వర్షం కోసం దారుణం.. బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

-

మన దేశం మూఢ నమ్మకాలు బాగా పెరిగి పోతున్నాయి. ప్రతి విషయంలోనూ మూఢ నమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే.. తాజాగా వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు ఓ గ్రామ పెద్దలు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివాదస్పదంగా మారి పోయింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌ దామోహ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. ఆ గ్రామస్తులు వర్షాల కోసం ఆరుగురు ఆదివాసీ బాలికలను నగ్నంగా ఇంటింటికి నడిపించారు. వారితో బరువైన రోలు మోయించారు.

దీంతో పాటు భజనలు చేయిస్తూ బాలికలతో భిక్షమెత్తించారు. ఈ సంఘటన బనియా గ్రామం లో ఆదివారం జరిగింది. ఇలా సేకరించిన ఆహార పదార్థాలతో గ్రామ దేవాలయం ఎదుట అన్నదానం చేసి… పూజలు చేస్తే.. వర్షం కురుస్తుందని…ఆ గ్రామస్తుల మూఢ నమ్మకం. ఈ దారుణ సంఘటన వెలుగులోకి రావడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటటను సుమోటోగా స్వీకరించి.. విచారణ చేపట్టింది. దీంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌… దామోహ్‌ కలెక్టర్‌ కు లేఖ కూడా రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news