గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, రిషీ మాట్లాడుకుంటూ ఉంటారు. రిషీ భోజనం చేశారా అంటే..శుభ్రంగా చేశాను అంటాడు మహేంద్ర..మీరేదో నాకు భోజనం తెచ్చినట్లు మరి ఎందుకు అడుగుతున్నారు అని రిషీ అడుగుతాడు. ఇంతలో ధరణి భోజనం ప్లేట్ తీసుకుని వస్తుంది. ఓహో ఏర్పాట్లు చేసే వచ్చారా అంటాడు రిషీ. మహేంద్ర రిషీకి తినపెడడామంటే…రిషీ మహేంద్రకు తినిపిస్తాడు. తండ్రికొడుకుల సెంటిమెంట్ బాగా చూపిస్తారు. మహేంద్ర ఎదుటివాళ్లను బాధపెట్టేమాటలు ఎందుకు అలా చటుక్కున అనేస్తావ్ అంటాడు. రిషీ నా మనసులో ఉన్నవి చెప్పేస్తాను..సూచనగా తీసుకుంటే బాగుపడతారు అంటాడు. అలా అని మనసులో మాటలు అన్నీ చెప్పటం లేదుగా అని మహేంద్ర అంటే..ఏమో డాడ్ నా మనసులో ఏముందో కూడా నాకు తెలియటం లేదు అంటాడు రిషీ. మనసులో ఆ పొగరు తినిందో లేదో అని ఆలోచన.
ఇంకోపక్క వసూ రిషీ సార్ ఏంటో ఏం అర్థంకారు. నేను ఆర్టికల్ పేపర్స్ తీసుకెళ్లి చూపిస్తే అక్కడ పెట్టమన్నారు. పట్టించుకోలేదు. నా తప్పేం లేకుండా నన్ను అంటే నేను ఎందుకు పడాలి, అసలు నా తప్పేం ఉందో చెప్పమన అడుగుతాను అనుకుని మెసేజ్ చేస్తుంది. రిషీ ఇంకెవరూ ఆ పొగరే అయి ఉంటుంది. సారీ సార్, మిమ్మలన్మి అడగకుండా ఆర్టికల్ రాయటం తప్పే అని సారీలవర్షం కురిపిస్తుందేమో అనుకుని..అసలు ఈ మెసేజ్ లో ఏం ఉంటుంది. ఏం ఉంటే నాకేంటి నేను చూడను అనుకుంటాడు. పక్కనే ఉన్న డస్టబిన్ పొరపాటున తగలటంతో అందులో రిషీ మెన్న విసేరేసిన ఆర్టికల్ పేపర్స్ ఉంటాయి. అప్పుడు రిషీకి అర్థమవుతుంది. ఇక్కడ వసూ ఏంటి సార్ రిప్లైయ్ ఇవ్వటం లేదు, నిద్రపోతున్నారా లేక చూస్తే రిప్లైయ్ ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వటం లేదా అనుకుంటాడు. నిద్రపోతున్నారా అని మెసేజ్ చేస్తే..నిద్రపోక తీన్మార్ చేస్తానా అంటారేమో..అయినా ఎందుకు ప్రతిదానికి ఇలా భయపడటం, ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో తెలియటం లేదు, రిషీ సార్ లో మాత్రం చాలా మార్పు వచ్చింది అనుకుంటది. ఇటుపక్క రిషీ అంటే ఆరోజు నాకు చూపించటానికే వసుధార ఆ పేపర్స్ తీసుకొచ్చిందా, సారీ చెప్పాలా, అప్పుడు అన్ని మాటలు అని ఇప్పుడు సారీ ఎలా చెప్తాం ఇలా చెప్పాలా వద్దా అని ఓ ఆలోచిస్తాడు. పేపర్ మీద వసుధార శిరీష్ అని రాసి అసలు ఈ పేర్లు రెండూ పక్కపక్కనే బాలేదు అని రిషీ వసుధార రాస్తాడు. ఈ రెండు బాగున్నాయి కదా అనుకని మళ్లీ అందులోంచి వసూ తీసేసి..రిషీధార ఇది ఇంకా బాగుంది, బాగుంది కానీ వసుధార చేసిన పనే బాలేదు, తీసుకున్న నిర్ణయం అస్సలు బాలేదు, ఊహలు బాగుంటాయి, అవి ఎప్పుడు నిజాలు కావు అనుకుని వసూ మెసేజ్ చూసి నా తప్పేంటి సార్ అని పెట్టిన మెసేజ్ కి రేపు పిక్ చేసుకుంటాను గుడ్ నైట్ చెప్తాడు.
కట్ చేస్తే..రిషీ, వసూలు కారులో వెళ్తుంటారు. ఒకళ్లకొకరు మనసులో మాట్లాడొచ్చుగా అనుకుంటారు. మొత్తానికి మనోడే గొంతుతో ఏదో సైగచేస్తాడు. వసు వెంటనే వాటర్ ఇస్తుంది. అలా మాట్లాడుకుంటూ..టిఫెన్ ఏం తిన్నావ్ అంటే తినబుద్దికాలేదు సార్ అంటుంది. మరి మీరు అంటే..బానే తిన్నాను రెండుమూడు రకాలు అంటాడు. ఇంతలో మహేంద్ర కాల్ చేసి ఏంటి రిషీ టిఫెన్ తినకుండా వచ్చేశావ్ అని కారు బాక్ సీట్ లో కవర్ ఉంది అందులో టిఫెన్ ఉంది తిను అంటాడు. రిషీ మనసులో ఒక్క అబద్ధం కూడా ఆడలేనా తను అన్నన్ని అబద్ధాలు ఆడుతుంది అనుకుంటాడు. వసూ కారు ఆపమంటుంది. రిషీ ఆపుతాడు.
టిఫెన్ చేయండి సార్ అంటుంది. మొత్తానికి ఇద్దరూ కలిసి టిఫెన్ చేస్తారు. వసూ మూతికి అంటుకుంటే..రిషీయే ఫస్ట్ తుడుద్దాం అనుకుంటాడు, మళ్లీ కెమెరాలో చూపిస్తాడు. టిష్యూపేపర్స్ ఉన్నాయని చూపిస్తాడు.. అందులోనే ఆర్టికల్ పేపర్స్ ఉంటాయి. నేను లేటుగా చూశాను ఆ పేపర్స్ అంటాడు రిషీ. మీరు వెనుకాముందు చూడకుండా ఎందుకు సార్ ఆలా అరుస్తారు ,దాని వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటా అంటుంది వసూ. పుష్పాకు చెప్పిన పని నువ్వు చేయటమేంటి ఓవర్ యాక్షన్ కాకపోతే అంటాడు రిషీ. ఓవర్ యాక్షన్ ఏంటి సార్ అని వసూ అడిగితే..అవును నువ్వు ఈ మధ్య డబుల్ ఓవర్ యాక్షన్ పనులు చేస్తున్నావ్ అంటాడు రిషీ. నేనా అంటుంది వసూ. అవును నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని నీకు ఎన్ని సార్లు చెప్పాను అది వినపించుకోకుండా అన్నీ మర్చిపోయి ఆ శిరీష్ ని పెళ్లిచేసుకుంటున్నావ్ చూడూ అది ఓవర్ యాక్షన్ కాదా, ఎందుకు చెప్పలేదు చెప్పు చెప్పు అని వసూ చేయి పట్టుకుంటాడు. వసూకి ఏం అర్థంకాదు..షాకై అలానే చూస్తుంది..రిషీ గట్టిగా చేయి పట్టుకుని చెప్పు చెప్పు అనటంతో వసూ చేయి వదలండి సార్ అంటుంది, ఎపిసోడ్ ముగుస్తుంది. మెయిన్ మ్యాటర్ అంతా మనసులో అనుకుని చెప్పు చెప్పు అనేది మాత్రం బయటకు చెప్పి వసూ చేయి పట్టుకున్నట్లు ఉన్నాడు రిషీ. ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.