కార్తీకదీపం ఎపిసోడ్ 1242: అరే.. వంటలక్కకు ఆఖరికి ఈ గతి పట్టిందా..అయినా లాభం లేదే..దీప వ్యాపారం మీద దెబ్బకొట్టిన రుద్రాణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప పిల్లలకు అన్నం పెడుతుంటే..పిల్లలు రుద్రాణి టాపిక్ తీస్తారు. దీప ఎప్పటిలాగే..ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. కార్తీక్ గతాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. అందర్నీ బాధపెట్టి ఏం సాధించాను, వీటికి తోడు రుద్రాణి తలనొప్పి ఒకటి అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు, మీ బలం ఏంటో మీ గొప్పతనం ఏంటో మీకు తెలియడం లేదు.. ఎందుకండి ఇలా బాధపడుతున్నారు.. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది..రుద్రాణి అప్పుగురించి టెన్షన్ పడుతున్నారా అని అడుగుతుంది దీప. అప్పు మాత్రమే కాదు మన బిడ్డల్లో ఒకర్ని తీసుకెళతా అందని నీకెలా చెప్పాలి అనుకుంటాడు కార్తీక్. అదేం కాదులో దీప అంటాడు.

మీరు అప్పుతీరుస్తా అని సంతకం చేశాక.. రుద్రాణి పదే పదే ఇంటికొస్తోంది, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఎందుకు.., అప్పుడు ఓసారి వచ్చినప్పుడు మీతో ఏదో చిన్నగా మాట్లాడింది..ఏంటి అని అడిగితే మీరు చెప్పలేదు.. అంత ఆస్తిని అలా ఇచ్చేసిన మీరు.. రుద్రాణి అప్పుకోసం ఇంత టెన్షన్ పడతారనుకోను..నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా అని అడుగుతుంది దీప. దీప తనమీద ఒట్టువేయించుకుని నిజం చెప్పండి, చెప్పకపోతే..నేను చచ్చినంత ఒట్టే అంటుంది. మనోడు తప్పని పరిస్థితుల్లో నిజం చెబుతాడు. దీపకు దిమ్మతిరిగిపోతుంది. గడువులోగా ఒప్పుకున్న బాకీ సొమ్ము చెల్లించకపోతే పిల్లల్లో ఒకర్ని తీసుకెళ్లిపోతానందని చెబుతాడు. అలా ఎలా ఒప్పుకున్నారు మీరు, మాటకోసం బిడ్డని ఇచ్చేస్తారా, నా బతుకింతేనా…ఎప్పుడూ బిడ్డల్ని దూరం చేసుకునే బతకాలా అని కన్నీల్లు పెట్టుకుంటుంది. ఆవేశంలో సంతకం పెట్టాను..అందులో తను అలా రాసుకుందని తర్వాత తెలిసింది అంటాడు. ఏంటి డాక్టర్ బాబు..మీరు సంతకం పెడితే..తను తీసుకెళిపోతుందా..అంతా మీ ఇష్టమేనా..ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు..తప్పులు మీద తప్పులు జరుగుతున్నాయి..దేవుడా ఏంటిదని మొరపెట్టుకుంటుంది. గతంలో హిమ విషయంలో తల్లిని అని చెప్పుకోలేనే పరిస్థితిని తలుచుకుంటుంది. ఎన్నో బాధలు పడ్డాను, అన్నీ సర్దుకున్నాయి అనేసరికి దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డాం, ఆస్తి పోయినా మిమ్మల్ని ఒక్కమాట కూడా మిమ్మల్ని అడగలేదు. అందంర కలసి ఉంటే చాలనుకున్నాను. ఇక్కడేదో కష్టం చేసుకుని బతుకుతుంటే ఆ రుద్రాణికి నా బిడ్డలపై కన్ను పడిందా..ఏంటి డాక్టర్ బాబు..నన్ను ఏం చేద్దాం అనుకుంటారు, నన్ను ఏ స్థితికి తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తుంది. కార్తీక్ లోపలికి వెళ్లిపోతాడు.

రుద్రాణి ఇంట్లో..

నువ్వేదో డబ్బులు అడిగావు కదరా గుర్తుచేయాలి కదా అని తన వద్ద ఉన్న రౌడీని అడుగుతుంది రుద్రాణి. వాడు అవును అక్కా అని చెప్పడంతో..డబ్బులు ఇవ్వమంటుంది. డబ్బులు తీసుకోవడమే కాదు చెప్పిన పని చేయడం కూడా నేర్చుకోండి అంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ ని చూసి..ఏంటి ఈ టైంలో దారితప్పి వచ్చారని అడుగుతుంది. అవునా పెత్తనం చేయటం తప్పా సారు అంటుంది రుద్రాణి. మీరు పెత్తనం చేస్తారో, అధికారం చేస్తారో మీ ఇష్టం..కానీ నా పిల్లల జోలికి, నా కుటుంబం జోలికి రావొద్దని హెచ్చరిస్తాడు. మీ బాకీ తీర్చడంతో మీకు-మాకు ఎలాంటి లావాదేవీలు ఉండవని తేల్చి చెబుతాడు. మీరు అనవసరంగా మా కుటుంబంలో జోక్యం చేసుకుంటున్నారు. మీరెవరు అసలు మా పిల్లలకు క్యారేజ్ పంపడానికి. రూపాయి రూపాయి పోగేస్తే లక్షల్లో అప్పు ఎలా తీరుస్తారు..అందుకే అగ్రిమెంట్ లో రాసుకున్నదాని ప్రకారం నీ కూతుర్లలో ఒకర్ని తెచ్చుకోవడం ఖాయం, పెంచుకోవడం ఖాయం..కార్తీక్ అరుస్తాడు. కోపం వస్తుందా..జరగబోయేది చెప్తున్నాను..నేను అప్పుడొచ్చి రామ్మా అంటే పిల్లలు రారుకదా అందుకే ఇప్పటి నుంచే మచ్చిక చేసుకుంటున్నా అంటుంది. నా పిల్లల గురించి ఆలోచించటం మానేయండి.. మీ మంచి కోరి చెబుతున్నా..ఏం చేసి నీ బాకీ తీరుస్తాను అనేది మీకు అనవసరం అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అరిచినంత మాత్రాన అప్పులు తీరవు కదా…జరిగేదేదో నా కళ్లకు కట్టినట్టే కనిపిస్తోంది అంటుంది రుద్రాణి.

దీప ఇంట్లో..

రుద్రాణి ఇంటి నుంచి వచ్చిన కార్తీక్ ని ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది దీప. మళ్లీ ఆ రుద్రాణి దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడారు..అరే.. అప్పు తీర్చకపోతే అమ్మాయిని తీసుకెళ్తా అంటుందా తల్చుకుంటేనే కడుపు మండిపోతోంది, కానీ మనం ఆవేశపడే స్థితిలో లేం, ఆలోచించండి, మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల మీద కన్నేసింది..ఇలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.., అవసరానికి మించి ఆవేశకపడకండి, ఎలాగైనా అప్పు తీర్చేద్దాం అంటుంది దీప. గడువులోగా అప్పు తీర్చకపోతే బిడ్డను ఇస్తాం అని సంతకం చేసిన గొప్ప తండ్రిని కదా దీప నేను అంటే..మీరు ఆ పనితెలిసి చేయగలగారా అని దీప అంటే..ఈ విషయం నా పిల్లలకు తెలిస్తే ఏమని సమాధానం చెప్పను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు తెలిసి ఏ తప్పూ చేయలేదు అండి..ఎందుకింత బాధపడతారు..ఆ అప్పు తీరుద్దాం అని ధైర్యం చెబుతుంది దీప.

నేను ఎన్ని తప్పులు చేసినా ఎందుకు గట్టిగా అరవ్వు, నాపై ఎందుకు కోపం తెచ్చుకోవు..నీ మంచితనం ఓపిక రోజురోజుకీ నన్ను కుంచించుకుపోయేలా చేస్తున్నాయి… నన్ను తిట్టు, అరువు, నా కాలర్ పట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని నిలదీయ్..కోపం రావట్లేదా..అప్పుడేమో నా అనుమానంతో దూరం చేసుకున్నాను..కానీ నువ్వు భరించావు… ఇప్పుడు ఉన్నదంతా వేరేవాళ్లకి ఇచ్చేసి నిన్ను రోడ్డుమీద నిలబెట్టాను, అయినా అదే చిరునవ్వుతో మాట్లాడుతున్నావు.. ఈ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోంది దీప..నీ కోపం పోయేదాకా రోజంతా నన్ను తిట్టు.. నేను చేసిన తప్పులు ఎత్తిచూపించి తిట్టు అంటాడు. డాక్టర్ బాబు మీరు తెలిసి ఏ తప్పూ చేయరని నా నమ్మకం.. ఇప్పుడు కూడా మీరు ఏ తప్పు చేయరని సంతకం పెట్టలేదు.. పిల్లలకు ఈ విషయం తెలియదు కదా.. ఆ రుద్రాణి సంగతి.. అప్పు సంగతి మనం చూసుకుందాం..ఆవేశ పడొద్దు..కోపంలో కొత్త తప్పులు చేస్తాం..ఓ చీటీ వేసి అప్పు తీర్చేద్దాం అంటుంది దీప. కార్తీక్ నన్ను..అంటే..డాక్టర్ బాబు అనొద్దు అంటారా.. మీరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ నా డాక్టర్ బాబే అని…కార్తీక్ ను హత్తుకుంటుంది. అలా ఈరోజు ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

తయారు చేసిన పిండి వంటలు అమ్మేందుకు బిడ్డను వెనక వేసుకుని.. దుకాణాల చుట్టూ తిరుగుతుంది దీప. అయితే అప్పటికే రుద్రాణి అన్ని దుకాణాలకు పిండి వంటలు సప్లై చేయడంతో ఎవ్వరూ తీసుకోరు. అంటే దీప వ్యాపారానికి గండికొట్టే ప్రయత్నంలో పడిందన్నమాట. కార్తీక్ రోడ్డుమీద పిచ్చోడిలా అరుస్తాడు. అందరూ చూస్తారు. అదే సమయానకి దీప వచ్చి కార్తీక్ ను పక్కకు తీసుకొస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news