దేశంలో కొత్తగా 8 ఓమిక్రాన్ కేసులు… మొత్తం 49కి చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో రోజురోజుకు ఓమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇవ్వాళ ఒక్క రోజే కొత్తగా ఎనిమిది కేసులు నమోదవ్వడం కలకలం కలిగిస్తుంది. ఈరోజు ఢిల్లీలో 4, రాజస్థాన్ లో మరో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఇన్నాళ్లు దేశంలో స్తబ్దుగా ఉన్న ఓమిక్రాన్ వేరియంట్ కేసులు గత మూడు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓమిక్రాన్ విస్తరణ వేగం అధికంగా ఉంది.

దేశంలో ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 20 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో రాజస్థాన్ 13 కేసులు, ఢిల్లీలో 6 కేసులు, గుజరాత్ లో 3, కర్ణాటకలో 3, ఏపీ, కేరళ, ఛండీగడ్ లలో ఒక్కో కేసు నమోదైంది. వీరంతా ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారే. అయితే వీరిలో ఎక్కవ మంది దక్షిణాఫ్రికా, టాంజానియా, ఐర్లాండ్, జింబాబ్వే దేశాల నుంచి వచ్చినవారే  ఉన్నారు.