ఫిల్మ్ నగర్ టాక్: “మా” ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్ ఇది!

-

అటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ – ఇటు మంచు విష్ణు ప్యానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న నేపథ్యంలో… తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఎవరికి కలిసి రానున్నాయి? పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రుల వార్ ఈ ఎన్నికల్లో ఎవరికి ఫేవర్ గా మారబోతోంది? మెగాఫ్యామిలీ అండదండలున్నాయని చెబుతున్న ప్రకాశ్ రాజ్ ప్యానల్ కి పవన్ తాజా రచ్చ ఎంత ప్లస్ – ఎంత మైనస్?

maa elections

ప్రస్తుతం సినీ విశ్లేషకుల ఆలోచనలతోపాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా తీవ్రంగా చర్చకు వస్తోన్న అంశం ఇదే. తాజాగా ఏపీసర్కార్ పై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రకాష్ రాజ్ ఇప్పటికే కర్రా ఇరక్కుండా పామూచావకుండా స్పందించారు. సూటిగా ప్రశ్నిస్తూ మాట్లాడే ప్రకాష్ రాజ్ ఇలా డిప్లమాటిక్ గా మాట్లాడటం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రకాష్ రాజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో పవన్ అనుకూల ఓట్లు ప్రత్యర్థికే పడతాయని అంటున్నారు విశ్లేషకులు!

పరిశ్రమలో వైసీపీ మద్దతుదారులంతా కచ్చితంగా విష్ణుకే సపోర్ట్ చేస్తారని గుసగుస వినిపిస్తోన్న పరిస్థితులు.. మోహన్ బాబు కూడా ఆ పార్టీకి తొలి నుంచి సన్నిహితుడు కావడంతో ఇప్పుడు యాంటీ పవన్ వర్గం లేదా ప్రో జగన్ వర్గం కూడా విష్ణుకే సపోర్ట్ గా నిలిచే అవకాశాలున్నాయంట. ఇదే క్రమంలో… పవన్ ఇండస్ట్రీ తరుపున వ్యాఖ్యలంటే చేసారు గానీ.. నిత్యం పరిశ్రమని అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి కాదంటూ… చాపకింద నీరులా ఒక విమర్శ కూడా ఇండస్ట్రీవర్గాల్లో నడుస్తుందంట! ఇది కూడా విష్ణుకు కలిసొచ్చే అంశం అంటున్నారు విశ్లేషకులు!

అదేవిధంగా… పవన్ విషయంలో విష్ణు స్పందించిన విధానం కూడా ఆ ప్యానల్ కు కలిసొచ్చే అంశంగా అభివర్ణిస్తున్నారు పెద్దలు! తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, నటుడిగా.. ఛాంబర్ వారు ఏపీ ప్రభుత్వానికి బాసటగా ఇచ్చిన లేఖ సారంతో ఏకీభవిస్తున్నాను అని విష్ణు ప్రకటించారు. అంటే…  పవన్ ని వ్యతిరేకిస్తున్నాను అని విష్ణు నేరుగా చెప్పడమే. దీంతో విష్ణుకు పవన్ వ్యతిరేక వర్గం ఓట్లు కూడా పడతాయనడంలో సందేహం లేదనేది కూడా కొందరు సినీ పెద్దలు చెబుతున్న మాట.

ఏది ఏమైనా… తన రచ్చతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ ని ఇరకాటంలో పాడేసిన పవన్… పరోక్షంగా విష్ణుకు ప్లస్ అయ్యే పరిస్థితులు కల్పించారని ఫిల్మ్ నగర్ టాక్!!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news