గుప్పెడంతమనసు ఎపిసోడ్ 295: సైకిల్ పై రిషీని ఛేస్ చేసిన వసుధార..రోడ్డుమీదే రిషీవసూల పంచాయతీ..!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ , మహేంద్రలు వసూ గురించి మాట్లాడుకుంటారు. ఫైనల్ గా రిషీ ఈ సంఘటన గురించి ఇంతసేపు మాట్లాడటమే అనవసం, మీకు తెలియదుకదా తనేమందే అని శిరీష్ తో అన్న మాటలను చెప్తాడు. తనేదో సరదాకు అనిందిఏమోలే అంటాడు మహంద్ర..కానీ నేను సీరియస్ గానే తీసుకున్నాను అంటాడు రిషీ. ఇంక ఏం చెప్పలేక మహేంద్ర వెళ్లిపోతాడు. ఇంకోవైపు వసూ బుక్ తీసుకుని తన ఉద్యోగానికి రాజీనామా లెటర్ రాస్తుంది. జగతి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే..అవసరమే మేడమ్..మర్యాదలేని చోటుకి మన నీడ కూడా వెళ్లొద్దు, నేను ఇంక రిషీ సార్ తో కలిసి పనిచేయలేను అంటుంది. రిషీ డాడీ చెప్పింది నిజమేనా,నేను ఏమైనా ఎక్కువ చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్లీ నేనేం ఎక్కువ చేయలేదు, కరెక్టుగానే రియాక్ట్ అయ్యాను, నేను చేసిందానికి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, తను నన్ను రెచ్చగొట్టంది అనుకుంటాడు. వసూ రూంలో రాజీనామా లెటర్ రాసి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మీరు నోటికొచ్చినట్లు మాట్లాడితే, నేను ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని, పొద్దున్నే మళ్లీ గుడ్ మార్నింగ్ చెప్పలేను సార్ అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం జగతి కాలేజ్ లో ఒక్కతే రిషీ, వసుధారల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర వస్తాడు. ఏమైంది, డల్ గా ఉన్నావేంటి అంటే..జగతి మధ్.లో బ్యాగ్ పెట్టి ఈ మాత్రం దూరం మెయింటేన్ చేద్దాం మహేంద్ర, ఇక్కడ కుర్చున్నప్పుడే రిషీ నా మీద అరిచాడు అంటుంది. సరే, నువ్వెందుకు డల్ గా ఉన్నావ్, ఎందుకు కలవాలి అన్నావ్ అంటాడు. రిషీ ఎలా ఉన్నాడు అంటే..కోపంగానే ఉన్నాడు అంటాడు మహేంద్ర, మరి వసూ అంటే..తన రిషీ దగ్గర అసిస్టెంట్ గా చేయను అంటుంది అని జగతి చెప్తుంది. మహేంద్ర షాక్ అవుతాడు. నేను చెప్పిచూశాను, వినలేదు, నిజానికి రిషీ అన్నన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు అంటుంది జగతి. మహేంద్ర వీళ్లిద్దరు కలిసి ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటుంటే చనువు పెరిగుతుందనుకుంటే..ఇప్పుడు రాజినామా చేస్తే నా ప్లాన్ అంతా ప్లాప్ అయ్యేలా ఉంది అనుకుని, ఒకసారి చెప్పి చూడు అంటాడు జగతి.

జగతి వసూ కన్నీళ్లు చూస్తే..నాకు బాధేసింది మాహేంద్ర, ఒక అమ్మాయి ఆత్మాభిమానం మీద దెబ్బకొడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మహేంద్ర, వీళ్ల గొడవల ప్రభావం మిషన్ ఎడ్యుకేషన్ మీద కూడా పడుతుందేమో అంటుంది. మహేంద్ర మనసులో నీకో ప్రాజెక్టు ఉంటే, నిన్ను రిషీని కలిపే ప్రాజెక్టు నాకూ ఉంది జగతి అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. రిషీకి చెప్పిచూస్తాను, నయానోభయానో ఒప్పించి వాళ్లిద్దరి మధ్య రాజీకుదురుస్తాను అంటాడు మహేంద్ర.

ఇంకోవైపు వసూ ఫుల్ ఫైర్ లో రాజీనామా లెటర్ తీసుకుని వస్తూ ఉంటుంది. మహేంద్ర ఎదురవుతాడు. గుడ్ మార్నింగ్ సార్ అని వసూ అంటే..ఈరోజు జస్ట్ మార్నింగ్ వసుధార అందులో గుడ్ లేదు, నువ్వు రిషీ దగ్గర అసిస్టెంట్ గా చేయటం మానేస్తున్నానవని జగతి చెప్పింది వసుధార అంటే..అవును అని వసూ అంటుంది. చిన్నచిన్న గొడవలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం అవసరమా అంటే..వసూ చిన్నగొడవలు కాదు సార్, నా మనసు చెప్పిందే నేను చేస్తున్నాను, ఎవరి మాట వినదలుచుకోవటం లేదు, ఆల్రడీ నేను నిర్ణయం తీసుకున్నాను అంటుంది. మరి నేను చెప్పిన గురుదక్షిణ అంటే..సారీ సార్ నేను గురుదక్షిణ చెల్లించలేను, నా ఆత్మగౌరవాన్ని చంపుకోని రిషీ సార్ దగ్గర పనిచేయలేను అని వెళ్లిపోతుంది.

ఇక్కడ రిషీ ఒక స్టూడెంట్ ని పిలిచి మాట్లాడి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కి ఒక అసిస్టెంట్ ని నియమించుకుని లెటర్ ప్రింట్ చేయించుకుని సైన్ చేస్తాడు. ఆ లెటర్ అప్పుడే ఆ స్టూడెంట్ కి ఇస్తాడు. వసూ వస్తుంది. రిషీ కావాలనే..ఆ స్టూడెంట్ వికాస్ తో ఈరోజు నుంచి నువ్వు నాకు కొత్త పీఏవి, నాకు కొత్త అసిస్టెంట్, మిషన్ ఎడ్యుకేషన్ కి ఇంకా అన్నింటికి అంటాడు. వసూ తన రాజీనామా లెటర్ ని దాచిపెట్టి సర్ మరి నేను అంటుంది. రిషీ తీసేశాను కదా అంటాడు, తీసేసినట్లు లెటర్ తయారుచేసి ఇస్తాను అని రిషీ అంటే.. అయినా నన్ను ఎందుకు తీసేసినట్లో తెలుసుకోవచ్చా అని వసూ అడుగుతుంది. పెళ్లికదా, వెళ్తావ్ కదా అంటాడు రిషీ. అయితే తీసేస్తారా అని వసూ అంటే..మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ డిస్టబ్ అవటం నాకు ఇష్టం లేదు అని రిషీ అంటాడు. నాకు చెప్పకుండా నన్ను ఎలా తీసేస్తారు అని వసూ కోపంగా అడుగుతుంది. నాకు ఆ హక్కు ఉంది అని రిషీ అంటాడు.

అడిగే హక్కు, ఆపే హక్కు నాకూ ఉన్నాయి అని వసూ అంటుంది. ఇక్కడ సీన్ చేయకు, నీ దగ్గర ఉన్న ఫైల్స్, మెటిరీయల్ వికాస్ కి ఇవ్వు అని వికాస్ కి వెల్కమ్ టూ డీబీఎస్డీ కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ అని చెప్పి క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ తింగరి వసుధార రిషీ వెనుకు సార్ సార్ అని వెళ్తుంది. రాజినామా లెటర్ ని బ్యాగ్ లో పెట్టుకుని సార్ మీరు చేసేవి అన్నీ కరెక్టుకాదు సార్ అంటుంది. నువ్వు చేసేవి కరెక్టా అంటాడు రిషీ. వసూ పిలుస్తున్నా,రిషీ వినకుండా వెళ్లి కారుఎక్కేస్తాడు, కారు వెనుక వసూ పరుగెడుతూ ఉంటుంది. రిషీ వెళ్లిపోవడంతో..అటుగా వస్తున్న ఒక అమ్మాయి సైకిల్ తీసుకుని వసూ రిషీ కోసం వెళ్తుంది. కారులో ఉన్న రిషీ..ఆ వసుధార లేకపోతే ప్రాజెక్టు ఆగిపోతుందా, రిషేంద్రబూషన్ ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. వసూ రిషీ కోసం సైకిల్ పై వస్తూనే ఉంటుంది. షాట్ కట్స్ లో వెళ్లి మొత్తానికి సైకిలిపైనే వచ్చి సరిగ్గా రిషీ కారుకు అడ్డంగా నిలబడుతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో కారుకు అడ్డంగా ఎందుకు నిలబడ్డావ్ అంటే..మీరు అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు, మీ మనసులో ఏముంది, నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నారు చెప్పండి అంటుంది వసూ. నువ్వు అడిగితే నేను చెప్పాలా అని రిషీ కారు వెనక్కు తీస్తాడు. వసూ కోపంగా మీరు సమాధానం చెప్పేదాకా నేను ఇక్కడ నుంచి కదలను అంటుంది. రిషీ ఏం చేస్తాడో రేపు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news