గుప్పెడంతమనసు ఎపిసోడ్ 328 : క్లాస్ లో బ్యాగ్ లోంచి గోలీలు పడటంతో కిందపడిపోయిన వసుధార..కనీసం పట్టుకోని ఇగోమాష్టర్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధారతో మాట్లాడేందుకు బయటకు తీసుకొచ్చి రిషి ఓ గ్రౌండ్ లో కారు ఆపి దిగమంటాడు. నేను-మేడం సారీ చెప్పమన్నా చెప్పేది లేదన్న వసుధార మాటలను రిషీ గుర్తుచేసుకుని…తప్పు చేశావ్ వసుధార పెద్దమ్మ విషయంలో తప్పు చేశావ్ అంటాడు. మధ్యలో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం చెప్పేమాట కూడా వినడు ఈ ఇగోమాష్టర్.. నేనేమీ చేయకుండానే మీ పెద్దమ్మ పడిపోయారని అంటుంది వసూ. నువ్వు పెద్దమ్మ వైపు వేలుచూపి అరిచావ్, తిట్టావ్ అది అబద్దమా అంటాడు రిషీ. ఆ‌విడవచ్చి ఏం మాట్లాడారో మీకు తెలియదు అంటుంది వసూ. ఆమె ఏదైనా అని ఉండొచ్చు దానికి మీరు అంతలా రియాక్టవ్వాలా… ఈ విషయంలో నేను చెప్పాలని వచ్చాను, నువ్వు చెప్పేది వినాలని కాదని గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడతాడు రిషి. పెద్దమ్మని కిందపడేశావ్, కనీసం సారీ చెప్పలేదు అంటాడు. అప్పడు.

వసుధార.. ఆవిడ మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఆవిడని మేం అగౌరవ పరచలేదు.. తప్పు నావైపు ఉంటే తప్పక సారీ చెప్పేదాన్ని. మీరు అన్నిసార్లు అడిగినా సారీచెప్పలేదంటే..మీరే అర్థంచేసుకోండి సార్ అంటుంది వసూ. రిషీ..నేను నిన్ను సారీ చెప్పమన్నాను నువ్వు చెప్పలేదు..ఇక టాపిక్ వదిలెయ్..మా పెద్దమ్మే నాజీవితం తనని బాధపెడితే నేను వందరెట్లు బాధపడతా అంటాడు. ఆ రోజు ఏవేవో ఫొటోలు చూపించి నోటికొచ్చినట్టు మాట్లాడారు అంటుంది వసుధార. వసుధార చెప్పాలని ఎంత ట్రై చేసినా మనోడు వినడు..అతని వర్షన్ లో చెప్పేసుకుంటాడు.. నేను చెప్పింది విను తను ఏం చేసినా అన్నీ నాకోసమే అంటాడు. కనీసం వసుని మాట్లాడనివ్వడు. పెద్దమ్మని గౌరవించకపోతే ఊరుకోను అంటాడు. నేను చెప్పేది పూర్తిగా మీరు వినడం లేదు అని వసూ అంటే..చెప్పాను కదా వసుధార ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం అంటాడు రిషీ. వసూ ఏంటో..తన చెప్పేదేకానీ..ఎదుటివారు చెప్పేది వినరు అనుకుంటుంది వసూ. ఇద్దరూ కారెక్కి వెళ్లిపోతారు.

కాలేజీలో

రిషి పొద్దున్నే ఇంటికి వచ్చాడా…ఎందుకు వచ్చాడు అని జగతిని మహేంద్ర అడుగుతాడు. నువ్వు పట్టించుకోలేదన్న జగతితో…నాకేం తెలుసు అంటాడు మహేంద్ర. రిషి మూడ్ ఎలా ఉందో నీకు తెలియాలి అని మహేంద్రపై ఫైర్ అవుతుంది జగతి. తను ఎలా ఉన్నాడో నువ్వు చెప్పాలి అంటుంది. పక్కనే ఉన్నా తనలో మనసులో తొంగిచూసే అవకాశం ఇవ్వడని మహేంద్ర చెబుతాడు. రిషి రోజురోజుకీ చిక్కు లెక్కలా మారిపోతున్నాడు మహేంద్ర..తన మనసులో డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలికదా అంటుంది జగతి.

దేవయాని ఇంట్లో:

అప్పటి వరకూ కాలూపుకుంటూ పడుకున్న దేవయాని..రిషి రావడం చూసి కాలు నొప్పి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓడియమ్మ ఈ‌విడ సెగలు మామూలుగా లేవు అని ప్రేక్షకులకు విసుగువచ్చేస్తుంది. రిషీని ఎర్రోడ్ని చేసి ఆడుకుంటుంది. రిషి దగ్గరుండి సపర్యలు చేస్తాడు. ధరణి ఉంది కదా నువ్వు తీసుకురావాలా అని బిల్డప్ ఇస్తుంది దేవయాని. మీరు తొందరగా బాగు అవ్వాలి అని రిషీ అంటే.. అంతమంది ముందు నన్ను అవమానించారు వాళ్లిద్దరూ అని రిషీని రెచ్చగొడుతుంది. ఎవరో ఏదో ఫోటోలు చూపిస్తే మీరు ఎందుకు వెళ్లారు..నాకు చెప్తే నేను చూసుుకునేవాడ్ని కదా అని రిషీ అంటే..దేవయాని మళ్లీ అవమానించారనే పాయింటే హైలేట్ చేసి..వాళ్లతో నువ్వు ఏం గొడవ పడకురా..వాళ్లమీద మనం గెలవలేం అని అంటుంది. నా కళ్లముందే జరిగింది కదా నేను ఊరుకోను పెద్దమ్మ అంటాడు రిషి. నాకు కావాల్సింది ఇదే కదా అనుకుని నవ్వుకుంటుంద .

కాలేజీలో:

క్లాస్ రూమ్ లో ఉన్న రిషి..వసుధార కనిపించకపోవడంతో వెతుకుతాడు. ఇంతలో వసు కమిన్ సార్ అంటుంది. ఏంటి లేట్ అని రిషీ అంటే..వసూ మీ వల్లే లేట్ అయిందికదా..మళ్లీ ఎందుకు లేట్ అంటారేంటి అనుకుంటుంది వసూ. రిషీ ఏంటి అలా చూస్తుంది..నా వల్లే లేట్ అయిందని అందరి ముందు చెప్తుందా ఏంటి అనుకుంటాడు రిషీ. వసూ సార్ ఎందుకు లేట్ అయిందంటే అని చెప్పబోతుంది..రిషీ సరే సరే వచ్చి కుర్చో అంటాడు. వసు నోట్ బుక్ ఇవ్వు అని అడగడంతో బ్యాగ్ లోంచి బుక్ తీస్తుండగా గోళీలన్నీ కిందపడతాయి. అందరూ నవ్వుతారు.

వాటిపైనుంచి జారి పడిపోతుంది వసుధార. రిషా వచ్చి ఏంటి అలా చూస్తున్నావ్..ఇక్కడే కుర్చుంటావా ఏంటి క్లాస్ అయిపోయేదాక లే అని చేయి ఇస్తాడు. వసూ లేచి కుంటుకుంటు వెళ్తుంది. రిషీ ముందు చూసు నడువు మళ్లీ ఎవరిమీద అయినా పడతావ్ అంటాడు. క్లాస్ స్టాట్ చేద్దాం అంటారు.

ఇంకో సీన్ లో జగతిని తన రూమ్ కి పిలిచిన రిషి..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తాడు. జగతి వెళ్లిపోబోతుంటే..రిషీ మీతో మాట్లాడాలని అని ఆఫుతాడు. వసు గురించి మీతో మాట్లాడాలి అంటాడు రిషీ. వసు ఏమైనా తప్పు చేసిందా అని అడుగుతుంది జగతి. వసుధార తప్పు చేయదు మేడం అన్న రిషి..నా మనసులో ఉన్న మాట చెప్పాలని అనుకుంటున్నా అంటాడు రిషీ. నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నా అనగానే ..వసు ని ప్రేమిస్తున్నా అనే మాట చెప్పబోతున్నాడా అనుకుంటుంది జగతి. వసుధారని మీ ఇంట్లో నుంచి పంపించేయండి మేడం అంటాడు రిషీ. జగతి షాకై..సార్ అంటే..మీరు సరిగ్గానే విన్నారు మేడమ్..వసుధారని మీ దగ్గర నుంచి పంపించేయండి..ఎందుకు ఏంటి అని వివరాలు అడగొద్దు..నాకుండే కారణాలు నాకున్నాయంటాడు.

మరోపక్క మహేంద్ర, వసూ వస్తుంటారు. వసూ ఇంకా కుంటుతూనే ఉంటుంది. రిషీ కొటేషన్స్ చెప్తాడు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది మేడమ్..నేను ఏది అనవసరంగా మాట్లాడను మేడమ్, తనకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మేడమ్..ఎవరెవరో గొడవల వల్ల తనని తాను కోల్పోవడం నాకు నచ్చటం లేదు..వసుధార అభివృద్ధఇనే కొరుకునే వారే అయితే..తమ వ్యక్తిత్వం మీద మచ్చ రాకూదని మీరు అనుకుంటే తనని మీ ఇంట్లోంచి పంపించేయండి అంటాడు. సరిగ్గా అదే టైంకి మహేంద్ర, వసూలు వస్తారు. ఎపిసోడ్ అయిపోతుంది. వీళ్లు విన్నారో లేదో తెలియదు కానీ..ముఖాలు మాత్రం షాకై నట్లు పెడతారు.

                                                                                                                         -triveni

Read more RELATED
Recommended to you

Latest news