కార్తీకదీపం ఎపిసోడ్ 1137 : రత్నసీతను ఎంక్వైరీ చేసిన రోషిణి…మోనిత బతికేఉందని తెలుసుకుందా..!

కార్తీకదీపం ( Karthika Deepam ) ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య గాయాలకు అందరూ బాధపడుతూ ఉంటారు.. దీప అత్తయ్య ఎప్పుడు వస్తారు మావయ్య అని అడుగుతుంది. రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటా. .అందులో ఏది మంచిదో చూసి డొనేషన్ కట్టి వస్తా అన్నది అంటాడు.. ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ అయినా మేమ్ వెళ్లమ్ అని శౌర్య కోపంగా చెప్తుంది. నానమ్మతో చెప్పు తాతయ్య అంటుంది. నాన్నొస్తే నాన్నతోనే ఉంటాం అని ఏడుస్తూ చెప్తుంది. ఇంతలో హిమ.. అవును డాడీకి దూరంగా ఎందుకు పంపిస్తున్నారో మాకు అర్థంకావటం లేదంటుంది. ఏ రెసిడెన్షియల్ స్కూల్ కి మేమ్ వెళ్లమ్ అని హిమ కూడా గట్టిగా అంటుంది.
karthika deepam family
దీంతో కోపం వచ్చిన దీప.. ఇక్కడ పెద్దవాళ్లు ఉన్నారు.. వాళ్లకి ఏది మంచిదో తెలుసు… కొంచెం పెద్ద మాటల మాట్లాడటం తగ్గించండి అంటుంది. నువ్వు మమ్మల్నే అంటావేంటి అని శౌర్య అరుస్తుంది. అందరికి దూరంగా మమ్మల్ని కావాలనే పంపిస్తున్నారు.. నేను అస్సలు వెళ్లను అని కోపంగా లోపలికి వెళ్తుంది. శౌర్య వెనకే హిమ కూడా లోపలికి పోతుంది. ఇక్కడ జరిగే విషయాలేమి తెలియకూడదని అత్తయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు..కానీ వీళ్లను ఎలా సముదాయించాలో తెలియటం లేదు మామయ్యగారూ అంటూ దీప బాధపడుతుంది..
mounitha call to karthik in karthika deepam
ఇంకోపక్క కార్తీక్ ఆసుపత్రిలో మోనిత బెదిరింపులను తలుచుకుంటూ ఈ మోనిత భారినుంచి ఎలా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పోలీస్ డా.రీనా ఫోన్ చేసింది అని తెచ్చి ఇస్తాడు. కంగారు పడతాడు. ఎందుకు సర్ అంత భయం.. చచ్చిపోయిన మోనిత దెయ్యం ఐ ఫోన్ చేసిందనుకుంటున్నారా అంటాడు. కార్తీక్ నేను పడుకున్నా అని చెప్పు అంటాడు. పోలీస్ బలవంతం చేసి ఫోన్ ఇస్తాడు. మోనిత కార్తీక్ తో రేపు ఉదయం 11. 50 నిమి‌షాలకు మూహుర్తం ఉందట.. అది మిస్ అయితే మీ వాళ్లంతా పైకి పోతారంట.. మీ వాళ్లంతా సంతోషంగా ఉండాలంటో నువ్వు నా మెడలో తాళి కట్టాలి..ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్ అంటుంది.
deepa-and-karthik-in-karthi
దీప కార్తీక్ పరిస్థితిని తలుచుకుని ..ఎందుకు డాక్టర్ బాబు భయపడుతున్నారు.. కడుపునొప్పి తగ్గిపోయింది కదా, ఇంకా ఎందుకు ఆసుపత్రిలోనో ఉంచారు. ఆ డా. రీనా నంబర్ ఉంటే బాగుండేది. రేపు ఓ సారి రోషిని మేడమ్ తో మాట్లాడాలి అనుకుంటుంది.
soundharya
మరుసటి రోజు ఉదయం..సౌందర్య బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తుంది. ఆనంద్ రావు సోఫాలో పడుకుని ఉంటాడు. ఏవండీ..ఇక్కడ పడుకున్నారేంటండి అని అడుగుతుంది. గదిలో ఒంటరిగా పడుకుంటే నిద్రరాలేదు, అన్ని పెద్దోడి ఆలోచనలే అంటాడు. అందుకు ఇక్కడే పడుకున్నారా అని అడుగుతుంది. ఇంకా ఆదిత్య యాక్సిడెంట్ గురించి అడిగి.. ఈరోజే పెద్దోడిని కోర్టుకి హియరింగ్ కోసం తీసుకెళ్తారంట. బెయిల్ విషయం ఏమైంది అని అడుగుతుంది. సాక్ష్యాలన్ని బలంగా ఉండే సరికి బెయిల్ దొరకదని లాయర్ చెప్పాడని ఆనంద్ రావు అంటాడు. దాంతో సౌందర్య భాదపడుతుంది. కార్తీక్ గురించి కాసేపు మాట్లాడుకుంటారు. ఇది రెండోసారి వాడు కోర్టుకు వెళ్లటం.. విడాకుల కోసం ఓసారి వెళ్లాడు.. అప్పుడు ఎలాగో భయటపడ్డాడు అంటుంది. దీపతో మాట్లాడొస్తా అని అంటే..ఆనంద్ రావు దీప ఇంట్లో లేదు.. చీకటితోనే వెళ్లింది అంటాడు.
deepa and rohini
దీప రోషిణి దగ్గరకు వెళ్తుంది.. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచే ముందు ముద్దాయి తరుపు బంధువలతో నేను మాట్లాడును అని రోషిణి అంటుంది. ముద్దాయి అని మీరు మద్ర వేశారు అంటూ దీప సమాధానం.. నేను ఇలా అంటున్నట్లు ఏమి అనుకోకండి..అసలు మీరు ఎక్వైరీ చేసి ఏం కనిపెట్టారు, కడుపు నొప్పి తగ్గినా ఎందుకు ఇంకా డాక్టర్ బాబుని ఆసుపత్రిలో ఉంచారు అని అడుగుతుంది. దానికి కోపంతో రోషిణి ఫుడ్ పాయిజన్ అయితే కడుపులో ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ చేయాలంటుంది.. దీప మరి అలాంటప్పుడు ఏం ట్రీట్మెంట్ చేయటం లేదే. కనీసం సైలయిన్ అయినా ఎక్కించాలిగా..ఊరికే బెడ్ మీద పడుకుంటే రోగం తగ్గదుగా.. అదే ఫుడ్ మేమంతా తిన్నాం మాకు ఏం కాలేదు అంటుంది. ఇవన్నీ నా అనుమాలే మేడం అంటుంది. ఇంకా నీకు ఏం అనుమాలు ఉన్నాయో చెప్పు అని రోషిణి అడుగుతుంది. దీప.. మోనిత బతికే ఉంది , టీ ఇచ్చింది మోనితే అని డాక్టర్ బాబు కూడా నమ్ముతున్నారు.. ఏ పాపం తెలియని డాక్టర్ బాబుకి శిక్ష పడితే మాకు అన్యాయం జరిగినట్లే కదా అని అడుగుతుంది. దయచేసి ఆ దిశగా ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతుంది.
mounitha in karthika deepam
ఇక ఈ మోనిత బంగారం అంత ఎదురుగా వేసుకుని వాటిని పెట్టుకుంటూ ఓ మురిసిపోతుంది.. ఇంకాసేపట్లో ఈ మోనిత మోనితాకార్తీక్ గా మారబోతుంది..అని సంబరపడుతుంది. కడుపులో బిడ్డకు ఆనంద్ అని పేరుపెట్టి..ఇది మా మవయ్య పేరు..నేను సాధించలేనిది నువ్వు సాధించావ్ అంటుంది.
ratna seema
ఇంకోసీన్ లో రోషిణి రత్నసీతను పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది. చనిపోయారు అనుకున్న వాళ్లు బతికేఉండటం నువ్వు చూశావా అని అడుగుతుంది. రత్నసీత నిజం ఎందుకు చెప్తుంది.. వీరలెవల్ లో యాక్ట్ చేస్తుంది.. లేదు మేడమ్ అతను చూశాడంటనా అని అడుగుతుంది. హా మన స్టేషన్ లోనే అని రోషిణి చెప్తుంది. రత్నసీతకు ఫీజులు ఎగిరిపోతాయ్.. చనిపోయిన మోనిత ఇక్కడకు ఎందుకు వస్తుంది అని అడుగుతుంది. మూగమ్మాయి వేషంలో వచ్చి ఇచ్చిందంటగా అని అడుగుతుంది. ఆరోజు నేను మీతో పాటు వచ్చాను కదా అని రత్నసీత చెప్తుంది. రోషిణి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ.. అదేంటి ఆరోజు ఫుటేజ్ లేదు అని అడుగుతుంది. సర్వీస్ కి ఇచ్చాం కదా మేడమ్ అని రత్నసీత చెప్తుంది. ఓహో ఆరోజే తీశేశారనమాట అని ఆలోచిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.