కార్తీకదీపం సెప్టెంబర్ 14 ఎపిసోడ్-1144: వంటలక్క మజాకా..మోనితను కోర్టుకు తీసుకొచ్చి కార్తీక్ ను శిక్షనుంచి తప్పించిన దీప

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కోర్టులో రోషిణీని కార్తీక్ తరుపు లాయర్ ప్రశ్నిస్తాడు. మోనిత బతికే ఉందని కార్తీక్ చెబుతున్నాడు. ఈ విషయం పై మీరు ఎంక్వైరీ చేశారా అని అడుగుతాడు. చేశాను, అది కట్టుకథ అని తేలింది, టీ కొట్టుకెళ్లి ఎంక్వైరీ చేశాను అక్కడ మూగమ్మాయి ఉంది అని రోషిణీ చెబుతుంది. జడ్డి ముద్దాయి..డా.కార్తీక్ డా. మోనితను హత్యచేశాడనే అభియోగం మీద విచారణ ముగిసింది. గర్భవతిగా ఉన్న స్త్రీని నిర్థాక్షణంగా చంపినట్లు నిరూపించబడింది కాబట్టి అంటూ తీర్పు చెప్పబోతాడు..ఇంతలో వంటలక్క ఎంట్రీ ఇస్తూంది. హమ్మయ్య ఈరోజైన వచ్చింది. దీప తనను తాను పరిచయం చేసుకుని, తీర్పు వినిపించే ముందు ఒక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సింది కోరుతున్నాను అని మోనితా రామ్మ అంటుంది. మోనిత ఎంట్రీ ఇస్తుంది. కోర్టులో ఉన్న వాళ్లందరికి ఫీజులు ఎగిరిపోతాయ్. షాకై అలానే చూస్తారు.

కానిస్టేబుల్ పట్టుకోవటానికి వస్తుంది. వేయిట్ నేను పారిపోను అని బోనులోకి వెళ్లి నిలబడుతుంది. సౌందర్య ఆనందం పట్టలేక దీపను పొగిడి ముద్దుపెడుతుంది. అందరూ పొగుడుతారు. బోనులో ఉన్న మోనిత మాట్లాడటం మొదలుపెడుతుంది. నా పేరే మోనిత.. నా ఎదురుగా ఉన్న కార్తీక్ చంపింది నన్నే అని మీరంతా భావించి ఉంటారు. అతను నిరపరాధి, నేను ప్రాణాలతోనే ఉన్నా అంటుంది. జడ్డీ కోపంగా ఇదంతా ఏంటి, నువ్వు బతికే ఉంటే నిన్ను చంపిన నేరం పై కార్తీక్ జైలు పాలైతే నువ్వెందుకు చెప్పలేదు. ఇంతసమయం ఎందుకు వృథా చేశావ్ అంటాడు.

క్షమించాలి, మీ అందరి సమయం వృథా చేసినందుకు. నేనిప్పటి వరకూ అజ్ఞాతంలో ఉన్నాను. అందుకు కారణం కార్తీక్ మీద నాకు ద్వేషం కాదు, ప్రేమ. ఆ ప్రేమ వల్లే అతని బిడ్డకు తల్లిని కావాలనుకున్నాను. అతనికి రెండో భార్యగా ఉండాలనుకున్నాను. కానీ, నా ప్రేమే నాకు శాపమైంది. నన్ను మంచి చెడు, తప్పు, ఒప్పు ఆలోచించే స్థాయిని మించిపోయేలా చేసింది. అందుకే నేను చనిపోయినట్లు నాటకం ఆడి కార్తీక్ ని జైలుకి పంపించాల్సి వచ్చింది. ఆ తరువాత నన్ను పెళ్లిచేసోకావాలని ప్రతిపాదన తీసుకురావాల్సి వచ్చింది. నేను లొంగిపోతాన్న నాకు లొంగిపోలేదు కార్తీక్. నా ప్రేమకు అర్థంలేదనిపించింది. అజ్ఞాతం వీడి బయటకురావాల్సి వచ్చింది. మీ అందరి సమయం వృథా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంటు తన వాదన ముగిస్తుంది.

మోనిత మాటలన్ని విన్న జడ్డీ..ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సి వచ్చినప్పుడు, అందులోనూ ఏ మాత్రం నేర చరిత్ర లేని వాళ్లను అరెస్ట్ చేసేముందు పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నతమైన స్థానంలో ఉన్న కార్తీక్ ను అరెస్ట్ చేసేముందు పోలీసు వారు పూర్తివిచారణ చేయలేదని అర్థమవుతుంది. పోలీసుశాఖ వారిని మందలిస్తూ ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది అంటాడు. రోషిణి లేచి సారీ చెప్తుంది.

మోనిత బతికే ఉన్నందువల్ల నిందితుడైన కార్తీక్ ను నిరపరాధిగా భావించి విడుదల చేయటం జరిగింది. ఆ మాటకు సౌందర్య వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. చంపకపోయినా చంపేశాడనే నేరం మోపి అజ్ఞాతంలో మోనిత , కార్తీక్ పరువు ప్రతిష్ఠలను దెబ్బతీయటం నేరంగానే భావిస్తూ..ఆమెను అదుపులోకి తీసుకోవాలిని పోలీసువారికి ఆదేసిస్తున్నాం అంటూ తీర్పు ఇస్తాడు. అక్కడితో తీర్పు అయిపోతుంది. కార్తీక్ దీపను కౌగిలించుకుంటాడు. సౌందర్య కోడుకు, కోడలకి ముద్దులు పెడుతుంది. ఇంతలో మోనిత ..అప్పుడే సినిమా సుఖాంతం అయిపోయి శుభంకార్డు పడిందని సంతోష పడకండి. మురిసి ముక్కలైపోకండి. కార్తీక్ నా కార్తీక్.. ఇంకా నా మీద నేరం నిర్థారణ కాలేదు. శిక్ష పెద్దగా పడుతుందని నేను అనుకోవటం లేదు. ఈలోపు నా క‍డుపులో పెరిగే నీ బిడ్డ ఈ భూమ్మీద పడతాడు. అప్పుడొస్తా.. మళ్లీ వస్తా. బీ రెడీ అని చెప్తుంది.

రోషిణికి కోపం కట్టలుతెచ్చుకుంటుంది. మేకవన్నె పులి అనే దానికి నువ్వు సరిగ్గా సరిపోతావ్ అని మోనిత పై కోప్పడుతుంది. ఏం సాధిద్దావ్ అని ఇదంతా చేశావ్ అని రోషిణి అడుగుతుంది. మోనిత మళ్లీ సేమ్ స్టోరీ బ్రేక్ లేకుండా చెప్తుంది. నువ్వు చేసిన నేరాలకు ఘోరాలకు నీకు జీవితకాలం శిక్ష పడుతుంది అని రోషిణి అంటుంది. నేనైం భయపడను. కార్తీక్ మీద నా ప్రేమ నిజమైతే..నేను త్వరలోనే భయటకొస్తాను, కార్తీక్ ను పెళ్లి చేసుకుంటాను చెబుతుంది. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్ మోనిత, నువ్వు మాట్లాడే ప్రతిమాటలో కార్తీక్ పడ్డ బాధ, అతని ఫ్యామిలి కనిపిస్తుంది అంటుంది. కానీ నాకు కార్తీకే కనిపిస్తున్నాడు అంటూ చెబుతుంది మోనిత. ఇంతలో రత్నసీత వస్తుంది. మనం రేప్ మాట్లాడుకుందాం అని మోనితను పంపిస్తుంది.

ఇటుపక్క దీప కార్తీక్ వాళ్ల పిల్లలతో సంతోషంగా ఉంటారు. శౌర్య నాకోడౌట్ అంటుంది. దాంతో దీప దేవుడా అంటుంది. మోనిత ఆన్టీ నువ్వు కలిసి ఒక ఆపరేషన్ చేశారు, పేషంట్ చచ్చిపోయింది. మోనిత ఆన్టీ పారిపోయారు. నిన్ను పట్టుకెళ్లారు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన పోలీసులు మోనిత ఆన్టీని ఎందుకు వదిలేయలేదు అని హిమ, శౌర్య అడుగుతారు. దీప..ఆ పోలీసులు, స్టేషన్, లాకప్ అవన్నీ ఒక పీడకల, మీ నాన్న వాటిని మర్చిపోవాలనుకుంటున్నారు. మీరు మళ్లీ గుర్తుచేయకండి అంటుంది. హిమ సరే అంటుంది. కానీ ఈ రౌడీ మాత్రం ఆన్సర్ చెప్పడం ఇష్టం లేనప్పుడు అమ్మ ఇలాగే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది అంటుంది.

ఇంతలో కార్తీక్ లేటయ్యింది..మీరెళ్లి పడుకోండి అని పిల్లలను పంపిస్తాడు. ఈ శౌర్య ..ఆ రోజు మా ఇద్దరిని దగ్గరకు తీసుకుని మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం అన్నావ్ కదా..ఎప్పుడు వెళ్లిపోదాం అని అడుగుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.