కార్తీకదీపం ఎపిసోడ్ 1138: కోర్టుకు వెళ్లబోతున్న డాక్టర్ బాబు.. మోనితను దీప చూస్తుందా..!   

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో రోషిణి కార్తీక్, దీప మోనిత బతికే ఉంది అనే మాటలను గుర్తుచేసుకుని…మన స్టేషన్ లో వాళ్లేవరైనా సాయం చేయబట్టే మోనిత వచ్చి వెళ్లి ఉంటుందా అని అనుకుంటుంది.. రత్నసీతను పంపించి ఆలోచిస్తుంది. ఇంకోసీన్ లో కార్తీక్ ఆసుపత్రిలో మోనిత బెదిరింపులను గుర్తుచేసుకుని బాధపడుతుంటాడు. ఇంతలో దీప వచ్చి డాక్టర్ బాబు ఏమైంది..ఒంట్లో బాలేదా, కళ్లుతిరుగుతున్నాయా అని అడుగుతుంది. నువ్వు వచ్చావ్ కదా.. పక్కనే ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అంటాడు కార్తీక్. మీరు బయటికికనపడేఅంత టెన్షన్ పడుతున్నారు డాక్టర్ బాబు అంటుంది దీప. ఈ టెన్షన్ నీకోసం, పిల్లల కోసం, నా కుటుంబం కోసం అంటాడు. నిరపరాధికి శిక్ష పడదు డాక్టర్ బాబు అంటుంది దీప. అది నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు. కానీ నాకు శిక్ష పడుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి.. నా గురించి మీరేం టెన్షన్ పడకండి జాగ్రత్తగా ఉండండి అంటాడు కార్తీక్. దీప ధైర్యం చెపుతుంది. నాకోసం నువ్వేం సాహసాలు చెయ్యొద్దు. పిల్లలను వదిలి ఎక్కడికిపోవద్దు అని పదే పదే కార్తీక్ చెప్తాడు. ఎన్నడు లేంది మాకిన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అని దీప అడుగుతుంది. ఏం లేదు ఏం లేదు అని దీపను సముదాయిస్తాడు..
కార్తీకదీపం | Karthika Deepam
ఇంకోపక్క రత్నసీత మోనిత ఇంటికి వస్తుంది. రా రత్నసీత ఇవ్వాలే నా పెళ్లి అని మోనిత సిగ్గుపడుతూ చెపుతుంది. పాపం రత్నసీత  రోషిణి ఇచ్చిన కౌంటర్ తో మీకు దణ్ణంపడతాను లొంగిపోండి అంటుంది. మోడమ్ కు డౌట్ వచ్చింది  అని జరిగింది చెప్తుంది. లొంగిపోమ్మని బతిమిలాడుతుంది. మోనిత హా సరే లొంగిపోతా.. నువ్వు మీ ఆయనకు విడాకులు ఇవ్వు అప్పుడు లొంగిపోతా అంటుంది మోనితా.. కోపంతో ఆ దేవుడు దిగివచ్చినా లొంగిపోయే ప్రసక్తే లేదు అంటుంది. చేసేదేం లేక రత్నసీత ఏడుపుమోఖంతో వెళ్తుంటే..ఈ మోనిత రత్నసీత… పెళ్లిచేసుకోపోతున్నా విష్ చేయ్యవా అంటుంది. విష్ చేసి పోతుంది రత్నసీత.
ఆనంద్ రావు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు…సౌందర్య వచ్చి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని బాధపడుతుంది. నాకూ అలానే ఉంది అని ఆనంద్ రావు అంటాడు. కోర్టకు వెళ్తా అని సౌందర్య అంటుంది.. నేను వస్తా అని ఆనంద్ రావు అంటాడు..దానికి సౌందర్య పరిస్థితి వివరించి వద్దని నచ్చచెబుతుంది. ఏదైనా అయితే అక్కడే కాదు..ఇక్కడా జరగొచ్చు…గుండెరాయి చేసుకుంటాను సౌందర్య, వస్తాను అంటాడు ఆనంద్ రావు..సరే రండి దీప కార్తీక్ ల నమ్మకం నిజమై ఆ మోనిత బతికి కనిపిస్తే కార్తీక్ క్షేమంగా బయటికి వస్తాడండి అని సౌందర్య అంటుంది. ఈ మాట కాస్త శౌర్య వినేస్తుంది. అదేంటి మోనిత కనపడటానికి నాన్న బయటకు రావటానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తుంది..అక్కడితో ఆ సీన్ ఐపోతుంది.
కార్తీక్ బేలగా కూర్చుని ఉంటాడు. దీప వచ్చి భోజనం చేయండి అంటే కార్తీక్ వద్దంటాడు. శిక్ష పడుతుందని భయపడుతున్నారా అని దీప అడుగుతంది. నేను నా గురించి ఎప్పుడు భయపడలేదు దీప అంటాడు. మరి మాకేమైంది ఇప్పుడు అంటే ఆ మోనిత రివాల్వర్ తో బెదిరించిందిగా.. అని కార్తీక్ అంటే.. మిమ్మల్ని కూడా చంపేస్తుంది అని భయపడుతున్నారా.. నా లెక్కప్రకారం మోనిత మిమ్మల్ని చంపదు అని దీప అంటుంది. ఏం లేదు దీప ఒకప్పుడు నేను ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నానో తలుచుకుని మోనిత చేసిన ఘోరాలన్ని చెప్పుకుని బాధపడతాడు. కానీ నాకేదైన అయితే నేను జైలుకి వెళ్తే మీరు అంతా ఏమైపోతారు అని కంటతడిపెడతాడు. దీప ధైర్యాన్ని కోల్పోతున్నారు డాక్టర్ బాబు అని కన్నీళ్లు తుడుస్తుంది. పిరికితనం ఆవహిస్తే ఏం చేస్తాం అంటాడు.. ఆ మోనిత బతికే ఉందని నేను నమ్ముతున్నాను.. అది ఎక్కడ ఉన్న వెతికి పట్టుకుంటాను అని దీప అంటే.. వెంటనే కార్తీక్ వద్దొద్దు ఆ మోనిత అడివిమృగంలా మారింది. దాన్ని పట్టుకోవటానికి నువ్వు ఏం చేయొద్దు అంటాడు. దీప మీరెందుకు భయపడతున్నారు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది.  కార్తీక్ ఏదోఒకటి చెప్పి కవర్ చేస్తాడు.
ఇంకోపక్క రోషిణి పోలీస్ స్టేషన్ లో కార్తీక్ ను ఈరోజే కోర్టుకు తీసుకెళ్లాలి ఫైల్ రెడీ అయిందా అని అడుగుతూ..స్టాఫ్ పై విరుచుకుపడుతుంది. లోపలికి ఎ‌వరు వస్తున్నారు, కొత్తముఖాలా కాదా అని చూడాలి అని అరిచి వెళ్లిపోతుంది
మోనిత ఆసుపత్రికి బయలుదేరుతుంది.. వస్తున్నా కార్తీక్..ఇంకాసేపట్లో కుమారి మోనితగా వచ్చి శ్రీమతి మోనితగా మారిపోతాను అనుకుంటుంది. తాళి కట్టించుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాను అంటుంది. ఇంకోపక్క కోర్టుకు బయలుదేరిన సౌందర్య, ఆనంద్ రావు..శౌర్యకు డౌట్ వచ్చే ఉంటుంది అంటుంది. పిల్లల గురించి కాసేపు మాట్లాడుకుంటారు వాడికి బెయిల్ దొరుకుతుందో లేదో..నా బిడ్డ ఏమైపోతాడో ఏమో అని బాధపడుతుంది సౌందర్య
ఆసుపత్రిలో దీప కార్తీక్ కు భోజనం పెడుతూ ఉంటుంది. కార్తీక్ మనసులో ఎలాగోలా పోలీసులతో మాట్లాడి ఇంటికి ప్రొటేక్షన్ ఏర్పాటు చేయమంటాను అనుకుంటూ ఉంటాడు.. ఇంతలో దీప ఏడ్పు స్టాట్ చేస్తుంది. ఏమైంది దీప అని కార్తీక్ అడిగితే.. ఇవ్వాల మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తారు.. మళ్లీ మీరు మాకు కనిపించరు అని బాధపడుతుంది.  ఆ మోనిత వల్లే వచ్చింది కార్తీక్ అంటాడు.. ఇంతలో మోనిత ఆసుపత్రికి వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.