కార్తీకదీపం ఎపిసోడ్ 1228: సామీ సామీ సాంగ్ తో డ్యూయెట్ వేసుకున్న దీప..కార్తీక్ ను ఇకపై సామీ అనే పిలుస్తుందట..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పిల్లల కనిపించటం లేదని దీపకు చెప్తాడు. దీప కార్తీక్ వెతుకుతారు.. వాళ్లు ఓ చెట్టుకింద కుర్చోని ఉంటారు. ఇక్కడేం చేస్తున్నారు అనిదీప అడుగుతుంది. వాళ్లు ఎన్ని ప్రశ్నలు వేసినా వీళ్లు నోరు విప్పరు. మాట్లాడండి అని దీప అరిచేసరికి..శౌర్య మనం నానమ్మవాళ్ల దగ్గరకు వెళ్లిపోదాం అంటారు. ఈ మాట అనొద్దని మీకు చెప్పాంకదాం అని దీప అంటే..చెప్తే సరిపోతుందా..ఇందాక ఒక అమ్మాయి స్కూల్ కి వెళ్తూ వచ్చి ఏమందో తెలుసా.. మనకు ఎవ్వరూ లేరట, ఒక సంచితో వచ్చాం అంట అని పిల్లలు చెప్తారు. దీపవాళ్లు పిల్లలకు నచ్చచెబుతారు. పోనీ మమ్మల్నీ స్కూల్ లో అయినా జాయిన్ చేయించవచ్చుకదా అంటారు.

మరోపక్క రుద్రాణి పిల్లలను తెచ్చుకోవటం గురించి తన మనిషితో మాట్లాడుతుంది. శ్రీవల్లి బిడ్డను తెచ్చి మంచిపనే చేసిందిరా అంటుంది రుద్రాణి. నిన్ను తెచ్చుకోమంటే..శ్రీవల్లి బిడ్డగురించి చెప్తావేంటి అక్క అంటాడు. నాకోక ఐడియా ఉందిలేరా అంటుంది. మరోసీన్ లో కార్తీక్, దీప రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు. మీరు వెళ్లండి అండీ..నేను ఏదోఒక పనిచూసుకుని వస్తాను అండీ అంటుంది దీప. నువ్వు అండి అండీ అని పిలవకు దీప..దూరం వాళ్లు పిలిచినట్లు ఉంది అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు అని పిలవడం నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అలా వద్దంటున్నారు, అండి, ఏవండి అంటే నచ్చటం లేదు..ఇంకెలా స్వామి మీతో ఏమని పిలవాలి అంటుంది. కరెక్ట్ గా అప్పుడే రోడ్డుమీద ఒకడు ఫోనులో పుష్ప సినిమాలో సామిసామి సాంగ్ పెట్టుకుని వెళ్తాడు. ఆ పాటకు దీప ఇమాజిన్ చేసుకుంటుంది. నేను స్వామి అనే పిలుస్తాను, నాకు ఈ పిలుపు నచ్చింది, కంగారుపడకండి..అందరిముందు పిలవనులే మీరు వెళ్లండి అని పంపిస్తుంది. నేను బంగారం తాకట్టుపెట్టడం మీకు తెలిస్తే తట్టుకోలేరు అండి అందుకే పంపిస్తున్నాను అనుకుంటుంది దీప.

ఇంకోసీన్ లో సౌందర్య ఎస్పీతో కార్తీక్ వాళ్ల ఆచూకి కోసం ఎంక్వైరీ చేయమని మాట్లాడుతుంది. ఆనంద్ రావు ఫోన్ తీసుకుని..ఎంక్వైరీ ఏం చేయకు..ఆధారాలు దొరికితే చెప్పు అంతే..పబ్లిసిటీ వద్దు అంటాడు. ఏంటండీ మీరు అని సౌందర్య అంటుంది. వాడు ఎక్కడు ఉన్నాడు అక్కడైనా ప్రశాంతంగా ఉండనిద్దాం…వాడ్ని బలవంతంగా వెతికి తీసుకొచ్చి ఏం సాధిస్తాం చెప్పు..మళ్లీ మోనిత వస్తుంది, మీడియా అంటుంది, ఒక్కపూటైనా ప్రశాంతంగా ఉంటాడా చెప్పు..వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నాడోలేదో తెలియదు కానీ..ఈ మోనితకు దూరంగా ఉన్నాడు చాలు అంటాడు ఆనంద్ రావు. కార్తీక్ పిల్లలు అమెరికా వెళ్లారు అనుకో అంటాడు. మీకింత ధైర్యం ఎక్కడనుంచి వచ్చింది అంటే..నా పెద్దకోడలు ఇచ్చింది. దీప వాడ్ని ప్రేమగా చూసుకుంటుంది అంటాడు.

ఇక్కడ దీప బంగారం అంతా తాకట్టుపెడుతుంది. ఈ ఊరికి కొత్తా అమ్మా అంటాడు ఆ సేట్. సేట్ ఫోనులో దీప ఫొటో చూసి..రుద్రాణి అక్క ఈవిడ ఫొటో పెట్టిమరీ..డబ్బులు ఇవ్వొద్దంది..అనకుని మీకు డబ్బులు ఇవ్వలేను అంటాడు. ఎందుకు అంటే ఆ సేట్ చెప్పడు. రుద్రాణిగారు వద్దన్నారా అంటే..అవునమ్మా అంటాడు సేట్. మీరు ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను అంటుంది.

రుద్రాణి డబ్బులు లెక్కేస్తూ ఉంటుంది. దీప ఫోన్ చేస్తుంది. మీకేం కావాలి నేను బాధపడటమేకదా..ఒంటిమీద బంగారం, మెడలో తాడు కూడా తాకట్టుపెడుతున్నాను..ఇదిమీకు సంతోషమే కదా ఈ విషయం మీకు చెప్తే సంతోషపడతారని చేశాను అంటుంది దీప. రుద్రాణి సేట్ కు డబ్బులు ఇచ్చి పంపించు అంటుంది. రుద్రాణి బ్యాంక్ కు బయలుదేరుతుంది. దీప కూరగాయలు తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news