కార్తీకదీపం: తాళికట్టమని కార్తీక్ ను బలవంతం చేసిన మోనిత..ఇంతలో దీప ఎంట్రీ.!

కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు దీప వాళ్ల అత్తకు కాల్ చేస్తే..అది కాస్త పిల్లలు చూస్తారు. నానమ్మ ఫోన్ లా వుందే అనుకుని చూసి దీప ఫుటో ఉండటంతో కాల్ లిఫ్ చేస్తారు. అత్తగారే అనుకుని దీప” అత్తయ్య బయలుదేరారా.! మనం డాక్టర్ బాబుని కలవడానికి వెళ్తున్నట్లు పిల్లలకు డౌట్ రాలేదుగా అంటుంది.. చిర్రేత్తిపోయిన శౌర్య..కోపంగా బయలుదేరారు..ఫోను ఇక్కడే మర్చిపోయారు అంటుంది. దీప ఎప్పుడు నేనే బలైయ్యేదాన్ని ఇప్పుడు వీళ్ల చేతుల్లో అత్తయ్యమావయ్యలు కూడా…ఇంటికి వెళ్లాక ఎంత రచ్చ చేస్తారో ఏమో అనుకుంటుంది..
ఇంతలో మోనితా..డాక్టర్ బాబు దగ్గరకు వెళ్తుంది.. డోర్ దగ్గర మోనితాను చూసిన కార్తీక్..కట్టేసి రోషిని మేడమ్ కు చూపిస్తే..లేదా ఎలాగో చంపాఅన్న నింద పడింది కదా చంపేస్తే అని మనసులో అనుకుంటాడు. మోనితా కార్తీక్ ముఖంలో తెగింపు ఏమి కనిపించటలం లేదే…నన్ను చంపేయాలనంత కసితో ఉండి ఉంటాడా..అనుకుంటుంది.. కార్తీక్ దగ్గరకు వచ్చి నీ మైండ్ లో ఏముందో నాకు తెలుసు, కానీ నా ప్లానింగ్ ఎలా ఉందో నీకు తెలియదు అని కార్తీక్ ను పడుకోపెట్టి హార్ట్ బీట్ చెక్ చేస్తూ.. ఏం ఆలోచించావ్ కార్తీక్ అంటుంది..బాగా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నావ్..గుండెవేగం పెరిగింది అంటుంది.. కార్తీక్ ను మోనితా ఇంకా బెదిరిస్తూ.. ఫ్యామిలి బాగుండాలా, మన ఫ్యామిలీ బాగుండాలా లేకా నీ ఫ్యామిలియో ఉండకుడదా అంటూ హెచ్చరిస్తుంది.. డాక్టర్ బాబుకు మైండ్ పిచ్చేకిపోతున్నా.. బయటకు మాత్రం ఏం చెయ్యలేక రెండు డైలాగ్స్ వేస్తాడు..నీ ప్రేమ రాక్షసప్రేమ నాకు అక్కర్లేదు అంటూ..దానికి మోనితాకూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది..బతికుండగానే ఏం అయినా సాధించాలి..చనిపోతే నాకు పిండం పెట్టే దిక్కు కూడా ఉండదు..అంటూ చెప్తుంది. ఇదిలా ఉండగా..దీప ఆసుపత్రికి వచ్చి అత్తమావలకోసం బయటే నిలపడుతుంది.
మోనిత తెగించేసి..తాళి తీసుకుని కార్తీక్ ను కట్టమని బలవంతం చేస్తుంది.. తాళి కడితే సహధర్మచారిణి అంటారు..కట్టకుంటే సహజీవనం అంటారు అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తుంది.. తాళి కడితే..ఇప్పుడే రోషిని మేడం దగ్గరకు వెళ్లి లొంగిపోతా అంటుంది. భవిష్యత్తు బాగుంటుంది..శిక్ష నుండి తప్పిస్తా అంటూ..కార్తీక్ ను బలవంతం చేస్తుంది. ఇంకోపక్క ఆసుపత్రికి సౌందర్యతప్ప వాళ్ల మావయ్య, మరిది వస్తారు.
వాళ్లు రావటం గమనించిన మోనితా..నార్మల్ గా డాక్టర్ బాబును చెక్ అప్ చేస్తుంది..దీపవాళ్లను చూసిన కార్తీక్ చెప్పేస్తే అనుకుంటాడు..కానీ మోనితా ఇన్ డై రెక్టక్ గా బెదిరిస్తుంది. నీకు ఎంతమంది పిల్లలు అంటుంది. పిల్లలను ఏమైనా చేస్తుందేమో అని కార్తీక్ అనుకుంటాడు..వాళ్లందరిని చూసిన మోనితా ఇదేమైనా ఫ్యామిలీ గెట్ టూ గెదరా అందరూ వచ్చేశారు. పేషంట్ కి రెస్ట్ కావాలి అంటుంది. మేము పోలీసులు పర్మిషన్ తీసుకునే వచ్చాం అని ఆనంద్ రావు అంటాడు..ఇంతలో కార్తీక్.. డాక్టర్ మీరు బయటకువెళితే నేను మా వాళ్లతో మాట్లాడుకోవాలి అంటాడు.. దానికి కోపం వచ్చిన మోనితా..అంటే ట్రీట్మెంట్ ఆపేసి వెళ్లాలా అని పోలీసులను పిలవబోతుంది..ఎస్సై గారు మీరు అక్కడే ఉన్నారా..ఉండండి నేను చెప్పే వరకు అని ఫోన్లో మాట్లాడుతుంది. ఇది నన్ను బెదిరిస్తుందని కార్తీక్ కు అర్థమవుతుంది.. దీపవాళ్లను దయచేసి బయటకు వెళ్లమని బతిమిలాడతాడు..దాంతో చేసేదేమిలేక వాళ్లు ఏడ్చుకుంటా బయటకువస్తారు. మోనితా మీ వాళ్లకు చెప్పాలని చూస్తే నేనేమైనా చేయగలుగుతా అని చెప్పి, మళ్లి వస్తా అని బయటకు వెళ్తుంది.
కార్తీక్ పరిస్థితి చూస్తే భయంగా ఉంది..రోషిణి మేడమ్ తో మాట్లాడి మన ఆసుపత్రికి షిఫ్ట్ చేయిద్దాం నువ్వు మాట్లాడు దీప ఆమె ఒప్పుకుంటుంది అని ఆనంద్ రావు అంటాడు…ఆ మాటలు మోనితా వింటుంది..ముందుకొచ్చి…శిక్ష పడితే ఫ్యామిలి ఏం అవుతుందో అని కార్తీక్ భయపడుతున్నాడు..చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది..లోపల ఉన్న కార్తీక్ కోపంతో, ఇంకో పక్క భయంతో అటుఇటు తిరుగుతూ..మోనితా మాటలు గుర్తుచేసుకుని భాదపడుతుంటాడు..ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.