కార్తీకదీపం సెప్టెంబర్ 24 ఎపిసోడ్ 1153: రిపోర్టర్ ను సీక్రెట్ గా జైలుకు పిలిపించుకుంటున్న మోనిత…ఏం చేయబోతుందో

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య, హిమ స్కూల్లో సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఇంతలో షైని అనే స్నేహితురాలు వస్తుంది. అలా మాట్లాడుకుంటూ..మీ డాడ్ కార్తీక్ ను జైల్లో పెట్టారంటగా అని షైని చెప్తుంది. శౌర్య పిచ్చిపిచ్చిగా అనొద్దు, అలాంటివోం లేవు అని కోప్పడుుతంది. షైని మాత్రం మీ నాన్న బ్యాడ్ బాయ్ అంటుంది. శౌర్య, హిమ మా డాడ్ గుడ్ బాయ్ అని షైని సారి చెప్పమంటారు. షైని మీ డాడ్ కి మోనితకు మధ్య ఏదో ఉందంటగా అని అంటుంది. శౌర్య ఏదో ఆపరేషన్ ఫైయిల్ అయింది అందుకే జైల్లో వేశారు అని అంటుంది. కానీ ఆ షైని కాదు, మీ డాడ్ బ్యాడ్ బాయ్ అని పదే పదే చెప్తుంది. మీ ఇంట్లో వాళ్లు మీకు అబద్ధం చెప్పినట్లు ఉన్నారు..జరిగింది ఇది అంటుంది. హిమ ఆ మాటలకు ఏడుస్తుంది. శౌర్య కోపంగా షైని ఇక్కడినుంచి వెళ్లిపో అని అరుస్తుంది.

karthika-deepam

ఇంకోవైపు జైల్లో మోనిత కానిస్టేబుల్ కి కడుపునొప్పి అంటే టాబ్ లెట్ ఇస్తుంది. ఆమెకు వెంటనే తగ్గటంతో అక్కడున్న అందరూ మోనితను పొగుడుతారు. అలా కాసేపు మాట్లాకుంటారు. మరోపక్క కార్తీక్ చాలా రోజుల తర్వాత ఆసుపత్రికి వస్తాడు. అక్కడున్న అందరూ కార్తీక్ కు స్వాగతం పలుకుతారు. మళ్లీ ఆసుపత్రిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందంటారు. వెంటనే డాక్టర్లు మీరు దీప గారి జంట బాగుంది కానీ మధ్యలో మోనిత ఏంటి సార్ అంటూ మొదలుపెడతారు. దాంతో కార్తీక్ కోపంతో..ఇది ఆసుపత్రి పర్సనల్ తీయొద్దు అంటూ తన బదులుగా వచ్చే విసిటింగ్ డాక్టర్స్ ని ఇక రావొద్దని భారతికి చెప్పి..తనని ఒకసారి క్యాబిన్ కి రమ్మని వెళ్తాడు.

స్కూల్లో హిమ షైని అన్న మాటలకు ఏడుస్తుంది. శౌర్య ధైర్యం చెప్తుంది. షైని ఎందుకు అలా మాట్లాడిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు. బయటఏడిస్తే బాగోదు అని లేచి వెళ్తారు. ఇటువైపు కార్తీక్ తో భారతి మాట్లాడుతుంది. భారతి సారీ..నిన్ను అపార్థం చేసుకున్నాను అంటుంది. పర్లేదు, నేను అన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను అంటాడు కార్తీక్. మోనితను కూడానా అంటుంది భారతి. గుర్తుపెట్టుకునేంత గొప్పపని ఏం చేసిందని అంటాడు కార్తీక్…మర్చిపోయేంత చిన్నతప్పు కూడా చెయ్యలేదుగా అంటుంది. కార్తీక్..మోనిత వల్ల తన పడ్డ బాధను చెప్తూ..చిరిగిపోయిన అధ్యాయం అంటూ మాట్లాడతాడు. డాక్టర్ భారతి..మోనిత నీ జీవితభాగస్వామి కాకపోవచ్చు కానీ, నీ జీవితంలో ఒక భాగం అయింది అంటుంది. ఏంటి నువ్వు ఆ మోనితను సమర్థిస్తున్నావా అని అడుగుతాడు. వాస్తవం చెప్తున్నాను అంటుంది భారతి. నిజం తెలిసికూడా ఇలా మాట్లాడుతున్నావా అంటాడు. బంధం, సంబంధం లేదనొచ్చుకాని సైన్టిఫిక్ గా నువ్వే తండ్రివి అంటుంది భారతి.

జైల్లో ఉన్న మోనిత ఊచలు లెక్కపెడుతూ..ఏడు ఊచలు..నా కార్తీక్ ను పెళ్లిచేసుకోడానికి అడ్డం తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. మోనిత పెళ్లికూతరాయేనే అంటూ పాటుడుతుంది. ఇంతలో సుకన్య( కానిస్టేబుల్) వచ్చి ఏంటి మేడమ్ అంత హుషారుగా ఉన్నారు ఏదైనా గుడ్ న్యూస్ హా అని అడుగుతుంది. కార్తీక్ నా జీవితంలోకి వచ్చినప్పటినుంచే అన్నీ గుడ్ న్యూస్ లే అని తనకో హెల్ప్ చేయాలి అంటుంది. ఈ సుకన్య నేను మీ ఫ్యాన్ అయిపోయాను ఏం కావలన్నా చేస్తాను అంటుంది. మోనిత తనకు రిపోర్టర్ ఫ్రెండ్ ఉంది..తనను అర్జెంట్ గా పిలిపించాలి అంటుంది.. సుక్యన ఇంతేనా మేడమ్..మీ పనైపోయింది అనుకోండి అంటుంది. అలా ఆ సీన్ అయిపోతుంది.

దీప మిక్సీ తీసుకుని వారణాసి కారులో వెళ్తుంది. వారణాసి ఏడుస్తాడు. దీప అడుగుతుంది. వారణాసి కంట్లో దుమ్ముపడింది అంటాడు. కానీ మన వంటలక్క నమ్మదు. కారు ఆపమని ఇద్దరు కారు దిగుతారు. అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావ్ అని ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. వారణాసి డాక్టర్ బాబు గురించి అందరూ చెడ్డగా మాట్లాడుతున్నారు అక్కా..మా బస్తీలో వాళ్లంతా అంటున్నారు. మీ అక్క మొగుడు పెద్ద గ్రంథమే నడిపాడు కదా అంటున్నారు అక్కా అని బాధపడతాడు. ఈ విషయాలు అన్నీ వాళ్ల కెలా తెలుసు అంటే కోర్టు దివాన్ మా బస్తీలో ఉంటాడు అని చెప్పి ఇంకా నీచంగా అంటున్నారు అంటాడు. దీప ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోకూడదు అని ధైర్యం చెప్పి బయలుదెరతారు.

కారులో కుర్చుని మోనిత మాటలను తలుచుకుంటుంది. ఇంకోవైపు కార్తీక్ కూడా కారులో వస్తూ..డాక్టర్ భారతి అన్న మాటలను తలుచుకంటాడు. స్కూల్లో హిమ ఏడుస్తూనే ఉంటుంది. శౌర్య ఏడవకూ అంటూ ఓదారుస్తుంది.ఆ షైని చెప్పినవి అన్నీ నమ్మకు అంటుంది. నువ్వు నమ్మటం లేదా అని అడుగుతుంది హిమా. తప్పు చేసిన వాళ్లు జైల్లో ఉంటారు. తప్పు చేయని వాళ్లు బయట ఉంటారు అంటుంది శౌర్య. నాకు అందరూ అబద్ధాలు చెప్పారు అని హిమా ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.