంటాడేంటీ అనుకుంటాడు. మహేంద్ర వదిలేయ్ జగతి అంటాడు. అలా ఎలా వదిలేస్తాను, రిషీకి నా మీద ఈ కొత్తకోపం ఏంటి, నువ్వే అలా కూల్ గా ఉన్నావ్. నాకు తెలియని విషయం ఏదైనా నీకు తెలుసా అంటుంది. అబ్బే అలాంటిది ఏమి లేదు అని మహేంద్ర అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news