ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్.. రేపే విచారణ

-

ప్రధాని భద్రతా వైఫల్యంపై పంజాబ్ గవర్నమెంట్ పై అందరూ విమర్శలు చేస్తున్నారు. నిన్న పంజాబ్ ఫిరోజ్ పూర్ లో డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ప్రధాని మోదీని దాదాపు 20 నిమిషాల పాటు అడ్డుకోవడం, భద్రత వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

supreme-court

ఇదిలా ఉంటే ప్రధాని భద్రత వైఫల్యంపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ విచారణకు డిమాండ్ చేస్తూ.. సీజేఐ ఎన్వీ రమణ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సుప్రీంకోర్ట్ ఈ విషయంపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలకు నోటీసులు కూడా పంపింది. ప్రధాని భద్రతా వైఫల్యంపై రేపే విచారణ చేపడుతామని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే పంజాబ్ ప్రభుత్వం కూడా హైలెవల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జరిగిన పొరపాట్లపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ జస్టిస్ (రిటైర్డ్.) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మ ఉన్నారు. 3 రోజుల్లో తన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news