కార్తీకదీపం ఎపిసోడ్ 1222: మోనిత కొడుకు కిడ్నాప్..ఇక్కడ రుద్రాణి చెంప పగలకొట్టిన దీప

-

కార్తీదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పిల్లలను పక్కన కుర్చోపెట్టుకుని ఇక్కడ ఎవరికి నేను డాక్టర్ ని అని చెప్పకూడదు అంటాడు. పిల్లలు అదేంటి నాన్న నువ్వు పెద్ద డాక్టర్ వి కదా, డాక్టర్స్ అందరికి ప్రసిడెంట్ వి కూడా అయ్యావుకదా..కాని ఎలా చెప్తాం అంటే..కార్తీక్ అవన్నీ మర్చిపోండమ్మా, మీ నాన్న డాక్టర్ కార్తీక్ కాదు, ఒట్టి కార్తీక్ వి అంటాడు. పిల్లలు ఏడ్చేస్తారు.ఎందుకు డాడీ అంటాడు. కార్తీక్ నేను చెప్పేది వినండ్రా ప్లీజ్, నేను డాక్టర్ కాదు అని చెప్పడంలో ఎవరికి ఏ నష్టం లేదుకదా, ఈ అబద్ధం ఎ‌వరికి హాని చేయదురా, నా మాట వింటారుకదా అంటాడు. శౌర్య ఏడుస్తూ..మరి మీ నాన్న ఏం చేస్తాడంటే ఏం చెప్పాలి నాన్న అంటుంది. ఎరువలుకొట్లో అకౌంట్స్ రాస్తాడు అని చెప్పడమ్మా అంటాడు కార్తీక్. ఏది ఓ సారి చెప్పండమ్మా అని వాళ్లచేత చెప్పిస్తాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

మరోవైపు దీప పనికోసం ఎక్కడికో వెళ్తుంది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం చేయాలి అంటుంది అక్కడ ఓ ఆవిడ. అదేం పెద్ద పనేంకాదు మేడమ్..ఎలాంటి వంట అయినా ఈజీగా చేయగలను, నన్ను అందరూ వంటలక్కా అని..ఒకప్పుడు సౌందర్యవాళ్లు నీకేం తక్కవే..పెద్దింటి కోడలివి అని సీన్ గుర్తుచేసుకుని కంటతడిపెడుతుంది. ఇంతకు ముందు ఈ పనులు శ్రీవల్లి చూసుకునేది..డెలివరీకి హైదరాబాద్ వెళ్లింది అంటుంది. అలా ఆ సీన్ అయిపోతుంది.

ఇక్కడ రుద్రాణి మనుషులు కార్తీక్ కొట్టి శ్రీవల్లి సామాన్లు ఇంట్లో పెట్టింది చెప్తారు. రుద్రాణి వాళ్లతో ఏదో సోది మట్లాడి వెళ్లిపోబోతుంది. వాడు మమ్మల్ని కొట్టి సామాన్లు ఇంట్లో పెట్టాడు అక్కా అన్నా రుద్రాణి వినకుండా లోపలికి వెళ్తుంది. మరోవైపు మోనిత కారులో మోనిత పిల్లాడికి బొమ్మలు కొనడానికి వస్తుంది. ప్రియమణి రాదు. పిల్లాడ్ని లేపుదాం అంటే.. వాడు పడుకున్నాడని ఏసీ వేసి వెళ్తాను బొజ్జో అంటుంది. మళ్లీ ఏసీ అయితే ప్రాబ్లమ్ అవుతుందేమే అనుకని గ్లాస్ దించుతుంది. కారులో బిడ్డను వదిలేస్తే ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకుని పక్కన ఒక అబ్బయికి చెప్పి వెళ్తాడు. ఆ నిద్రమొఖంవోడు..ఫోన్ మాట్లాడుతునే ఉంటాడు. పిల్లాడ్ని ఎవరో తీసుకెళ్తారు. మోనిత వచ్చి బాబు లేడని చూసి..ఆ అబ్బాయిని అడుగుతుంది. ఒ ముఫ్పై సంవత్సరాలు ఉంటాయి అక్కా, అని చెప్తుంది. మోనిత ఆదిత్య అనుకుంటుంది. కారులో వెళ్దాం అంటే కారు స్టాట్ అవదు. అటుగా స్కూటీపై వచ్చే ఓ అమ్మాయిని ఆపుతుంది. ఆ అమ్మాయి మోనితకు తెలుసుఅంట.మోనిత స్కూటీ వేసుకుని వెళ్తుంది.

మరోసీన్ లో కార్తీక్ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతాడు. ఇంతలో పిల్లలు వచ్చి అమ్మ ఎక్కడకు వెళ్లింది అంటారు. దీప కూరగాయలు తీసుకుని వస్తుంది. ఎక్కడికి వెళ్లావంటే..దీప జరిగింది చెప్తుంది. కార్తీక్ మళ్లీ వంటలక్క పని మొదలుపెడతావా అంటాడు. నాకు తెలిసింది అదే పనికదా కార్తీక్ బాబు అంటుంది. అంటే రేపట్నించి మన ముగ్గురం స్కూల్ కి వెళ్తే..నాన్న ఒక్కడే ఇంట్లో ఉంటాడా అంటుంది హిమ.

ఇక్కడ సౌందర్య ఆనంద్ రావులు కార్తీక్ గురించి బాధపడుతూ ఉంటారు. మోనిత ఏకంగా స్కూటీ వేసుకుని ఇంట్లోకి వచ్చి కార్తీక్ ఎక్కడున్నావ్ కార్తీక్, మన బాబును ఎవరో ఎత్తుకెళ్లారు అని హాల్ లో స్కూటీవేసుకుని రౌండ్లు వేస్తుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో కార్తీక్ వాళ్లు భోజనం చేస్తుంటారు. రుద్రాణి వచ్చి టైం బాలేక వచ్చాను అన్నావు, ఈ సామాన్లు అన్నీ ఏంటి అంటే..బయట ఉంటే తీసుకొచ్చి పెట్టాను అండి అంటాడు కార్తీక్. రుద్రాణి..కాలుతో ఆ తినే అన్నం నెట్టేస్తుంది. కార్తీక్ ఏం మనుషులు మీరు అంటే..రుద్రాణి కొట్టడానికి చేయి పైకి లేపుతుంది. ఇంతలో దీప వెళ్లి రుద్రాణి చెంప పగలకొడుతుంది. వాళ్ల ఊరు వచ్చి వీళ్ల హడావిడి ఏంటో. ఇక ఆ ఇంట్లో కూడా లేకుండా..చేస్తుందేమో రుద్రాణి.

Read more RELATED
Recommended to you

Latest news