స్థిరంగా బంగారం ధరలు.. వెండి మాత్రం భారీ షాక్‌..!

-

బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. పసిడి ధర దేశీ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో ఏకంగా రూ.500కు పైగా పడిపోయింది. అయితే నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఎటువంటి మార్పులూ లేకుండా స్థిరంగా నిలిచాయి. 08.11.2019 శుక్రవారం శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,580 రూపాయల వద్ద ఉంది. అయితే, వెండి ధరలు మాత్రం పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 250 రూపాయలు తగ్గి 48,750 రూపాయలకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,550 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 37,350 రూపాయల వద్ద కదల కుండా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో 48,750 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news