గుప్పెడంతమనసు ఎపిసోడ్ 294: రిషీ మీద వసూకి మొదలైన ద్వేషం..తన పదవికి రాజీనామా చేయటానికి కూడా సిద్ధపడిన వసుధార

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో పుష్పా, జగతి రెజిలింగ్ హ్యాండ్ ఆడుతూ ఉంటారు. రిషీ గతంలో సూసైడ్ చేసుకున్న షీలాను చూసి అప్పుడేమో రాద్దాంతం చేసిన అమ్మాయి ఇప్పుడు ఎంత హాయిగా నవ్వుతుందో అనుకుంటాడు. జగతి ఆల్ మోస్ట్ ఓడిపోయే పరిస్థితిలో రిషీ మేడమ్ ఓడిపోవద్దు, మీరే గెలవాలి మేడమ్ అంటాడు..జగతి కొడుకు మాట్లాడటంతో వెయ్యిఏనుగుల బలం వచ్చినట్లైతది..దెబ్బకి పుష్పాను ఓడిస్తుంది. రెండో రౌండ్ ఆడతారు. అలా కొన్ని రౌండ్స్ ఆడతారు. ఫైనల్ రౌండ్ లో రిషీ ఉంటాడు. రిషీతో పోటీ పడటానికి మహేంద్ర మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు అని అడుగుతాడు. వసూ కాసేపు ఆలోచించి నేనే పోటీపడతాను అంటుంది. మహేంద్ర, జగతీలు షాక్ అవుతారు. రిషీ నాతో పోటీ ఏంటి అంటే..వసూ పోటీ గట్టిగానే ఉండాలి కదా సార్ అంటుంది, గెలుస్తావా అంటే..ప్రయత్నిస్తాను సార్ అంటుంది. ఓడిపోతావేమో అంటే..ఆడితేనే కదా సార్ ఓడినా గెలిచినా అంటుంది. పోటీ స్టాట్ అవుతుంది.

రిషీ వసూ చేయి పట్టుకుంటాడు. రిషీ పాపం గెలుద్దామానే అనుకుంటాడు..కానీ వసూ చేతికి ఆ రింగ్ చూడగానే మనోడికి ఎంగేజమ్ మెంట్ గుర్తుకువచ్చి..చేయి వదిలేసి, నీతోపోటీ పడటం నాకు ఇష్టం లేదు, ఉచితంగా వచ్చే గెలుపు నాకు అక్కర్లేదు, నా తరుపున ఒక అమ్మాయిని ఎంచుకో, ఆ అమ్మాయిని ఓడిస్తే మీరే గెలిచినట్లు అంటాడు. వసూ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయికి రిషీ మనమే గెలవాలి అని టిప్స్ ఇస్తాడు. గేమ్ స్టాట్ అవుతుంది. రిషీ కాఫీ తాగుతూ..మీద పడినట్లు అరుస్తాడు. దాంతో వసూ రిషీని చూస్తుంది. ఆ అమ్మాయి వసూని ఓడిచ్చేస్తుంది. వసూ ఇది అన్యాయం సార్, ఆల్ మోస్ట్ నేనే గెలిచాను, నేను మిమ్మల్ని చూశాను, చూపుతిప్పుకున్నాను అంటే..రిషీ గట్టిగా అరుస్తాడు. జస్ట్ షట్ అప్ వసుధార అని తనపై ఇష్టం వచ్చినట్లు తిడతాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే..ఇలానే ఓడిపోతారు. ఇందుకు మంచి ఉదాహరణ వసుధార ఓటమి అంటాడు. మహేంద్ర వీడు మనసులో ఉన్నది దాచిపెట్టుకుని ఇలా వసూని సాధిస్తున్నాడు అనుకుంటాడు.

గర్వం, అహంకారంతో విర్రవీగితే విజయం రాదు వసుధార అంటాడు. సార్ నాకు గర్వమా అని వసూ అంటే..అవును నీకే గర్వం, ఏం చేసినా చెల్లుతుందని గర్వం, తెలివైనదానివి అనే గర్వం, యూత్ఐకాన్ అని గర్వం అంటాడు రిషీ. ఇంతమంది ముందు నన్ను అవమానించాలని అనుకున్నారా అంటే..యస్ అంటాడు రిషీ, మహేంద్ర ఆపడానికి ప్రయత్నిస్తే..మీరు ఆగండి సార్..తన కాన్ఫిడెన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంట, విజయానికి పరమ్నినెంట్ అడ్రస్ అంట తన నోటితోనే అనింది అంటాడు. వసుధారకు శిరీష్ తో సరదాగా మాట్లాడింది విన్నారా, విన్నా ఇక్కడ చెప్పాలా అనుకుంటుంది. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావ్ వసుధార. తప్పుదారిలో వెళ్తున్నావ్ అంటాడు రిషీ. నేనేం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను ఒక్కటి చెప్పండి అంటుంది వసూ. ఇదే ఈ అహంకారమే వద్దంటున్నాను అని, స్టూడెంట్స్ కి హితబోధ చేస్తాడు..ఒక్క మార్కులో ఫెయిల్ అయినా ఫెయిల్ అనే అంటారు, ఒక్క సెకండ్ లో ఓడిపోయినా ఓటమి అనే అంటారు..ఈ అహంకారి అయినా వసుధారను ఉదారణగా తీసుకోండి అంటాడు. మహేంద్ర మనసులో ఇలా చేస్తే ఆ అమ్మాయికి రిషీ మీద ఉన్న గుడ్ ఇంప్రషన్ అంతా పోతుంది అనుకుంటాడు. వసూకి కోపం వస్తుంది. దిస్ ఈస్ టూ మచ్, నన్ను అహంకారానికి గుర్తింపుగా చూపిస్తున్నారా, నేను ఒప్పుకోను, ఇది నా ఓటమేకాదు అంటుంది. దీన్నే అహంకారమే కాదు, అహంకారానికి మూర్ఖత్వం తోడైతే గాలికి వాన తోడైనట్లే అని వెళ్లిపోతాడు. వసూ వెనకే పరిగెట్టుకుంటూ వస్తుంది. అయినా రిషీ వినడు. కారు ఎక్కేసి వెళ్లిపోతాడు. వసూకి కోపం వస్తుంది.

ఆరోజు రాత్రి వసూ గదిలో కుర్చోని రిషీ అన్న మాటలను తలుచుకుంటుంది. జగతి వచ్చి ఏంటి వసూ నువ్వు ఇంకా కాలేజ్ గురించే ఆలోచిస్తున్నావా, మర్చిపోలేదా అంటే..మర్చిపోయే మాటలు అనలేదు మేడమ్ రిషీ సార్ అంటుంది. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం అని జగతి అంటుంది. నేను ఓటమి భారాన్ని కాదు మేడమ్ మోసేది..అవమాన భారాన్ని, అంతమందిలో అన్నన్ని మాటలు అనటం కరెక్టు కాదు మేడమ్ అంటుంది వసూ.

ఇక్కడ రిషీకి కూడా మహేంద్ర..ఏదేమైనా అంతమందిలో వసూని అనటం కరెక్టుకాదు అంటాడు. పాఠాలు, గుణపాఠాలు అందరిముందే నేర్చుకోవాలి డాడ్, మనకు ఇష్టం వచ్చినట్లు కాదు అంటాడు రిషీ. ఓడిందనే అన్నావా, ఇంకేమైనా మనసులో పెట్టుకుని అన్నావా అంటాడు. ఇక్కడ వసూ కూడా కచ్చితంగా రిషీ సార్ మనసులో ఏదో పెట్టుకుని అంటున్నారు, ఈ మధ్య రిషీ సార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, మీతో ఏమైనా మీరు ఫీల్ అవుతారు, కానీ నేను దాచుకోను మేడమ్ అంటుంది.

మహేంద్ర రిషీతో నీతో బలప్రదర్శనలో వసుధార గెలుస్తుందా చెప్పు అంటాడు. మరి ఎందుకు ప్రగల్భాలు పలకాలి, ఎందుకు పోటీకి రావాలి అంటాడు రిషీ. మహేంద్ర చిన్న విషయం అర్థంచేసుకో, తను ఓడిపోతుందని అందరికి తెలుసు అయినా పోటికి రావటం తన వ్యక్తిత్వం అంటాడు. మూర్ఖత్వం డాడ్ అని రిషీ అంటాడు. ఇక్కడ వసూ జగతీతో మేడమ్..నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్ప్ క్ట్ రిషీ సార్ కి మూర్ఖత్వంలా అనిపించి ఉంటాయి. రిషీ సార్ తో గెలవలేను..అయినా పోరాడకుండా ఓటమిని ఎందుకు ఒప్పుకుంటాను మేడమ్ నేను అని వసూ అంటుంది. గుడ్ ఇది మంచి వ్యక్తిత్వం అంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో వసూ ఫుల్ ఫైర్ లో నన్ను అన్నన్ని మాటలు అన్నారు. రాజీనామా చేసేస్తాను అనుకుని రిషీకి చేసే అసిస్టెంట్ ఉద్యోగానికి రాజినామా చేయాలని నిర్ణయించుకుని లెటర్ తీసుకుని రిషీ క్యాబిన్ కి వెళ్తుంది. అప్పటికే రిషీ వేరే వ్యక్తిని తన పీఏగా నియమించుకుంటాడు. నాతో చెప్పకుండా నన్ను ఎలా తీస్తారు సార్ అని వసూ అడుగుతుంది. నాకు ఆ హక్కు ఉంది అంటాడు రిషీ. అడిగే హక్కు, ఆపే హక్కు నాకూ ఉంది అంటుంది వసూ. దీన్నిబట్టి చూస్తే ఇకనుంచి రిషీ వసుధారల మధ్య నువ్వానేనా అనేట్లు ఉండబోతుందేమో..చక్కగా సాగిపోయే కథలో మహేంద్ర చేసిన పనికి ఆగం ఆగం ఐతుంది సీరియల్ అంతా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. చూడాలి సోమవారం వీళ్లద్దరిమధ్య యుద్ధం ఏ రేంజ్ లో ఉండబోతుందో.
-triveni

Read more RELATED
Recommended to you

Latest news